దేశిరాజు భారతీదేవి
జీవిత వివరాలు
మార్చుదేశిరాజు భారతీదేవి 1914 జూలైలో బాపట్ల లో జన్మించారు. ఈమె న్యాయవాది చంద్రమౌళి చిదంబరరావు గారి దౌహిత్రి. ఈమె తల్లి అన్నపూర్ణమ్మ ఉన్నవ లక్ష్మీబాయమ్మతో కలిసి దేశసేవలో పాల్గొన్నారు. 1928 లో కంకటపాలెంకు చెందిన దేశిరాజు రామచంద్రరావు తో వివాహం జరిగింది.. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు. వీరి కుమారుడు ప్రసిద్ధ రంగస్థల నటుడు దేశిరాజు శ్రీమన్నారాయణమూర్తి డి.ఎస్.ఎన్. మూర్తి .1979 మే 9 న హైదరాబాదులో పరమపదించారు.
'స్త్రీలకు నీతిసౌశీల్యములే ప్రధానములు. అవిలేని విద్య విద్య కాదు.సుందరులందరికీ భావములు తప్పక అనుసరణీయములు.' అని తన అభిప్రాయము తెలిపిరి.
విద్యావ్యాసంగం
మార్చుఈమె తండ్రివద్దనే భారత, బాగవతాది గ్రంథములు పఠించి, విజ్ఞానవంతురాలు అయేరు. చిన్నతనములోనే వ్యాసరచన, పద్య, గద్యరచనలలో ప్రావీణ్యం సంపాదించేరు. ఆకాశవాణిలో ప్రసంగములు, కాళిదాసు శకుంతల, ఉత్తరకాండ సీత, సూరన ప్రణీతమైన కళాపూర్ణోదయములోని సుగాత్రి పాత్రపై విమర్శనము - ఆమె రచనాపాటవమునకు మచ్చు.
రచనలు
మార్చు- కాంతాశతకము (కందపద్యములతో)
- ముక్తాంబ, సత్యాప్రతిజ్ఞ అను ఏకాంకికలు
- శ్రీకృష్ణమహిమార్ణవము అను వచన గ్రంథము
- ముద్దుకృష్ణ అను గీతపద్య శతకము
పురస్కారాలు
మార్చు- 1958లో గృహలక్ష్మి స్వర్ణకంకణము పొందేరు.
- 1956లో “కవిత్రయ కవితారీతులు-తరువాతి కవులపై వారి ప్రభావము” అను విమర్శనాగ్రంథము రచించి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ గారిచేతులమీదుగా బహుమతి నందిరి.
బయటి వనరులు
మార్చు- గూడ సుమిత్రాదేవి. గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీతలు సిద్ధాంతగ్రంథం. 1988.