ధరంబీర్ సింగ్ చౌదరి

చౌదరి ధరంబీర్ సింగ్ పంఘల్ (జ. 1955) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు శాసనసభ్యుడిగా, మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

ధరంబీర్ సింగ్ చౌదరి
ధరంబీర్ సింగ్ చౌదరి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 మే 2014
ముందు శృతి చౌదరి
నియోజకవర్గం భివానీ మహేంద్రగఢ్

వ్యక్తిగత వివరాలు

జననం (1955-03-05) 1955 మార్చి 5 (వయసు 69)
తాలు, భివానీ, హర్యానా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి మంజు దేవి
సంతానం 4 (2 కుమారులు , 2 కుమార్తెలు)
నివాసం విద్యానగర్, మెహమ్ రోడ్, భివానీ, హర్యానా<> #7, ఫిరోజ్‌షా రోడ్, న్యూ ఢిల్లీ
పూర్వ విద్యార్థి కురుక్షేత్ర విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

జననం, విద్యాభాస్యం

మార్చు

ధరంబీర్ సింగ్ 5 మార్చి 1955న హర్యానా రాష్ట్రం, భివానీ, తాలు గ్రామంలో భల్లే రామ్, ఫూల్పతి దంపతులకు జన్మించాడు జన్మించాడు. ఆయన 1977లో కురుక్షేత్ర యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

ధరంబీర్ సింగ్ 1983లో తన సొంత గ్రామంలోని తాలు గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలో సర్పంచ్‌గా గెలిచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత అదే సంవత్సరంలో పంచాయతీ సమితి సభ్యుడిగా, బవనిఖేడ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1987లో జరిగిన శాసనసభ ఎన్నికలలో లోక్ దళ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తోషం నియోజకవర్గం నుండి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చౌదరి బన్సీ లాల్‌ను 2187 ఓట్లతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై 1987 నుండి 1991 వరకు రాష్ట్ర మంత్రిగా పని చేశాడు. ధరంబీర్ సింగ్ ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1991, 1996లో జరిగిన శాసనసభ ఎన్నికలలో చౌదరి బన్సీ లాల్‌ చేతిలో ఓడిపోయి 2000లో తిరిగి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2005లో బధ్రా శాసనసభ నియోజకవర్గం నుండి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ధరంబీర్ సింగ్ 2014లో లోక్‌సభ పోటీ చేయాలనీ భావించగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీని విడి భారతీయ ఆజ్నత పార్టీలో చేరి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భివానీ మహేంద్రగఢ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో రక్షణపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, జలవనరులు, నదుల అభివృద్ధి & గంగా పునరుజ్జీవన మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా పని చేసి 2019లో రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా తిరిగి ఎన్నికై పార్లమెంట్‌లో 24 జూలై 2019 నుండి 30 ఏప్రిల్ 2020 వరకు అంచనాల కమిటీ సభ్యుడిగా, 13 సెప్టెంబర్ 2019 నుండి 12 సెప్టెంబర్ 2020 వరకు మానవ వనరుల అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 9 అక్టోబర్ 2019 నుండి జూన్ 2024 వరకు సభా సమావేశాలకు సభ్యులు గైర్హాజరుపై కమిటీ సభ్యుడిగా, 13 సెప్టెంబర్ 2020 నుండి జూన్ 2024 వరకు విద్య, మహిళలు, పిల్లలు, యువత & క్రీడల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.


ధరంబీర్ సింగ్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భివానీ మహేంద్రగఢ్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రావు దాన్ సింగ్ పై 41510 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

మార్చు
  1. "Chaudhary Dharambir Singh: A Political Journey From Sarpanch To Parliament". 23 May 2024. Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  2. The Indian Express (8 December 2023). "Haryana MP who calls live-in ties a 'disease' is a giant-killer, and Congress loyalist-turned-BJP leader" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  3. The Times of India (24 May 2019). "BJP's Dharambir wins Bhiwani-Mahendergarh seat". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bhiwani-Mahendragarh". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.