ధర్మవరం పురపాలక సంఘం

ఆంధ్రప్రదేశ్, శ్రీసత్యసాయి జిల్లా పట్టణ స్థానికి స్వపరిపాలన సంస్థ

ధర్మవరం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం‌లోని, ధర్మవరం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

ధర్మవరం పురపాలక సంఘం
ధర్మవరం
స్థాపన1964
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
ధర్మవరం
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర

మార్చు

ధర్మవరం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 527 కి.మీ దూరంలో ఉంది. ఈ పురపాలక సంఘాన్ని 1964లో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.చేనేత మగ్గాలు కలిగిన పరిశ్రమలు ఉన్న పట్టణాల్లో ధర్మవరం ఒకటి[1]

జనాభా గణాంకాలు

మార్చు

ధర్మవరం పురపాలక సంఘంలో 40 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2001 లో 103400 ఉన్న పట్టణ జనాభా 2011 లో 121,874 కు పెరిగింది.2011 భారత జనాభా లెక్కల ప్రకారం 121,874 జనాభా ఉండగా అందులో పురుషులు 62,250, మహిళలు 59,624 మంది ఉన్నారు.అక్షరాస్యత 63.64% ఉండగా అందులో పురుష జనాభాలో 36.15%, స్త్రీ జనాభాలో 27.49% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 12730 ఉన్నారు.ఈ పురపాలక సంఘంలో మొత్తం 30,096 గృహాలు ఉన్నాయి.[2]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

మార్చు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా‌ బీర గోపాలకృష్ణ, వైస్ చైర్మన్‌గా అంబరపు శ్రీనివాసులు పనిచేస్తున్నారు .[3]

మూలాలు

మార్చు
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-03. Retrieved 2020-06-20. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 September 2019. Retrieved 13 May 2016. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

వెలుపలి లంకెలు

మార్చు