దొండ కాయ
(దొండ నుండి దారిమార్పు చెందింది)
దొండ కాయ | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | సి. గ్రాండిస్
|
Binomial name | |
కాక్సీనియా గ్రాండిస్ లేదా కార్డిఫోలియా (లి.) జే. వాయిట్
|
దొండ (లేదా తొండ, డొండ) పొదగా పెరిగే తీగపైరు. కాయలు గుండ్రంగా రెండు, రెండున్నర అంగుళాల పొడవున ఉంటాయి. పచ్చికాయలు కూరగా వండుకుంటారు. కొన్ని ప్రాంతాలలో లేత ఆకులను కూడా కూర దినుసుగా ఉపయోగిస్తారు. ఇది సంవత్సరము పొడవునా కాయలు కాయు కూరగాయ తీగ. దీని సాధారణముగా పందిరిఎక్కించి సాగు చేస్తారు. పచ్చికాయలను ఉట్టిగానే తింటారు కూడా.
రకములు
మార్చు- దేశవాళీ లేదా చిన్న దొండ లేదా నైజాక దొండ
- బొబ్బిలి దొండ
- ఆర దొండ
- పాము దొండ
- కాకి దొండ
- చేదు దొండ, పిచ్చి దొండ
- జయపూరు దొండ
- తియ్య దొండ, కూర దొండ, మంచి దొండ
వంటలు
మార్చుదొండకాయను చాలా రకాలుగా వండవచ్చు.