దేవనహళ్ళి

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు గ్రామీణ జిల్లాకు చెందిన ఒక పట్టణం.
  ?దేవనహళ్లి
కర్ణాటక • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 13°14′N 77°42′E / 13.23°N 77.7°E / 13.23; 77.7
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా (లు) బెంగుళూరు గ్రామీణ జిల్లా
జనాభా 23,190 (2001 నాటికి)


దేవనహళ్ళి (పాత పేర్లు దేవనదొడ్డి, దేవనపుర, యూసుఫాబాద్) కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు గ్రామీణ జిల్లాకు చెందిన ఒక పట్టణం.[1] ఇది బెంగుళూరు నగరానికి 30 కి.మీ.ల దూరంలో ఉంది.ఇది బెంగుళూరు గ్రామీణ జిల్లాలో ఉన్న నాలుగు శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి.దేవనహళ్ళి నియోజకవర్గం షెడ్యూల్డు కులాలకు రిజర్వు చేయబడింది.[1] 2013లో ఈ నియోజకవర్గం నుండి జేడీఎస్‌ అభ్యర్థి పిళ్ళముని శ్యామప్ప శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

వేణుగోపాలస్వామి దేవస్థానం

దేవనహళ్ళి కోట

మార్చు
 
దేవనహళ్ళి కోట

దేవనహళ్ళి తొలుత గంగవాడిలో భాగంగా ఉండేది. తరువాత ఇది రాష్ట్రకూటుల పాలనలోకి వచ్చింది. ఈ ప్రాంతాన్ని రాష్ట్రకూటులు, నోలంబులు, పల్లవులు, చోళులు, హొయసలులు, విజయనగర పాలకులు వరుసగా పాలించారు. ఈ కోటను సా.శ.1501లో విజయనగర సామ్రాజ్యపు సామంతరాజైన అవతి రాజు మల్లబైరేగౌడ దేవనదొడ్డి (ప్రస్తుతం దేవనహళ్ళి) లో కట్టించాడు. ఈ కోట సా.శ.1747లో మైసూరు సామ్రాజ్యపు ఒడయారు రాజుల ఆధీనంలోకి వచ్చింది. తరువాత ఇది పలుమార్లు మరాఠాల హస్తగతమై చివరకు హైదర్ అలీ, టిప్పు సుల్తానుల ఆధీనంలోకి వచ్చింది. టిప్పు సుల్తానుకు ఇది జన్మస్థలం మాత్రమే కాక మృగయావినోదానికి ఇష్టమైన ప్రదేశం. సా.శ.1791లో ఈ కోట లార్డ్ కార్న్‌వాలిస్ వశమైంది. ఈ కోట అండాకారపు ఆకృతిలో విశాలమైన ప్రాకారంతో 12 అర్ధవలయాకారపు బురుజులతో రాళ్ళు, ఇటుక, గారలతో నిర్మించబడి ఉంది. ఈ కోటకు తూర్పు, పడమర దిశలలో ప్రవేశద్వారాలున్నాయి.[2]

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం

మార్చు

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కారణంగా బెంగళూరు గ్రామీణ జిల్లా, దేవనహళ్ళి తాలూకా ప్రపంచపటంలో గుర్తింపు పొందింది. 2008, మే 23వ తేదీన కర్ణాటక రాష్ట్రపు మొట్టమొదటి అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ ప్రారంభించబడింది. బెంగళూరు నగరం నుండి సుమారు 32 కి.మీ.దూరంలో ఉన్న ఈ విమానాశ్రయానికి రహదారి మార్గాలు అనుసంధానమై ఉన్నాయి. "హైస్పీడ్ రైలు", "ఎక్స్‌ప్రెస్ వే" మార్గాల బ్లూప్రింట్ తయారు చేయబడింది. టాక్సీ సౌకర్యం, ప్రతి 15 నిమిషాలకొక కె.ఎస్.ఆర్.టి.సి.బస్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది. బెంగళూరు ఏ మూల నుండి ఐనా గంట, గంటన్నరలోపు విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ప్రయాణీకుల సౌకర్యం కొరకు "బి.ఐ.ఎ.ఎల్ సహాయవాణి" సౌలభ్యం ఉంది. సహాయవాణి సంఖ్య:40581111 ద్వారా విమానాశ్రయానికి రవాణా సౌకర్యాల వివరాలు, ఇతర సాధారణ విషయాలు ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. విమానాశ్రయంలో 53 చెక్-ఇన్ కౌంటర్లు, 18 స్వయం పరిశీలన యంత్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. పిల్లల సౌకర్యం కొరకు ఔషధాలయం, డయాపర్లు మార్చుటకు, పిల్లలకు పాలుత్రాగించడానికి ప్రత్యేక స్థలాలు ఉన్నాయి.

ఇతర విశేషాలు

మార్చు

దేవనహళ్ళి టిప్పు సుల్తాన్ జన్మించిన ప్రదేశం. టిప్పు సుల్తాన్ కోట ఇక్కడి పర్యాటక స్థలం. డి.వి.గుండప్ప నివసించిన పాత ఇల్లు ఇక్కడ ఉంది. ఈ పట్టణం "పంపర పనస" పళ్ళకు ప్రసిద్ధి. ఇక్కడి నుండి పంపరపనస పళ్ళు దుబాయ్, షార్జా మొదలైన ప్రదేశాలకు ఎగుమతి అవుతాయి.

దేవాలయాలు

మార్చు

ఈ పట్టణంలో వేణుగోపాలస్వామి దేవస్థానం, చంద్రమౌళీశ్వర దేవస్థానం పేరు గడించినవి.ప్రతి దీపావళికి చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో లక్షదీపోత్సవాలు కన్నులపండుగగా జరుగుతాయి. పురాతనమైన నగరేశ్వర దేవాలయం సమీపంలోని విజయపురలో ఉంది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-26. Retrieved 2020-02-26. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. కోట ద్వారం ముందున్న సమాచార ఫలకం ఆధారంగా

బయటి లింకులు

మార్చు