రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH), భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ. ఇది రహదారి రవాణా, రవాణా పరిశోధనలకు సంబంధించిన నియమాలు, నిబంధనలు, చట్టాల సూత్రీకరణ, నిర్వహణకు, భారతదేశంలో రోడ్డు రవాణా వ్యవస్థ సామర్థ్యాన్ని, చలనశీలతనూ పెంచడానికి కృషి చేసే మంత్రిత్వ శాఖ. సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (రోడ్లు) కేడర్‌కు చెందిన అధికారుల ద్వారా దేశంలోని జాతీయ రహదారుల అభివృద్ధికి బాధ్యత వహిస్తుంది.

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ
Ministry అవలోకనం
స్థాపనం జూలై 1942; 82 సంవత్సరాల క్రితం (1942-07)
అధికార పరిధి భారత ప్రభుత్వం
ప్రధాన కార్యాలయం ట్రాన్స్‌పోర్ట్ భవన్, 1, పార్లమెంటు వీధి, న్యూ ఢిల్లీ
28°37′9.58″N 77°12′37.29″E / 28.6193278°N 77.2103583°E / 28.6193278; 77.2103583
వార్ర్షిక బడ్జెట్ 2,70,435 crore (US$34 billion)
(2023-24 est.)
[1]
Minister responsible నితిన్ గడ్కరీ, క్యాబినెట్ స్థాయి మంత్రి
Ministry కార్యనిర్వాహకుడు/ అనురాగ్ జైన్, కార్యదర్శి
Child agencies ఎన్‌హెచ్‌ఏఐ
NHIDCL

రోడ్డు రవాణా అనేది దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయం. ఇది అభివృద్ధి వేగాన్ని, ఆకృతినీ, పద్ధతులనూ ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో, మొత్తం వస్తురవాణాలో 60 శాతం, ప్రయాణీకుల ట్రాఫిక్‌లో 85 శాతం రోడ్ల ద్వారా జరుగుతోంది. అందువల్ల, ఈ రంగం అభివృద్ధి భారతదేశానికి అత్యంత ముఖ్యమైనది. బడ్జెట్‌లో గణనీయమైన భాగం దీని కోసం కేటాయిస్తారు.

చరిత్ర

మార్చు

సృష్టి

మార్చు

1942 జూలైలో అప్పటి కమ్యూనికేషన్స్ శాఖను రెండు విభాగాలుగా విభజించి యుద్ధ రవాణా శాఖను ఏర్పాటు చేసారు:[2]

  • తపాలా శాఖ
  • యుద్ధ రవాణా శాఖ.

యుద్ధ రవాణా శాఖకు కేటాయించిన విధుల్లో ప్రధానమైనవి ఓడరేవులు, రైల్వే ప్రాధాన్యతలు, రోడ్డు, నీటి రవాణా వినియోగం, పెట్రోల్ రేషన్, ప్రొడ్యూసర్ గ్యాస్ లు. స్థూలంగా చెప్పాలంటే, యుద్ధ రవాణా శాఖ విధులు యుద్ధ సమయంలో రవాణా, కోస్టల్ షిప్పింగ్, ప్రధాన ఓడరేవుల పరిపాలన, అభివృద్ధి కోసం డిమాండ్లను సమన్వయం చేయడం. ఆ తరువాత, రవాణా ప్రాధాన్యతలపై శాఖల నియంత్రణకు అనుబంధంగా ఎగుమతి ప్రణాళిక చేపట్టబడింది.

క్రమేణా చేసిన మార్పులు

మార్చు
  • 1957: యుద్ధ రవాణా పేరును రవాణా, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖగా మార్చి, రవాణా శాఖను దాని క్రింద ఉంచారు
  • 1966: జనవరి 25 న, రాష్ట్రపతి ఆదేశం మేరకు రవాణా, షిప్పింగ్, పర్యాటక శాఖను రవాణా, విమానయాన మంత్రిత్వ శాఖ కింద ఉంచారు.
  • 1967: మార్చి 13 న రవాణా, విమానయాన మంత్రిత్వ శాఖను షిప్పింగ్, రవాణా మంత్రిత్వ శాఖ, పర్యాటక, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలుగా విభజించారు
  • 1985: సెప్టెంబరు 25 న రవాణా, షిప్పింగ్ మంత్రిత్వ శాఖను పునర్వ్యవస్థీకరిస్తూ రవాణా మంత్రిత్వ శాఖ కింద ఉపరితల రవాణా శాఖగా మార్చారు.
  • 1986: అక్టోబరు 22 న రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉపరితల రవాణా శాఖ పేరును ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖగా మార్చారు
  • 1999: అక్టోబరు 15 న ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖను తదనంతరం షిప్పింగ్ శాఖ, రోడ్డు రవాణా, హైవేల శాఖగా పునర్వ్యవస్థీకరించారు.
  • 2000: నవంబరు 17 న ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అనే రెండు మంత్రిత్వ శాఖలుగా విభజించారు
  • 2004: అక్టోబరు 2 న షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలను మళ్లీ విలీనం చేసి, షిప్పింగ్, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖగా పేరు మార్చారు
  • 2009: షిప్పింగ్, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖను విభజించి, షిప్పింగ్ మంత్రిత్వ శాఖను మళ్లీ ఏర్పరచారు.

సంస్థాగత నిర్మాణం

మార్చు
  • రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖలో రోడ్ల విభాగం, రవాణా విభాగం, దాని స్వతంత్ర ఆర్థిక విభాగంగా విభజించారు. ఇవి కాకుండా ప్లానింగ్, మానిటరింగ్ జోన్ ఉంది.
  • సెక్రటరీ (రోడ్డు రవాణా, రహదారులు) కి డైరెక్టర్ జనరల్ (రోడ్ల అభివృద్ధి), స్పెషల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ (రోడ్డు రవాణా), ఫైనాన్షియల్ అడ్వైజర్, అడ్వైజర్ (రవాణా పరిశోధన) సహాయం చేస్తారు.[3]
  • జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణలకు డైరెక్టర్ జనరల్ (రోడ్ల అభివృద్ధి) బాధ్యత వహిస్తారు.
  • జాయింట్ సెక్రటరీ రవాణా పరిపాలన, ప్రజా ఫిర్యాదులు, విజిలెన్స్ రహదారి భద్రత, సమన్వయం, ప్రజా సంబంధాలను చూస్తారు [3]
  • అకౌంట్స్ విభాగానికి చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ నేతృత్వం వహిస్తారు. వారు ఖాతాల బడ్జెట్, పని, అధ్యయనానికి బాధ్యత వహిస్తారు.[3]
  • సలహాదారు (రవాణా పరిశోధన) మంత్రిత్వ శాఖకు సంబంధించిన వివిధ రకాల రవాణా విధానాలపై విధాన ప్రణాళిక, రవాణా సమన్వయం, ఆర్థిక, గణాంక విశ్లేషణ కోసం మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు అవసరమైన డేటా మద్దతును అందజేస్తారు.[3]

ప్రాంతీయ కార్యాలయాలు

మార్చు

కిందివి ప్రాంతీయ కార్యాలయాలు, ప్రాంతీయ అధికారి (RO) నేతృత్వంలో పనిచేస్తాయి:

నగరం రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతం
బెంగళూరు కర్ణాటక రాష్ట్రం
చెన్నై తమిళనాడు రాష్ట్రం
ముంబై మహారాష్ట్ర రాష్ట్రం
కోల్‌కతా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం
చండీగఢ్ చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం
జైపూర్ రాజస్థాన్ రాష్ట్రం
పాట్నా బీహార్ రాష్ట్రం
గౌహతి అస్సాం రాష్ట్రం
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం
గాంధీనగర్ గుజరాత్ రాష్ట్రం
భువనేశ్వర్ ఒడిశా రాష్ట్రం
భోపాల్ మధ్యప్రదేశ్ రాష్ట్రం
తిరువనంతపురం కేరళ రాష్ట్రం
లక్నో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం
వారణాసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం
రాయ్పూర్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం
డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ రాష్ట్రం
సిమ్లా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం
సూరత్ గుజరాత్ రాష్ట్రం

మంత్రిత్వ శాఖ కింద కింది విభాగాలు పనిచేస్తాయి:

రోడ్ల విభాగం

మార్చు

మంత్రిత్వ శాఖ లోని రహదారి విభాగం దేశం లోని రోడ్ల నెట్‌వర్కు అభివృద్ధి కార్యక్రమానికి వెన్నెముక. ఇందులో సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (రోడ్లు) అధికారులు ఉంటారు. దీనికి డైరెక్టర్ జనరల్ (రోడ్ల అభివృద్ధి), భారత ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి నాయకత్వం వహిస్తారు.[4]

ఈ విభాగాన్ని ఐదు ప్రాజెక్టు జోన్లుగా విభజించారు. జాతీయ రహదార్ల అభివృద్ధి, రోడ్ల నెట్‌వర్కు అభివృద్ధి కోసం ప్రతి ప్రాజెక్టు జోన్ సాధారణంగా నాలుగు నుండి ఐదు రాష్ట్రాలకు బాధ్యత వహిస్తుంది. ఈ ఐదు ప్రాజెక్టు జోన్లకు సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (రోడ్లు) కేడర్‌కు చెందిన ఐదుగురు అదనపు డైరెక్టర్ జనరళ్ళు (ADG) నాయకత్వం వహిస్తారు. వీరికి హెడ్‌క్వార్టర్ లోని జోనల్ చీఫ్ ఇంజనీర్, రీజినల్ ఆఫీసర్లు సహాయం చేస్తారు. రాష్ట్ర పీడబ్ల్యూడీల ద్వారా వారి వారి రాష్ట్రాల్లో జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణల కోసం క్షేత్రస్థాయిలో ప్రాంతీయ అధికారులను నియమించారు.

ఈ విభాగపు ప్రధాన బాధ్యతలు:[5]

  • జాతీయ రహదారుల ప్రణాళిక, అభివృద్ధి, నిర్వహణ
  • రాష్ట్ర రహదారులు, అంతర్-రాష్ట్ర కనెక్టివిటీ, జాతీయ ప్రాముఖ్యత కలిగిన రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వానికి సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
  • రోడ్లు, వంతెనల నిర్మాణ నిర్వహణ కోసం ప్రమాణాలను నిర్ణయించడం.
  • ప్రాజెక్టుల ద్వారా, R&D ద్వారా రూపొందించబడిన ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్కైవ్ చేయడం.
  • జాతీయ రహదారుల నిర్మాణ నిర్వహణలకు సంబంధించిన పనుల మంజూరు.
  • CRF (సెంట్రల్ రోడ్ ఫండ్), అంతర్రాష్ట్ర రోడ్లతో సహా వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలకు అంచనాలను మంజూరు చేయడం.
  • రహదారి భద్రతకు సంబంధించిన విషయాలను నిర్వహించడం.
  • జాతీయ రహదారుల పరిపాలన చట్టం 1956, ది హైవే అడ్మినిస్ట్రేషన్ రూల్స్ 2005 లను నిర్వహించడం

రవాణా విభాగం

మార్చు

రవాణా విభాగపు ప్రధాన బాధ్యతలు:

  • మోటారు వాహన చట్టం
  • మోటారు వాహనాలపై పన్ను విధించడం
  • వాహనాలకు తప్పనిసరి బీమా
  • మోటారు రవాణా రంగంలో రవాణా సహకార సంఘాలను ప్రోత్సహించడం.
  • జాతీయ రహదారి భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేయడం
  • రోడ్డు ప్రమాదాలపై డేటాను సంకలనం చేయడం, ప్రజలలో రహదారి భద్రతా సంస్కృతిని అభివృద్ధి చేయడం
  • నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా NGOలకు గ్రాంట్లు అందించడం.

ప్లానింగ్, మానిటరింగ్ జోన్

మార్చు

ఈ జోన్‌లకు సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (రోడ్లు) కు చెందినఇద్దరు వేర్వేరు చీఫ్ ఇంజనీర్లు నాయకత్వం వహిస్తారు. ఈ జోన్ ప్రధాన బాధ్యతలు:

  • బడ్జెట్‌ల తయారీ, ఖర్చుల రికార్డులను నిర్వహించడం ద్వారా నిధుల కేటాయింపు.
  • జాతీయ రహదారుల సంభావ్య నెట్‌వర్క్‌ను ఏర్పరచగల ప్రాంతాల గుర్తింపు.
  • జాతీయ రహదారుల నోటిఫికేషన్, డీ-నోటిఫికేషన్.
  • జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించిన వివిధ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీల ద్వారా కొనసాగుతున్న పనుల పర్యవేక్షణ, సమీక్ష పురోగతితో మానిటరింగ్ జోన్ వ్యవహరిస్తుంది.

ప్రమాణాలు, పరిశోధన (S&R) జోన్

మార్చు

ఈ జోన్‌లకు సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (రోడ్లు) చీఫ్ ఇంజనీర్లు నాయకత్వం వహిస్తారు. ఈ జోన్ ప్రధాన బాధ్యతలు NH అభివృద్ధి కార్యక్రమం, సంబంధిత కార్యకలాపాల కోసం ప్రమాణాలు/నియమాలు / మార్గదర్శకాల తయారీ.

ఏజెన్సీలు

మార్చు

స్వయంప్రతిపత్త సంస్థలు

మార్చు

ఈ మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న స్వయంప్రతిపత్త ఏజెన్సీలు.[3]

అకాడమీ

మార్చు
  • సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (CIRT), పూణే
  • ఇండియన్ అకాడమీ ఆఫ్ హైవే ఇంజనీర్స్ (IAHE), సెక్టార్ 62, నోయిడా [6]

చట్టాలు

మార్చు

దేశంలోని రోడ్డు రవాణాలో శాంతిభద్రతలను నిర్వహించడానికి మంత్రిత్వ శాఖ అనేక సంవత్సరాలుగా అనేక చట్టాలను ఆమోదించింది

గణాంకాలు

మార్చు

భారతదేశం 48.85 లక్షల కి.మీ.లతో కూడిన అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌లలో ఒకటి:[7]

రహదారి పొడవు పంపిణీ
రోడ్లు పొడవు
జాతీయ రహదారులు/ఎక్స్‌ప్రెస్‌వేలు 1,32,500 కి.మీ
రాష్ట్ర రహదారులు 1,56,694 కి.మీ
ఇతర రోడ్లు 56,08,477 కి.మీ
మొత్తం 58,97,671 కి.మీ

భారతదేశంలోని రహదారుల మొత్తం పొడవు 1951 నుండి 2011 వరకు 60 సంవత్సరాలలో 11 రెట్లు పెరిగింది; పక్కా రోడ్ల పొడవు అదే కాలంలో 16 రెట్లు పెరిగింది. కొత్త పక్కా రహదారుల ఏర్పాటు కారణంగా భారతదేశంలో కనెక్టివిటీ చాలా మెరుగుపడింది.[8]

10
20
30
40
50
1950-51
1970-71
2000-01
2010-11
  •   Total length of roads (in lakh km)
  •   Total length of surfaced roads (in lakh km)

దేశంలోని రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం 2013–2014 కోసం సెంట్రల్ రోడ్ ఫండ్ కింద ₹19,423.88 కోట్లను ఈ క్రింది విధంగా కేటాయించింది:[9]

రకం గ్రాంట్లు
రాష్ట్ర రహదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేం.పా.ప్రాలకు గ్రాంట్లు ₹2,659.91 కోట్లు
అంతర్-రాష్ట్ర కనెక్టివిటీ, జాతీయ ప్రాముఖ్యత కలిగిన రోడ్ల కోసం రాష్ట్రాలు కేం.పా.ప్రా లకు గ్రాంట్లు ₹262.22 కోట్లు
జాతీయ రహదారులు ₹9,881.95 కోట్లు
గ్రామీణ రోడ్లు ₹5,827.20 కోట్లు
రైల్వేలు ₹1092.60 కోట్లు
మొత్తం ₹19,423.88 కోట్లు

ప్రభుత్వ కార్యక్రమాలు

మార్చు

రోడ్ల రంగంలో ప్రైవేటు, విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందించింది. రహదారి వంతెనలు, టోల్ రోడ్లు, వాహన సొరంగాల నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి, కార్గో నిర్వహణ వంటి రవాణాకు సంబంధించిన సేవలు భూ రవాణాకు సంబంధించిన వాటికి, రోడ్లు, వంతెనల నిర్మాణం, నిర్వహణ; బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (BOT) ప్రాతిపదికన నిర్మించిన రోడ్లు, రహదారుల నిర్మాణం, నిర్వహణ, టోల్ వసూలు రంగాల్లో 100% విదేశీ పెట్టుబడికి అనుమతించింది.

ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి హైవే నిర్మాణ ప్రాజెక్టులకు సెక్షన్ 80 IA కింద 10 సంవత్సరాల పన్ను మినహాయింపు మంజూరు చేసింది. ఈశాన్య భారతంలో మారుమూల ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచడం కోసం మంత్రిత్వ శాఖ 'ఈశాన్య ప్రాంతంలో ప్రత్యేక యాక్సిలరేటెడ్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్'ను రూపొందించింది. ప్రతిపాదన అంచనా వ్యయం US$2.53 బిలియన్లు. కేంద్ర బడ్జెట్ 2012–13 రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కేటాయింపులను 14% పెంచి 25,360 crore (US$3.2 billion) ప్రతిపాదించింది.

భారతదేశంలో US$17.21 బిలియన్ల డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టు లోని తూర్పు భాగపు మొదటి దశను అభివృద్ధి చేయడానికి ప్రపంచ బ్యాంక్ US$975 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మొదటి దశ కోసం US$14.56 బిలియన్ల నిధుల కోసం జపనీస్ బ్యాంక్ ఆఫ్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్‌తో ఒప్పందం చేసుకుంది. ఇది 2016లో ప్రారంభించబడే అవకాశం ఉంది [10]

ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY) భారతదేశంలోని గ్రామీణ రహదారుల అభివృద్ధికి సంబంధించిన పథకం. గ్రామీణ రహదారుల నిర్మాణం (CRRP) గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించిన మరొక కార్యక్రమం.

జాతీయ హరిత రహదారుల కార్యక్రమం

మార్చు

రవాణా మంత్రిత్వ శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ 2016లో గ్రీన్ హైవేస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.[11][12][13]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

15. https://sarathi.parivahan.gov.in/SarathiReport/sarathiHomePublic.do

  1. "Union Budget 2020-21 Analysis" (PDF). prsindia.org. 2020. Archived from the original (PDF) on 2020-02-26. Retrieved 2024-07-01.
  2. "Organisational History". Ministry of Shipping, Government of India. Archived from the original on 21 July 2014. Retrieved 5 October 2014.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "Ninth Report of ERC" (PDF). Ministry of Finance, Government of India. Archived from the original (PDF) on 31 May 2013. Retrieved 5 October 2014.
  4. Kavita, Mrrali. "Know about Parivahan Sarathi & its services -". Get true reviews for the products here. Retrieved 27 April 2020.
  5. "Wings under Ministry". MORTH. Ministry of Road Transport and Highways, Government of India. Retrieved 5 October 2014.
  6. "IAHE - Contact Us". www.iahe.org.in.
  7. "Annual Report 2013–2014" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 5 October 2014.
  8. "Basic Road Statistics" (PDF). Ministry of Road Transport and Highways. Archived from the original (PDF) on 15 డిసెంబరు 2017. Retrieved 5 October 2014.
  9. "CRF 2013–2014 allooction" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 5 October 2014.
  10. "Policy and Promotion". Invest India, GOI. Archived from the original on 22 September 2014. Retrieved 5 October 2014.
  11. "National Green Highway Mission : Environment for UPSC Exams | IAS EXAM PORTAL - India's Largest Community for UPSC Exam Aspirants". iasexamportal.com.
  12. "Green Highways (Plantation & Maintenance) Policy-2015 - India Environment Portal | News, reports, documents, blogs, data, analysis on environment & development | India, South Asia". www.indiaenvironmentportal.org.in.
  13. "Finance ministry rejects Rs 5,000 crore green fund project by road ministry, NHAI". Governance Now. 17 August 2016.