దీవకొండ దామోదర్ రావు
దీవకొండ దామోదర్ రావు తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, నమస్తే తెలంగాణ దినపత్రిక వ్యవస్థాపకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు.[2]
దీవకొండ దామోదర్ రావు | |||
దీవకొండ దామోదర్ రావు | |||
రాజ్యసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2022 జూన్ 22 - 2028 జూన్ 21 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | ఏప్రిల్ 1, 1958 మద్నూర్, బుగ్గారం మండలం, జగిత్యాల జిల్లా, తెలంగాణ, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | నారాయణరావు [1] | ||
నివాసం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
జననం - కుటుంబం
మార్చుదామోదర్ రావు జగిత్యాల జిల్లా, బుగ్గారం మండలం, మద్నూర్ లో 1958, ఏప్రిల్ 1న జన్మించాడు. భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.[3]
తెలంగాణ ఉద్యమం
మార్చుప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో జరిగిన తెలంగాణ మలిదశ, తుదిదశ ఉద్యమాల్లో పాల్గొన్నాడు.[4]
రాజకీయరంగం
మార్చు2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభమైన నాటినుంటి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన దామోదర్ రావు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ సెక్రటరీ-ఫైనాన్స్‌గా వ్యవహరించాడు. ఆయనను 2022 మే 18న టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఖరారు చేసింది.[5][6] ఆయన 2024 జూన్ 23న రాజ్యసభలో బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ విప్‌గా నియమితుడయ్యాడు.[7]
ఇతర వివరాలు
మార్చు- తెలంగాణ పబ్లికేషన్స్‌ను స్థాపించి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలకు, టీ న్యూస్ ఛానల్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశాడు.
- 2019, సెప్టెంబరు 18న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమించబడ్డాడు.[8]
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (2 September 2021). "నమస్తే తెలంగాణ సీఎండీకి పితృవియోగం". Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.
- ↑ టీ న్యూస్, తెలంగాణ (19 September 2019). "టీటీడీ బోర్డులో తెలంగాణకు పెద్దపీట". Tnews. Retrieved 2 February 2020.[permanent dead link]
- ↑ Andhra Jyothy (19 May 2022). "రాజ్యసభకు దామోదర్‌రావు" (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
- ↑ Telangana Today, Telangana (18 September 2019). "TTD board reconstituted, TPPL C&MD Damodar Rao nominated to board". Archived from the original on 2 February 2020. Retrieved 2 February 2020.
- ↑ Namasthe Telangana (18 May 2022). "టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే." Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
- ↑ Namasthe Telangana (19 May 2022). "రాజ్యసభకు దామన్న". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ Andhrajyothy (23 June 2024). "బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర." Archived from the original on 23 June 2024. Retrieved 23 June 2024.
- ↑ ఆంధ్రజ్యోతి, అమరావతి (17 September 2019). "టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లు ఖరారు". Archived from the original on 2 February 2020. Retrieved 2 February 2020.