దో ఆంఖే బారా హాత్

వి. శాంతారాం దర్శకత్వంలో 1957లో విడుదలైన హిందీ సినిమా

దో ఆంఖే బారా హాత్, 1957లో విడుదలైన హిందీ సినిమా. వి. శాంతారాం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వి. శాంతారాం, సంధ్య, బాబూరావ్ పెందర్కర్, ఉల్హాస్, బిఎం వ్యాస్ తదితరులు నటించారు. హిందీ సినిమారంగంలోని క్లాసిక్ సినిమాలలో ఒకటిగా పరిగణించబడుతున్న ఈ సినిమా 8వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సిల్వర్ బేర్, యునైటెడ్ స్టేట్స్ వెలుపల నిర్మించిన ఉత్తమ చిత్రం విభాగంలో శామ్యూల్ గోల్డ్‌విన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు కొత్త కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది.[1][2] భరత్ వ్యాస్ రాయగా లతా మంగేష్కర్ పాడిన "అయే మాలిక్ తేరే బండే హమ్" పాటకు మంచి ఆదరణ వచ్చింది.

దో ఆంఖే బారా హాత్
దో ఆంఖే బారా హాత్ సినిమా పోస్టర్
దర్శకత్వంవి. శాంతారాం
రచనజి.డి. మద్గుల్కర్
నిర్మాతవి. శాంతారాం
తారాగణంవి. శాంతారాం
సంధ్య
బాబూరావ్ పెందర్కర్
ఉల్హాస్
బిఎం వ్యాస్
ఛాయాగ్రహణంజి. బాలకృష్ణ
కూర్పుచింతామణి బోర్కర్
సంగీతంవసంత్ దేశాయ్
నిర్మాణ
సంస్థ
రాజ్ కమల్ కళామందిర్
విడుదల తేదీ
1957
సినిమా నిడివి
143 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

దీనికి స్క్రీన్ రైటర్ జి.డి. మద్గుల్కర్ రచయితగా పనిచేశాడు.[3] 2005లో, ఇండియాటైమ్స్ మూవీస్ బాలీవుడ్ సినిమాలలో తప్పక చూడవలసిన టాప్ 25లో ఈ సినిమాకు స్థానం కల్పించింది.[4] సినిమా షూటింగ్ లో వి. శాంతారామ్ ఒక ఎద్దుతో పోరాడే సీన్ తీసేప్పుడు కంటికి గాయమైంది.[5] ఈ సినిమా 1975లో తమిళంలో పల్లాండు వాజ్గ, 1976లో తెలుగులో మా దైవం పేర్లతో రిమేక్ చేయబడింది.[6] 1952లో వచ్చిన మై సిక్స్ కన్విక్ట్స్ సినిమాను పోలి ఉంటుంది.

ప్రచారం మార్చు

సినిమా పోస్టర్లను తయారుచేయడానికి చిత్రకారుడు జి. కాంబ్లేను శాంతారామ్ నియమించాడు. 1957లో కాంబ్లే బొంబాయి ఒపెరా హౌస్‌లో 350 అడుగుల బ్యానర్‌ను తయారు చేశాడు.[7][8]

నటవర్గం మార్చు

  • వి. శాంతారాం (ఆదినాథ్, జైలు వార్డెన్)
  • సంధ్య (చంపా)
  • బాబూరావ్ పెందర్కర్ (సూపరింటెండెంట్)
  • ఉల్హాస్ (శంకర్ పాస్సి)
  • బిఎం వ్యాస్ (జలియా నై)
  • పాల్ శర్మ
  • ఎస్కె సింగ్
  • గజేంద్ర
  • జి. ఇంగవాలే
  • చందర్కర్
  • త్యాగరాజ్
  • ఆశా దేవి (ఖైదీ తల్లి)
  • శంకరరావు భోస్లే
  • సమర్
  • సునీల్
  • కేశవరావు డేట్

పాటలు మార్చు

ఈ చిత్రంలోని అన్ని పాటలను రచించిన వారు:భరత్ వ్యాస్; అన్ని పాటలకు సంగీతం సమకూర్చినవారు:వసంత్ దేశాయ్.

సం.పాటసంగీతంగాయకులుపాట నిడివి
1."అయే మాలిక్ తేరే బండే హమ్"వసంత్ దేశాయ్లతా మంగేష్కర్ 
2."హో ఉమద్ ఘుమద్ కర్ ఆయి రే ఘాటా"వసంత్ దేశాయ్లతా మంగేష్కర్, మన్నా డే 
3."మెయిన్ గౌన్ తు చుప్ హో జా"వసంత్ దేశాయ్లతా మంగేష్కర్ 
4."సైన్య జూథోన్ కా బడా సర్తాజ్ నికల"వసంత్ దేశాయ్లతా మంగేష్కర్ 
5."తక్ తక్ ధుమ్ ధుమ్"వసంత్ దేశాయ్లతా మంగేష్కర్ 

అవార్డులు మార్చు

సంవత్సరం వర్గం నట, సాంకేతిక వర్గం ఫలితం
1957 ఉత్తమ చలన చిత్రం వి.శాంతరం గెలుపు
హిందీలో ఉత్తమ చలన చిత్రం వి. శాంతారాం గెలుపు
  • బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం [10]
1958 జ్యూరీ యొక్క గోల్డెన్ బేర్ [11] వి. శాంతారాం గెలుపు
  • గోల్డెన్ గ్లోబ్ అవార్డులు [12]
1959 శామ్యూల్ గోల్డ్విన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు [1] వి. శాంతారాం గెలుపు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "International Award For Indian Film". Canberra Times (ACT : 1926–1995). 1959-03-14. p. 11. Retrieved 2021-06-11.
  2. "Foreign Press Assn. 'Globes'". Variety (magazine). March 8, 1959. p. 7. Retrieved June 22, 2019 – via Archive.org.
  3. Ambarish Mishra (28 Sep 2006). "50 years of a Shantaram classic". The Times of India. Retrieved 2021-06-11.
  4. 25 Must See Bollywood Films Archived 15 అక్టోబరు 2007 at the Wayback Machine indiatimes.com.
  5. Classics Revisited – Do Aankhen Barah Haath Rediff.com.
  6. http://www.thehansindia.com/posts/index/Hans/2014-03-23/V-Shantsrsm-silver-screens-shining-focus/89926
  7. "Film Heritage Foundation Profile-A". Film Heritage Foundation (in ఇంగ్లీష్). May 12, 2020. Retrieved 2021-06-11.
  8. Devraj, Rajesh; Bouman, Edo; Duncan, Paul (2010). The Art of Bollywood (in ఇంగ్లీష్). Taschen. ISBN 978-3-8228-3717-7. Retrieved 2021-06-11.
  9. "5th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2021-06-11.
  10. Awards Internet Movie Database.
  11. "Madhura Pandit's biography focuses more on her father and filmmaker-actor V. Shantaram's work than his personal life". 2015-09-14.
  12. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-03-20. Retrieved 2021-06-11.

బయటి లింకులు మార్చు