దేవ్
దేవ్ 2019లో విడుదలైన తెలుగు సినిమా. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించాడు. కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, రమ్యకృష్ణ , ప్రకాష్‌రాజ్, ఆర్జే విఘ్నేష్‌కాంత్, అమృత శ్రీనివాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14, 2019న విడుదలైంది.[1]
దేవ్ | |
---|---|
దర్శకత్వం | రజత్ రవిశంకర్ |
నిర్మాత | ఎస్ లక్ష్మణ్ కుమార్, బి. మధు |
తారాగణం | కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, రమ్యకృష్ణ , ప్రకాష్‌రాజ్ |
ఛాయాగ్రహణం | ఆర్. వేల్ రాజ్ |
కూర్పు | రూబెన్ |
సంగీతం | హారిస్ జయరాజ్ |
నిర్మాణ సంస్థ | ప్రిన్స్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 14 ఫిబ్రవరి 2019 |
సినిమా నిడివి | 159 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుదేవ్ రామ లింగం మూర్తి (కార్తి) లైఫ్‌లో ప్రతి మూమెంట్‌ను ఎంజాయ్ చేయాలనీ అడ్వెంచరస్ ట్రావెల్ అంటే ఇష్టమున్నవ్యక్తి. అలాంటి వ్యక్తి తన ప్రయాణంలో మేఘన (రకుల్ ప్రీత్ సింగ్) చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అంతేకాదు తనను ప్రేమించమని వెంటపడతాడు. ఇక ఆమెకు నచ్చలేదని తెలుసుకొని పక్కకు తప్పుకుంటాడు కార్తి. ఆ తర్వాత మెల్ల మెల్లగా కార్తి మంచితనాన్ని తెలుసుకున్న రకుల్ అతని ప్రేమలో పడుతోంది. ఆ తర్వాత కార్తి తనకు టైమ్ ఇవ్వడం లేదని అతనికి దూరమవుతోంది. ఈ బాధలో ట్రావెల్ చేస్తోన్న కార్తి యాక్సిడెంట్‌కు గురి అవుతాడు. ఆ తర్వాత దేవ్, మేఘన జీవితంలో ఏం జరుగిందనేదే అనేది మిగతా సినిమా కథ.[2][3]
నటీనటులు
మార్చు- కార్తీ
- రకుల్ ప్రీత్ సింగ్
- ప్రకాష్‌రాజ్
- రమ్యకృష్ణ
- ఆర్జే విఘ్నేష్‌కాంత్
- అమృత శ్రీనివాసన్
- రేణుక
- నిక్కీ గల్రానీ
- సంతోష్ ప్రతాప్
- రేతిక శ్రీనివాస్
- టి.ఎం. కార్తీక్
- కార్తీక్ (అతిధి పాత్రలో)
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ప్రిన్స్ పిక్చర్స్
- నిర్మాత: ఎస్. లక్ష్మణ్ కుమార్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రజత్ రవిశంకర్
- సంగీతం: హారిస్ జయరాజ్
- సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్ రాజ్
- ఎడిటర్: ఆంటోని ఎల్. రూబెన్
పాటలు
మార్చుఅన్ని పాటల రచయిత చంద్రబోస్.
క్రమసంఖ్య | పేరు | Artist(s) | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "చెలియా అడుగుదామా" | హరిహరన్, క్రిస్టోఫర్ స్టాన్లీ, టిప్పు , క్రిష్ , అర్జున్ చాండీ, భరత్ సుందర్, శరణ్య గోపినాథ్ | 5:58 | ||||||
2. | "రేయ్ బావా దేవ్" | బెన్నీ దయాల్, వెల్ మురుగన్ , మాళవిక మనోజ్, దీపికా | 5:03 | ||||||
3. | "షీ ఇస్ మై గర్ల్" | హరిచరణ్ , క్రిస్టోఫర్ స్టాన్లీ, మహతి | 3:53 | ||||||
4. | "ఒక వంద సార్లు" | డి. సత్యప్రకాష్ , శక్తిశ్రీ గోపాలన్ | 5:10 | ||||||
5. | "నన్ను వీడి ఇత్తొ" | ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం | 5:11 | ||||||
25:15 |
మూలాలు
మార్చు- ↑ 10TV (12 January 2019). "జనవరి 14న ఆడియో - ఫిబ్రవరి 14న సినిమా" (in telugu). Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (14 February 2019). "'దేవ్' మూవీ రివ్యూ". Archived from the original on 12 August 2021. Retrieved 12 August 2021.
- ↑ The New Indian Express (14 February 2019). "Dev Review: A middling romance fraught with problems" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2020. Retrieved 12 August 2021.