దొంగ - దొంగది 2004 తమిళ తమిళంలో సూపర్‌హిట్‌ అయిన తిరుడా తిరుడి పేరిట రీమేక్‌ చేసిన ఈ చిత్రం.

దొంగ - దొంగది
(2004 తెలుగు సినిమా)
దర్శకత్వం సుబ్రమణ్యం శివ
నిర్మాణం శానం నాగ అశోక్‌కుమార్‌, ఎన్‌.వి.ప్రసాద్‌
రచన సుబ్రమణ్యం శివ
తారాగణం మంచు మనోజ్ కుమార్
సదా
సంగీతం దిన
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
విడుదల తేదీ 2004
భాష తెలుగు

సంక్షిప్త చిత్రకథ సవరించు

బేవార్సుగా తిరిగే వాసు (మనోజ్‌), విజ్జి (సదా) తిట్టుకుంటూనే ఒకరినొకరు ఇష్టపడుతారు. విజ్జి వలన వాసు తన తండ్రి ఇచ్చిన డబ్బును పోగొట్టుకోవాల్సి వస్తుంది. తండ్రి చెడామడా తిట్టడంతో తిరుపతి నుంచి వైజాగ్‌ వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. విజ్జికి కూడా వైజాగ్‌ ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అయితే, విజ్జి వాసుపై విపరీతమైన ఇష్టం పెంచుకుంటుంది. వేరే అమ్మాయితో వాసు కలిసి నడిచినా, యుద్దానికి దిగుతుంది. వాసు తన ప్రేమ నిరాకరించడంతో విజ్జి ఆత్మహత్యకు యత్నించడం, అనంతరం వాసు తన ప్రేమను కాపాడుకోవడం, తండ్రికి తన ఎదుగుదలను చూపించుకోవడం మిగతా కథ.

తారాగణం సవరించు

  • మంచు మనోజ్
  • సదా
  • తనికెళ్ళ భరణి
  • రాజీవ్ కనకాల

పాటలు సవరించు

  • మన్మధ రాజా

మూలాలు సవరించు

బయటి లింకులు సవరించు