దొంగ (2019 సినిమా)
దొంగ 2019లో విడుదలైన తెలుగు సినిమా. వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ బ్యానర్ల పై జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. కార్తీ , జ్యోతిక, సత్యరాజ్, నిఖిలా విమల్, షావుకారు జానకి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో తంబి పేరుతో తెలుగు దొంగ పేరుతో 20 డిసెంబర్ 2019న విడుదలైంది.
దొంగ | |
---|---|
![]() | |
దర్శకత్వం | జీతూ జోసెఫ్ |
స్క్రీన్ ప్లే | రెన్సిల్ డి 'సిల్వా సమీర్ అరోరా జీతూ జోసెఫ్ కే. మణికందన్ ] |
కథ | రెన్సిల్ డి 'సిల్వా సమీర్ అరోరా |
నిర్మాత | 18 మోషన్ పిక్చర్స్ సూరజ్ సాధన |
తారాగణం | కార్తీ , జ్యోతిక, సత్యరాజ్, షావుకారు జానకి , నిఖిలా విమల్ |
ఛాయాగ్రహణం | ఆర్‌డీ రాజశేఖర్ |
కూర్పు | వి.ఎస్.వినాయక్ |
సంగీతం | గోవింద్ వసంత |
నిర్మాణ సంస్థలు | వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ |
పంపిణీదార్లు | వయాకామ్ 18 స్టూడియోస్ |
విడుదల తేదీ | 2019 డిసెంబరు 20 |
సినిమా నిడివి | 151 నిమిషాలు |
దేశం | ![]() |
భాష | తెలుగు |
కథ సవరించు
15 సంవత్సరాల క్రితం ఇంట్లోంచి పారిపోయిన ఙ్ఞాన మూర్తి (సత్య రాజ్) తప్పి పోయిన తన కుమారుడు శర్వా కోసం వెతుకుతుంటాడు. ఙ్ఞాన మూర్తి కుమార్తె పార్వతి(జ్యోతిక) కూడా తన తమ్ముడి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. గోవాలో చిన్న చిన్న దొంగతనాలు, చీటింగ్‌లు చేస్తూ బ్రతికే విక్కీ(కార్తీ)ని గోవా పోలీస్ ఆఫీసర్ జీవానంద్ (ఇళవరసు) డబ్బుకోసం శర్వాగా ఙ్ఞాన మూర్తి ఇంటికి తీసుకొస్తాడు. శర్వాగా వెళ్లిన విక్కీ జ్ఞాన మూర్తి కుటుంబంలో ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి? ఆ కుటుంబం శర్వాగా అతడిని నమ్మిందా? లేదా అనేదే మిగతా సినిమా కథ.[1][2]
నటీనటులు సవరించు
- కార్తీ [3]
- జ్యోతిక
- సత్యరాజ్
- షావుకారు జానకి
- నిఖిల
- ఇళవరసు
- అమ్ము
- అభిరామి
- నిఖిలా విమల్
- ఆన్సన్ పాల్
- లవరస్
- సీత
- బాల
- సెమ్మెలార్ అన్నన్
సాంకేతిక నిపుణులు సవరించు
- బ్యానర్లు: వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్
- నిర్మాత: వియాకమ్ 18 మోషన్ పిక్చర్స్, సూరజ్ సాధన
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం:
- సంగీతం: గోవింద్ వసంత
- సినిమాటోగ్రఫీ: ఆర్‌డీ రాజశేఖర్
- ఎడిటర్: వి. ఎస్. వినాయక్
మూలాలు సవరించు
- ↑ The Times of India (20 December 2019). "Donga Movie Review {3/5}: Manages to entertain". Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.
- ↑ TV9 Telugu (20 December 2019). "'దొంగ' రివ్యూ". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
{{cite news}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch (help) - ↑ Sakshi (16 December 2019). "నచ్చిన సినిమాలే చేస్తాను". Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.