దొంగ గారూ స్వాగతం

దొంగ గారూ స్వాగతం 1987 లో వచ్చిన తెలుగు యాక్షన్, కామెడీ, డ్రామా చిత్రం. జి. రామమోహనరావు రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణ, విజయశాంతి ప్రధానపాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం అందించాడు. శుభోదయ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై వై.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

దొంగ గారూ స్వాగతం
(1987 తెలుగు సినిమా)
Dongagaru.jpg
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం వై. సత్యనారాయణ
తారాగణం కృష్ణ,
రాధ,
జగ్గయ్య,
గుల్లపూడి మారుతీరావు,
గిరిబాబు,
సుధాకర్
సంగీతం కె. చక్రవర్తి
నేపథ్య గానం రాజ్ సీతారాం,
ఎస్. జానకి
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
నిర్మాణ సంస్థ శుభోదయ ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 1987 డిసెంబరు 31
భాష తెలుగు

ఈ చిత్రం 1987 డిసెంబరు 29 న మద్రాసులోని సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం నుండి యు సర్టిఫికేట్ పొందింది. 1987 డిసెంబరు 31 న విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్టైంది..[1] ఇది నటుడు కృష్ణకు 253 వ చిత్రం.

కృష్ణ, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ల మధ్య సంబంధాలు సరిగా లేని కాలంలో వచ్చిన సినిమా ఇది. ఆ కాలంలో బాలు స్థానంలో కృష్ణ ప్రోత్సహించిన రాజ్ సీతారామే ఈ సినిమా లోనూ పాడాడు.[2][3]

నటి నటులుసవరించు

ఇతర వివరాలుసవరించు

  • దర్శకత్వం: కోడి రామకృష్ణ
  • సంగీత దర్శకుడు: చక్రవర్తి
  • నిర్మాణ సంస్థ: శుభోదయ ఆర్ట్ ప్రొడక్షన్స్

పాటలుసవరించు

పాట రచయిత సంగీతం గాయకులు
దొల్లు పుచ్చకాయలాగా వేటూరి సుందరరామ్మూర్తి కె. చక్రవర్తి జానకి, రాజ్ సీతారాం
దూరం దూరం వేటూరి సుందరరామ్మూర్తి కె. చక్రవర్తి జానకి, రాజ్ సీతారాం
ఉయ్యాల ఉయ్యాల వేటూరి సుందరరామ్మూర్తి కె. చక్రవర్తి జానకి, రాజ్ సీతారాం
ఒకె చేసుకో వేటూరి సుందరరామ్మూర్తి కె. చక్రవర్తి జానకి, రాజ్ సీతారాం
నా గుట్టునే వేటూరి సుందరరామ్మూర్తి కె. చక్రవర్తి జానకి

మూలాలుసవరించు

  1. "Donga Garu Swagatham Censor Report". Archived from the original on 2020-07-29. Retrieved 2020-08-04.
  2. "కృష్ణతో వివాదం గురించి ఎస్పీ బాలు". www.telugu.filmibeat.com. 23 January 2012. Archived from the original on 19 December 2018. Retrieved 19 December 2018.
  3. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 126.