ద్యుతీ చంద్
ద్యుతీ చంద్ భారతదేశానికి చెందిన ఒక పరుగుపందెం క్రీడాకారిణి. 36 సంవత్సరాల తర్వాత ఈవిడ మనదేశం నుండి 2016 రియో ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగుపందెంలో పాల్గొనడానికి అర్హత సాధించింది.
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
స్థానికంగా పేరు | ద్యుతీ చంద్ | ||||||||||||||
జననం | గోపాల్‌పూర్, ఒడిషా, భారతదేశం | 1996 ఫిబ్రవరి 3||||||||||||||
క్రీడ | |||||||||||||||
క్రీడ | ట్రాక్ అండ్ ఫీల్డ్ | ||||||||||||||
పోటీ(లు) | స్ప్రింట్ | ||||||||||||||
క్లబ్బు | ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ | ||||||||||||||
కోచ్ | నాగపురి రమేష్ | ||||||||||||||
సాధించినవి, పతకాలు | |||||||||||||||
వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన(లు) | 100 m: 11.24 (Almaty 2016) 200 m: 23.73 (Almaty 2016) 4X100 m relay: 43.42 (Almaty 2016) | ||||||||||||||
మెడల్ రికార్డు
| |||||||||||||||
Updated on 20 ఆగస్టు 2016. |
నేపధ్యము
మార్చుఒడిశాలోని ఓ మారుమూల గ్రామం గోపాల్ పూర్ ద్యుతీచంద్ స్వస్థలం. చాలా పేద కుటుంబం. తల్లి, తండ్రి ఇద్దరూ చేనేత పని చేసేవారు. ఇద్దరూ కలిసి పనిచేసినా నెలకు రెండువేల రూపాయలు కూడా వచ్చేవి కావు. ఏడుగురు పిల్లలు... వారినెలా పోషించాలో తెలియదు. చిన్న మట్టి గుడిసెలో నివాసం. టాయిలెట్ సౌకర్యం కూడా లేదు. ద్యుతీకి నాలుగేళ్ల వయసులో పరుగంటే ఏంటో తెలిసింది. ఆమె అక్క సరస్వతికి పరుగు పందేల్లో పాల్గొనడం ఇష్టం. ప్రాక్టీస్ కోసం ఎవరూ తోడు లేరు. కాబట్టి తనకన్నా పదేళ్లు చిన్నదే అయినా తన చెల్లి ద్యుతీని తోడు తీసుకెళ్లేది. కాళ్లకు చెప్పులు లేకుండా బురదలో, ఇసుకలో, మట్టిరోడ్లపై పరుగు తీసేది. ద్యుతీకి ఏడేళ్ల వయసు వచ్చాక తల్లిదండ్రులు తిట్టారు. వెళ్లి చేనేత పని నేర్చుకోక ఈ పరుగులు ఎందుకని కోప్పడ్డారు. కానీ సరస్వతి ఒప్పుకోలేదు. తన చెల్లిలో అద్భుతమైన నైపుణ్యం ఉందని ఆమె గుర్తించింది. అప్పటికి సరస్వతి మారథాన్‌లో పాల్గొని బహుమతులు తెచ్చి ఇంట్లో ఇస్తోంది. అందుకని సరస్వతి మాటకు తల్లిదండ్రులు ఎదురు చెప్పలేదు. తర్వాతి రోజు తన చెల్లిని తీసుకుని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి వెళ్లింది సరస్వతి. అక్కడ ఒక జత బూట్లు కొని చెల్లికి ఇచ్చింది. తిరిగి ఇంటికి బస్‌లో వస్తున్నప్పుడు ఏడేళ్ల ద్యుతీ అడిగింది. 'ఈ బూట్లతో పరిగెడితే ఏం వస్తుంది?' ఏడేళ్ల ద్యుతీ అమాయకపు ప్రశ్న అది. దానికి సరస్వతి అద్భుతమైన సమాధానం చెప్పింది. 'ఇలా కోళ్లతో, సామాన్లతో నిండిన బస్ ఎక్కాల్సిన పని ఉండదు. విమానం ఎక్కి విదేశాలకు వెళ్లి రావచ్చు ' .అంతే! ఆ చిన్నారికి ఆ క్షణమే ఓ అందమైన భవిష్యత్ కనిపించింది.
మూడేళ్లు అక్క శిక్షణలో రాటుదేలిన తర్వాత ద్యుతీకి 2006లో ప్రభుత్వ శిక్షణ కేంద్రంలో అవకాశం వచ్చింది. అక్కడ ఆహారం ఉంది, టాయిలెట్స్ ఉన్నాయి, శిక్షణ ఉంది. అంతేకాదు... తాను ఏదైనా ప్రై జ్‌మనీ గెలిస్తే ఇంటికి పంపొచ్చు.. ద్యుతీలో పట్టుదల పెరిగింది. అంతే. ద్యుతీచంద్ అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. 16 ఏళ్ల వయసులో అండర్-18 విభాగంలో జాతీయ చాంపియన్‌గా నిలిచింది. తర్వాతి రెండేళ్లలో ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100మీ. 200మీ. విభాగాల్లోనూ స్వర్ణం గెలిచింది. జీవితం తాను కోరుకున్నట్లే సాగుతోంది. కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్... పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. అంతలో అనుకోని ఉపద్రవం వచ్చింది. ఈమె శరీరంలో పురుష హార్మోన్లు స్థాయికి మించి ఉన్నాయని భారత అధ్లెటిక్ సమాఖ్య ఈమెపై నిషేధం విధించింది. ఈ నిషేధంపై రెండేళ్ళు పోరాడిన తర్వాత 2016లో ఈవిడ స్విట్జర్లాండ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో పోరాడి తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నది.
2016 రియో ఒలింపిక్స్ ప్రదర్శన
మార్చుకెరీర్లో ఎదురైన కష్టాలపై విజయం సాధించిన మహిళా స్ప్రింటర్ ద్యుతీచంద్ రియోలో మాత్రం ఓటమి చవిచూసింది. 100మీ. పరుగు (హీట్-5) ను ఆమె 11.69 సెకన్లలో పూర్తి చేసి నిరాశాజనకంగా ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. జాతీయ స్థాయిలో ఆమె అత్యుత్తమ రికార్డు 11.24 సెకన్లు కావడం గమనార్హం. 1980లో పీటీ ఉష తర్వాత 100మీ. డ్యాష్‌లో 36 ఏళ్ల తర్వాత భారత్ నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి అథ్లెట్ ద్యుతీచంద్. ఆమెకు సైతం ఇదే తొలి ఒలింపిక్స్. ఆరంభంలో బాగానే పరిగెత్తినా.. ఆఖరి 25 మీటర్లు సకాలంలో పూర్తి చేయడంలో ద్యుతి ఇబ్బందులు ఎదుర్కొంది. అపజయంపై ద్యుతీ చంద్ మాట్లాడుతూ.. ఎకానమీ క్లాస్‌లో 36 గంటల పాటు ప్రయాణం చేయడం తనపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపింది. ఆగస్టు 5 సాయంత్రం రియోకు చేరుకున్నాక వెన్నునొప్పితో రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నట్లు పేర్కొంది. సాధన చేసేందుకు ఇక్కడ తనకెవరూ సహకరించలేదని, తన వ్యక్తిగత కోచ్ సైతం ఆలస్యంగా వచ్చారని, ఆయనకు అక్రిడిటేషన్ రావడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో పరిస్థితులు అనుకూలించలేదని పేర్కొంది. తాను అందరినీ నిరాశ పరిచినట్లు తెలుసని అయితే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మరింత అత్యుత్తమ ప్రదర్శన చేస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది. రియోలో తనతో పోటీ పడిన అథ్లెట్లందరూ తనకన్నా ఎక్కువ ఎత్తని ద్యుతీచంద్ వివరించింది. [1]
మూలాలు
మార్చు- ↑ "" కష్టాల్ని గెలిచినా రియోలో ఓడిన ద్యుతి! "". www.eenadu.net. ఈనాడు. August 13, 2016. Archived from the original on 2016-08-15. Retrieved 2016-08-13.