ధోలా సాదియా వంతెన
ధోలా-సాదియా వంతెనను ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లను కలుపుతూ నిర్మించిన ఒక బీమ్ వంతెన.[1] ఈ వంతెన బ్రహ్మపుత్ర ప్రధాన ఉపనది అయిన లోహిత్ నదిపై కట్టారు. ఇది దక్షిణాన ధోలా గ్రామాన్ని ఉత్తరాన టిన్సుకియా జిల్లాలో ఉన్న సాదియా గ్రామాన్ని కలుపుతుంది. దీనికి అధికారికంగా భూపేన్ హజారికా వంతెన అని పేరు పెట్టారు. అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళేందుకు చక్కటి వీలు కలిగిస్తుంది. సాదియా నుండి కొద్ది దూరం లోనే అరుణాచల్ సరిహద్దు ఉంటుంది.[2] ఈ వంతెన ఉత్తర అస్సాం, తూర్పు అరుణాచల్ ప్రదేశ్‌ల మధ్య మొదటి శాశ్వత రహదారి.[3]
ధోలా సాదియా వంతెన | |
---|---|
నిర్దేశాంకాలు | 27°47′55″N 95°40′34″E / 27.79861°N 95.67611°E |
OS grid reference | [1] |
దీనిపై వెళ్ళే వాహనాలు | Motor vehicles |
దేనిపై ఉంది | లోహిత్ నది |
స్థలం | ధోలా–సాదియా, అసోం |
అధికారిక పేరు | భూపేన్ హజారికా సేతు |
నిర్వహణ | రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ |
లక్షణాలు | |
డిజైను | బీం బ్రిడ్జి |
మొత్తం పొడవు | 9.15 కి.మీ. (5.69 మై.) |
వెడల్పు | 12.9 మీ. (42 అ.) |
అత్యంత పొడవైన స్పాన్ | 50 మీ. (160 అ.) |
స్పాన్‌ల సంఖ్య | 183 |
చరిత్ర | |
నిర్మించినవారు | నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ |
నిర్మాణం ప్రారంభం | 2011 నవంబరు |
నిర్మాణం పూర్తి | 2017 మార్చి 10 |
ప్రారంభం | 2017 మే 26 |
ప్రదేశం | |
9.15 కిలోమీటర్లు (5.69 మై.) పొడవుతో, ఇది నీటిపై భారతదేశంలో రెండవ పొడవైన వంతెన.[4][5] అయితే, 9.76 కిలోమీటర్లు (6.06 మై.) పొడవుతో బీహార్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న కచ్చి దర్గా-బిదుపూర్ వంతెన 2025 లో పూర్తయినపుడు అది భారతదేశంలోనే అతి పొడవైన వంతెనగా అవతరిస్తుంది.[6] [7]
చైనీస్ సైన్యం చొరబాట్లను దృష్టిలో ఉంచుకుని భారత రక్షణ ఆస్తుల వేగవంతమైన తరలింపును దృష్టిలో ఉంచుకుని, ధోలా-సాదియా వంతెన భారత సైన్యపు ప్రధాన యుద్ధ ట్యాంకులైన (మెయిన్ బ్యాటిల్ ట్యాంక్) అర్జున్, T-72 వంటి 60 టన్నుల ట్యాంకుల బరువును తట్టుకునేలా ఈ వంతెనను రూపొందించారు.[8][9] భారత చైనా యుద్ధం తరువాత, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి రాజకీయంగా, సైనికపరంగా అరుణాచల్ ప్రదేశ్‌పై భారతదేశ హక్కును చైనా వివాదం చేసింది. కొనసాగుతున్న ఈ వివాదంలో వంతెన ఒక ముఖ్యమైన వ్యూహాత్మక ఆస్తిగా మారింది. [10]
నిర్మాణం
మార్చురోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్థానిక నియోజకవర్గాల నుండి వచ్చిన డిమాండ్ల తర్వాత 2003 ఆగస్టులో ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని ప్రారంభించింది.[9] 2009 జనవరిలో, అరుణాచల్ ప్రదేశ్ రోడ్లు రహదారుల ప్యాకేజీలో భాగంగా భారత ప్రభుత్వం వంతెన నిర్మాణానికి ఆమోదం ఇచ్చింది.[11][12]
నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో 2011 నవంబరులో నిర్మాణం ప్రారంభించింది. 2015 లో పూర్తి చెయ్యాల్సి ఉంది. అయితే, నిర్మాణ జాప్యాలు, ఖర్చు పెరుగుదల కారణంగా, వంతెన 2017 లో పూర్తైంది.[13][14]
ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు వెయ్యి కోట్లు, ఐదు సంవత్సరాలు పట్టింది.[15] దీని పొడవు ముంబైలోని బాంద్రా వర్లీ సీ లింక్ కంటే 3.55 కి.మీ. ఎక్కువ. ఇది భారతదేశంలోనే అతి పొడవైన వంతెన.[16]
ఈ వంతెనను 2017 మే 26 న భారత ప్రధాని నరేంద్ర మోదీ, నితిన్ గడ్కరీ ( రోడ్డు రవాణా, రహదారుల మంత్రి ) ప్రారంభించారు. అస్సాంకు చెందిన ప్రసిద్ధ గాయకుడు, చిత్రనిర్మాత భూపేన్ హజారికా పేరు మీద ఈ వంతెనకు పేరు పెట్టారు. [17]
ప్రకృతి దృశ్యం
మార్చుఇవి కూడా చూడండి
మార్చు- అటల్ సేతు
- ప్రపంచంలోని పొడవైన వంతెనల జాబితా
- భారతదేశంలో నీటి పైన ఉన్న పొడవైన వంతెనల జాబితా
మూలాలు
మార్చు- ↑ Karanbir Gurung, Shaurya (28 May 2017). "Dhola-Sadiya bridge not enough, China still miles ahead of India in infrastructure along LAC". The Economic Times. Retrieved 15 June 2018.
- ↑ "Dhola-Sadiya: A Bridge of New Hope for the North East". pib.nic.in. Retrieved 23 June 2017.
- ↑ "All you need to know about Dhola-Sadiya Bridge, India's longest river bridge". The Hindu. 26 May 2017.
- ↑ "Longest bridge in India provides a quick link to LAC".
- ↑ "The mighty Brahmaputra is the biggest hurdle to the country's longest bridge".
- ↑ "India: Bihar New Ganga Bridge Project". Asian Development Bank. Retrieved 27 May 2017.
- ↑ "Work on 9.8 km long ADB-supported bridge on Ganga in Bihar to start soon". Financial Express. 14 February 2017. Archived from the original on 1 July 2017. Retrieved 1 July 2017.
As per the loan agreement, the project is scheduled to complete by December 2020.
- ↑ "India's Longest Bridge, Built For Tanks, To Open In Assam Today: 10 Facts".
- ↑ 9.0 9.1 "Dhola Sadia bridge: 10 facts about India's longest bridge on the Brahmaputra". 25 May 2017. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "indianexpress.com" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Subir Bhaumik (26 May 2017). "India opens longest bridge on China border". BBC News. Archived from the original on 27 May 2017. Retrieved 27 May 2017.
China claims Arunachal Pradesh as its own, and refers to it as "southern Tibet". [...] "With China getting more and more aggressive, it is time we strengthened our physical infrastructure to defend our territory," India's junior Home Minister Khiren Rijiju, a native of Arunachal Pradesh, told journalists.
- ↑ "English Releases".
- ↑ "How PM Modi fulfilled Vajpayee's 'dream' to build India's longest Bhupen Hazarika Bridge between Dhola, Sadiya in Assam". The Financial Express. 26 May 2017. Retrieved 27 May 2017.
- ↑ "A bridge too far". The Telegraph (Calcutta). 7 April 2015. Archived from the original on 29 May 2015. Retrieved 25 June 2015.
- ↑ "Development in North East". pib.nic.in.
- ↑ "3 years of Narendra Modi government: India's longest bridge to be called Bhupen Hazarika Bridge, says PM Modi". Business Today India. 26 May 2017. Archived from the original on 26 May 2017. Retrieved 28 May 2017.
Its construction started in 2011. The approximate cost of the project is said to be around Rs 10 billion.
- ↑ "Longest bridge in India provides a quick link to LAC". 4 May 2015.
- ↑ Bhaumik, Subir (26 May 2017). "India opens longest bridge on China border". BBC News. Retrieved 26 May 2017.