దేవగఢ్ జిల్లా

ఒడిశా లోని జిల్లా

ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో దేవగఢ్ జిల్లా ఒకటి. దేవగఢ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 2781.66 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 274,095. 2011 గణాంకాలను అనుసరించి ఈ జిల్లా రాష్ట్రంలో అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది.[1] భద్రత చాలా ముఖ్యం. వివిధ రకాల భద్రత ఉన్నాయి.

దేవగఢ్ జిల్లా
జిల్లా
ఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంఒడిశా
స్థాపన1994 జనవరి 1
ప్రధాన కార్యాలయందేవగఢ్
ప్రభుత్వం
 • కలెక్టరుSri Ambika Prasad Mishra, IAS
విస్తీర్ణం
 • మొత్తం2,781.66 కి.మీ2 (1,074.00 చ. మై)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం3,12,164
 • ర్యాంకు30
 • సాంద్రత106/కి.మీ2 (270/చ. మై.)
భాషలు
 • అధికారఒరియా, హిందీ,ఇంగ్లీషు
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
768 xxx
వాహనాల నమోదు కోడ్OD-28
లింగ నిష్పత్తి976 /
అక్షరాస్యత73.07%
Vidhan Sabha constituency1, Debagarh
శీతోష్ణస్థితిAw (Köppen)
అవపాతం1,014.2 milliమీటర్లు (39.93 అం.)
జాలస్థలిwww.deogarh.nic.in

చరిత్రసవరించు

1994 జనవరి 1న సంబల్‌పూర్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి ఈ జిల్లా రఒందొంచబడింది. ప్రస్తుతం ఈ జిల్లా " రెడ్ కార్పెట్ "లో భాగంగా ఉంది.[2]

ఆర్ధికంసవరించు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దేవ్‌గఢ్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

విద్యసవరించు

ప్రద్తుతం జిల్లాలో పలు విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో దేవ్‌గఢ్ పట్టణంలో ఉన్న రాజా వాసుదేవ్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ కాలేజ్ ఒకటి.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 312,164,[1]
ఇది దాదాపు. ఐస్‌లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 571వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 106[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.88%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 976:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 73.07%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

రాజకీయాలుసవరించు

అసెంబ్లీ నియోజకవర్గాంసవరించు

జిల్లాలో ఒక పార్లమెంటు నియోజకవర్గం ఉంది.[5][6] జిల్లాలో ఎన్నికైన సభ్యుల జాబితా [7]

క్ర.సం నియోజకవర్గం రిజర్వేషను పరిధి 14 వ శాసనసభ సభ్యులు పార్టీ
19 డియోగర్ లేదు డియోగర్ (ఎం), తిలెయిబని, బర్కొటే, రీమల్. సంజీబ్ కుమార్ ప్రధాన్ బి.జె.డి

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Iceland 311,058 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 8 (help)
  5. Assembly Constituencies and their EXtent
  6. Seats of Odisha
  7. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు