దేవరకొండ భిక్షపతి

(దేవరకొండ బిక్షపతి నుండి దారిమార్పు చెందింది)

దేవరకొండ బిక్షపతి ప్రముఖ కవి, గాయకుడు. ఆయన తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చేందుకు, సమాజాన్ని మేల్కొల్పేందుకు అనేక పాటలు రాసి పాడారు.[1]

జీవిత విశేషాలు

మార్చు

ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, బయ్యారం నకు చెందినవారు. ఆయన చిన్నప్పటి నుండి పాటల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆద్వర్యంలో పలు పాటలు పాడి ప్రజలను ఉద్యమాలకు ఆకర్షితులను చేశారు. ఆ తరువాత కొంతకాలం ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ పాటమ్మ పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్ని ప్రజాయుద్ధనౌక గద్దర్చే 2005 లో బయ్యారంలో ఆవిష్కరింపచేసి కళాకారునిగా, కవిగా రాష్ట్రవ్యాప్తంగా పేరును సంపాదించుకున్నారు. ఆ తరువాత ఉద్యోగాన్ని వదిలేసి తెలంగాణవ్యాప్తంగా నిర్వహించిన పలు దూం. దాం కార్యక్రమాల్లో పాల్గొన్న భిక్షపతి తన ఆట, పాటల ద్వారా ప్రత్యేకతను చాటుకున్నారు. [2]

నిన్ను విడిచి ఉండలేనమ్మా... పాట

మార్చు

ఆయన "నిన్ను విడిచి ఉండలేనమ్మా ...ఓ పాటమ్మ ఎన్నడూ మరచిపోనమ్మా ...నా పాటమ్మ" అనే పాటను వ్రాసి తెలంగాణ ఉద్యమ ధూంధాం పాల్గొన్న ప్రతీ కార్యక్రమంలో పాడి వినిపించేవారు.[3] నిజానికి ధూందాంలో ఈ పాట పాడకముందు తాను జిల్లా స్థాయికే పరిమితం. తర్వాత తాను తెలంగాణం. ఇట్లా మలిదశ ఉద్యమంలో తాను ఎన్ని పాటలు రాసినప్పటికీ తెలంగాణ దక్పథం, వారసత్వం, విప్లవం అన్నీ కలగలసిన ఒక పాట రాయడం, అది ధూందాం ద్వారా ప్రతి హదయాన్ని చేరుకోవడం తనకు నిజంగానే ప్రాచుర్యాన్ని ఇచ్చింది.[4]

తెలంగాణ ఉద్యమంలో...

మార్చు

తెలంగాణకు ఆంధ్రా వలస పాలకులు చేస్తున్న ఆన్యాయంపై, రాష్ట్రం రావటం వల్ల జరిగే అభివృద్ధిని పాటల ద్వారా వివరించి ప్రజలను చైతన్యవంతం చేశారు. ఉద్యమం సందర్భంగా అనేకసార్లు జైలు జీవితాన్ని అనుభవించారు. ఉద్యమ సమయంలో పోలీసులు నిర్బంధించినప్పడు, పోలీసుల ఇబ్బందులపైనా పాటను రాసి ప్రశంసలు అందుకున్నారు. ఉద్యమకాలంలో భిక్షపతి సేవలను గుర్తించిన ప్రభుత్వం, సాంస్కృతిక సారథి ఉద్యోగాన్ని ఇచ్చిగౌరవించింది.[5]

ఆయన గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ సెప్టెంబరు 3 2015 న మరణించారు.

మూలాలు

మార్చు
  1. "కవి, గాయకుడు దేవరకొండ బిక్షపతి కన్నుమూత". Archived from the original on 2015-09-05. Retrieved 2015-09-04. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. పాటమ్మను విడిచిన భిక్షపతి
  3. "కవి దేవరకొండ బిక్షపతి కన్నుమూత". Archived from the original on 2015-09-04. Retrieved 2015-09-04. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. కవి సమయం దేవరకొండ భిక్షపతి[permanent dead link]
  5. "కళాకారుడు భిక్షపతి మృతి". Archived from the original on 2015-09-07. Retrieved 2015-09-05. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

ఇతర లింకులు

మార్చు