దేవీ పుత్రుడు

2001 సినిమా

దేవీ పుత్రుడు 2001లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, సౌందర్య, అంజలా జవేరి ముఖ్య పాత్రల్లో నటించారు.[1] మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఫాంటసీ డ్రామా గా వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో భారీ వ్యయంతో రూపొందించబడింది. కాని వాణిజ్య పరంగా పరాజయాన్ని చవిచూసింది. ద్వాపర యుగంలో నీట మునిగిన ద్వారక ఈ సినిమా కథకు ఆధారం.

దేవీ పుత్రుడు
దర్శకత్వంకోడి రామకృష్ణ
నిర్మాతఎమ్మెస్ రాజు
రచనజొన్నవిత్తుల రామలింగేశ్వరరావు (సంభాషణలు)
కథసుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
నటులుదగ్గుబాటి వెంకటేష్
అంజలా జవేరి
సౌందర్య
సంగీతంమణిశర్మ
ఛాయాగ్రహణంఎస్. గోపాల రెడ్డి
కూర్పుతాతా సురేష్
నిర్మాణ సంస్థ
విడుదల
15 జనవరి 2001 (2001-01-15)
నిడివి
162 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు
ఖర్చు15 కోట్లు

కథసవరించు

కృష్ణ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. సత్య విదేశాల్లో చదువుకుంటూ హైదరాబాదులో ఉన్న తల్లిదండ్రుల దగ్గరకు వస్తుంది. వస్తూనే తన అక్క కరుణ కోసం వాకబు చేస్తుంది. గుజరాత్ లో ఉన్న ద్వారక లో సముద్రం అడుగున ఉన్న అలనాటి ద్వారక గురించిన ఆనవాళ్ళపై పరిశోధన చేయడానికి వెళ్ళిందని తెలుస్తుంది. కరుణ అక్కడే తన సహోద్యోగియైన బలరాంను ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. కానీ ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో ఆమె ఎన్ని ఉత్తరాలు రాసినా పట్టించుకోకుండా ఉంటారు. ఒక ఉత్తరంలో ఆమె తల్లి కాబోతున్నట్లు తెలియజేస్తుంది. అక్క అంటే వల్లమాలిన ప్రేమ కలిగిన సత్య ఎలాగైనా ఆమెను హైదరాబాదుకు తీసుకు రావాలని తాతయ్య పేరయ్య తో కలిసి బయలు దేరుతుంది. ఎవరో వజ్రాలు తీసుకుని విమానం దిగుతున్నారని తెలుసుకున్న కృష్ణ పొరపాటున పేరయ్య, సత్యవతి దగ్గర వజ్రాలున్నాయని వారిని తన ట్యాక్సీలో ఎక్కించుకుని బయలుదేరతాడు.

తారాగణంసవరించు

పాటలుసవరించు

ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలున్నాయి.[2]

మూలాలుసవరించు

  1. "ఫిల్మీ బీట్ లో దేవీపుత్రుడు". filmibeat.com. Retrieved 17 March 2017. CS1 maint: discouraged parameter (link)
  2. "naasongs.com లో దేవీపుత్రుడు పాటలు". naasongs.com. Retrieved 17 March 2017. CS1 maint: discouraged parameter (link)