మంచు మనోజ్ కుమార్

తెలుగు సినిమా నటుడు

మనోజ్(జననం 1983 మే 20)గా అందరికీ సుపరిచితుడైన మంచు మనోజ్ కుమార్ తెలుగు సినిమా నటుడు. ఇతను కలెక్షన్ కింగ్ గా పేరొందిన నటుడు మోహన్ బాబు రెండవ కొడుకు. మనోజ్ బాల్యంలో తన పదోయేటనే మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించాడు. 2004లో దొంగ దొంగది సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి కథానాయకుడిగా పరిచయమయ్యాడు.బిందాస్ సినిమాకుగానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నాడు.

మంచు మనోజ్
జననం
మంచు మనోజ్ కుమార్[1]

(1983-05-20) 1983 మే 20 (age 42)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2004–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
ప్రణతి రెడ్డి
(m. 2015; div. 2019)
భూమా మౌనిక రెడ్డి
(m. 2023)
తల్లిదండ్రులు
బంధువులుమంచు లక్ష్మి (అక్క)
మంచు విష్ణు (అన్న)

వ్యక్తిగత జీవితం

మార్చు

మంచు మనోజ్ 1983 మే 20న మోహన్ బాబు, నిర్మల దేవిలకు మూడో సంతానం, రెండో కొడుకుగా పుట్టాడు. అక్క లక్ష్మీ మంచు, పెద్దన్నయ్య విష్ణు మంచు సినీ నటులు. ఇతను తన విద్యను సౌత్ ఈస్టర్న్ ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీలో పూర్తి చేసాడు. హైదరాబాద్‌, 2015 మే 20 న  మంచు మనోజ్‌ వివాహం ప్రణతిరెడ్డితో హైదరాబాద్‌ హైటెక్స్‌లో జరిగింది. ఆమెతో 2019లో వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

మంచు మనోజ్ ఫిల్మ్ నగర్‌లోని మంచు నిలయంలో 2023 మార్చి 3న భూమా మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు.[2] ఈ దంపతులకు 2024 ఏప్రిల్ 13న పాప జన్మించింది.[3]

వార్తలలో మనోజ్

మార్చు

2013 డిసెంబర్ 8 రోడ్డు ప్రమాదం

మార్చు

2013 డిసెంబరు 8 ఆదివారం రాత్రి ఓ వివాహానికి వెళ్తున్న మనోజ్ వాహనం హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది. కారులో ఉన్న గాలి బుడగలు తెరుచుకోవడంతో అందులోని మనోజ్‌తో పాటు డ్రైవర్, అంగరక్షకుడు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.[4]

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు సూచిక నెం.
1993 మేజర్ చంద్రకాంత్ మేజర్ చంద్రకాంత్ మనవడు బాల నటుడు
1994 పుణ్యభూమి నా దేశం యువ భరత్ బాల నటుడు
1997 అడవిలో అన్న మనోజ్ బాల నటుడు
1998 ఖైదీగారు రాజు బాల నటుడు
రాయుడు ప్రెజెంటర్‌గా
2004 దొంగ - దొంగది వాసు సినీమా అవార్డ్స్ ఉత్తమ పురుష డెబ్యూ
2005 పొలిటికల్ రౌడీ నర్తకి ప్రత్యేక ప్రదర్శన; ప్రस्तुतకుడు కూడా
శ్రీ శ్రీ
2007 రాజు భాయ్ రాజు భాయ్
2008 నేను మీకు తెలుసా ఆదిత్య
2009 ప్రయాణం ధ్రువ్
2010 బిందాస్ అజయ్ నంది స్పెషల్ జ్యూరీ అవార్డు
వేదం వివేక్ చక్రవర్తి
ఝుమ్మందినాదం బాలు
2012 మిస్టర్ నూకయ్య నూకయ్య గీత రచయిత కూడా
ఊ..కొడతారా ఉలిక్కిపడతారా మనోజ్
2013 పోటుగాడు గోవిందు
2014 పాండవులు పాండవులు తుమ్మెద అజయ్
కరెంట్ తీగ రాజు
ఎ డే ఇన్ ది లైఫ్ ఆఫ్ లక్ష్మీ మంచుస్ ఫీట్ అతనే షార్ట్ ఫిల్మ్
2015 దొంగాట అతనే ప్రత్యేక ప్రదర్శన
సూపర్ స్టార్ కిడ్నాప్ అతనే ప్రత్యేక ప్రదర్శన
2016 శౌర్య శౌర్య
ఎటాక్ రాధా కృష్ణ [5]
2017 గుంటూరోడు కన్నా
ఒక్కడు మిగిలాడు సూర్య [6]
2018 ఇది నా లవ్‌స్టోరీ అతనే అతిధి పాత్ర
ఆపరేషన్ 2019 పోలీసు అధికారి అతిధి పాత్ర
2025 భైరవం గణపతివర్మ [7]
2025 మిరాయ్ ది బ్లాక్ స్వోర్డ్ చిత్రీకరణ
టిబిఎ వాట్ ది ఫిష్ టిబిఎ చిత్రీకరణ

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Time to get Bindaas". Rediff. 1 February 2010. Retrieved 4 April 2021.
  2. Namasthe Telangana (3 March 2023). "ఘనంగా మంచు మనోజ్‌, భూమా మౌనికరెడ్డిల పెళ్లి.. ఫోటోలు వైరల్‌". Archived from the original on 6 April 2023. Retrieved 6 April 2023.
  3. Chitrajyothy (13 April 2024). "మంచు వారింట సంద‌డి.. తండ్రైన మనోజ్‌! పాప‌కు.. వెరైటీ పేరు". Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
  4. "Actor Manchu Manoj injured as SUV overturns". The Hindu. 2013-12-09. Retrieved 2013-12-09.
  5. "RGV-Jagapati Babu team up for 'Golusu'". 123telugu.com. Archived from the original on 30 సెప్టెంబరు 2017. Retrieved 10 January 2020.
  6. Dundoo, Sangeetha Devi (10 November 2017). "Okkadu Migiladu: Way off the mark" (in Indian English). The Hindu. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
  7. "భైరవం నుంచి మంచు మనోజ్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌". NT News. 13 November 2024. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.

బయటి లింకులు

మార్చు