చారిత్రికంగా వివిధ దేశాల, లేదా ప్రాంతాల జిడిపి-పిపిపి - List of countries by past GDP (PPP) - ఈ జాబితాలో ఇవ్వబడింది.
స్థూల దేశీయ ఆదాయం ('జిడిపి' లేదా 'GDP') అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల, సేవల విలువ. ఇది రెండి విధాలుగా గణించ బడుతుంది - 'నామినల్' విధానం, 'కొనుగోలు శక్తి సమతులన' ఆధారం (పిపిపి) - purchasing power parity (PPP).
ఈ జాబితాలో 'కొనుగోలు శక్తి సమతులన' (పిపిపి) విధానంలో జిడిపి ఇవ్వబడింది. కనుక దీనిని "నిజమైన జిడిపి" (Real versus nominal value) అని అనవచ్చును.
ఇది చారిత్రికమైన కాలానికి చెందిన జాబితా గనుక ఇందులో పెద్ద యెత్తున అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో వాడే గణాంక ఆధారాలు పాత కాలానికి దాదాపు అసలు లేవు. అంతే గాకుండా ఆయా కాలాలలో జనాభా అంచనాలలో కూడా పెద్దపెట్టున వ్యత్యాసాలు ఉన్నాయి. (కొన్ని అంశాలలో 50% పైబడి కూడా). కనుక ఈ జాబితాలోని వివరాలు ఆ కాలపు పరిణామ సూచికల క్రమం (order of magnitude) గామాత్రమే పరిగణించాలి.
ఈ లెక్కలు మిలియన్ అంతర్జాతీయ డాలర్లలో ఇవ్వబడ్డాయి.
చారిత్రికంగా వచ్చిన రాజకీయ, ఆర్థిక మార్పుల కారణంగా ఈ జాబితాలలో "దేశం" అన్నపదం ఆ దేశ ప్రాంతానికి వర్తిస్తుంది. ఇప్పటి ఒక దేశం గత కాలంలో అనేక రాజ్యాలుగా ఉండి ఉండవచ్చును. లేదా గతంలో ఒక రాజ్యం ఇప్పుడు చాలా దేశాలుగా అయిఉండవచ్చును. కనుక 1500 సంవత్సరానికి పూర్వం ప్రాంతాలను అధిగమించి ఉన్న అనేక సామ్రాజ్యాలు (అరబ్ సామ్రాజ్యం, మంగోలియన్ సామ్రాజ్యం వంటివి) ఈ జాబితాలో కలుపబడలేదు.
ఈ జాబితాలో ఉన్న సమాచారం చాలా వరకు ఆర్ధిక చరిత్రకారుడు అయిన ఆంగస్ మాడిసన్ (Angus Maddison - former head of the Organisation for Economic Co-operation and Development) కూర్చిన అంచనాలు. ఇతర ఆర్థిక శాస్త్రవేత్తలు కూర్చిన సమాచారం కూడా తీసుకొనబడింది. వివిధ ఆర్థిక వేత్తల జాబితాలలో ర్యాంకులలో వ్యత్యాసం ఉన్నదని గమనించాలి.
1న శతాబ్దం నుండి 1998 వరకు అంచనాలు మిలియన్ అంతర్జాతీయ డాలర్లలో ఇవ్వబడ్డాయి.
↑ 4.04.14.2These estimates refer to the combined economy of the various states located in the region now corresponding to the అమెరికా సంయుక్త రాష్ట్రాలు.
Raymond W. Goldsmith. "An estimate of the size and structure of the national product of the Early Roman Empire", Journal of the International Association for Research in Income and Wealth, Series 30 (p. 263 - 288), 1984.