నందా కర్నాటకి

మహారాష్ట్రకు చెందిన సినిమా నటి

నందా కర్నాటకి (1939 జనవరి 8 - 2014 మార్చి 25)[1] మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. ఎక్కువగా హిందీ, మరాఠీ సినిమాలలో నటించింది. హిందీ సినిమారంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరిగా నిలిచింది. తన 30 సంవత్సరాల సినీ జీవితంలో ఛోటీ బహెన్, ధూల్ కా ఫూల్, భాభి, కాలా బజార్, కానూన్, హమ్ దోనో, జబ్ జబ్ ఫూల్ ఖిలే, గుమ్నామ్, ఇత్తెఫాక్, ది ట్రైన్, ప్రేమ్ రోగ్ మొదలైన సినిమాలలో నటించి ప్రసిద్ధి చెందింది.[2][3]

నందా కర్నాటకి
కెన్యాలో నందా కర్నాటకి (1970)
జననం
నందా కర్నాటకి

(1939-01-08)1939 జనవరి 8
మరణం2014 మార్చి 25(2014-03-25) (వయసు 75)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1948–1983
1991–1995
పురస్కారాలుఆంచల్ సినిమాకు ఉత్తమనటి ఫిల్మ్ ఫేర్ అవార్డు (1960)

జీవితం తొలి దశలో మార్చు

నంద 1939 జనవరి 8న కొల్హాపూర్ పట్టణంలోని మహారాష్ట్ర షో-బిజినెస్ కుటుంబంలో మరాఠీ నటుడు-నిర్మాత-దర్శకుడు వినాయక్ దామోదర్ కర్నాటకి (మాస్టర్ వినాయక్)కి జన్మించింది. మాస్టర్ వినాయక్ భారతీయ సినిమారంగంలోని చాలామందికి బంధువు. అతని సోదరుడు వాసుదేవ్ కర్నాటకి సినిమాటోగ్రాఫర్, సినీ ప్రముఖులు బాబూరావు పెంధార్కర్ (1896-1967), భల్జీ పెంధార్కర్ (1897-1994) అతని సవతి సోదరులు. పౌరాణిక సినిమా దర్శకుడు వి. శాంతారామ్ తల్లి బంధువు కూడా.[4] మాస్టర్ వినాయక్, మంగేష్కర్ కుటుంబానికి మంచి స్నేహితుడుకావడంతో తను తీసిన పహిలీ మంగళగౌర్[4] అనే సినిమా ద్వారా లతా మంగేష్కర్‌ను సినిమారంగానికి పరిచయం చేశాడు.[5]

నందాకు ఏడేళ్ళ వయసులో 1947లో తండ్రి (41 ఏళ్ల వయసులో) మరణించాడు.[6] కుటుంబం కష్టాల్లో ఉండడంవల్ల కుటుంబ పోషణకోసం 1950వ దశకం ప్రారంభంలో సినిమాల్లోకి వచ్చి బాలనటిగా 1948లో మందిర్‌తో అరంగేట్రం చేసింది. "బేబీ నంద"గా గుర్తింపు పొందింది. 1948 నుండి 1956 వరకు మందిర్, జగ్గు, అంగారే, జాగృతి వంటి సినిమాలలో నటించింది.[7] ఉపాధ్యాయుడు, బాంబే స్కౌట్స్ కమీషనర్ గోకుల్‌దాస్ వి. మఖీ ద్వారా ఇంట్లోనే చదువుకుంది. తన ఆరుగురు తోబుట్టువులకు అండగా నిలిచి వానికి విద్యావంతులను చేసింది.[8] ఆమె సోదరులలో ఒకరు మరాఠీ చిత్ర దర్శకుడు జైప్రకాష్ కర్నాటకి, నటి జయశ్రీ టిని వివాహం చేసుకున్నాడు.[9]

 
మందిర్ చిత్రంలో నటి శాంతా ఆప్టేతో బేబీ నందా (9 ఏళ్లు).
 
2010లో నందా
 
2010లో వహీదా రెహ్మాన్, హెలెన్, సాధనతో నందా (ఎడమ నుండి మొదటి వ్యక్తి).

నటించిన సినిమాలు (కొన్ని) మార్చు

సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
1952 జగ్గు బాలనటి
1954 అంగారే
బండిష్
1956 తూఫాన్ ఔర్ దీయా నందిని
దేవఘర్ (మరాఠీ)
శత్రంజ్
1957 బండి శంకర్ కూతురు
భాభీ లత
ఆగ్రా రోడ్
లక్ష్మి
సాక్షి గోపాల్
1958 దుల్హన్ సాధన
1959 బర్ఖా పార్వతి
జారా బచ్కే
ఖైదీ నం. 911 గీత
ఛోటీ బహెన్ మీనా
ధూల్ కా ఫూల్ మాలతి
నయా సంసార్
పెహ్లీ రాత్
1960 ఆంచల్ చందా
అప్నా ఘర్
చాంద్ మేరే అజా
జో హువా సో భూల్ జావో
కాలా బజార్ సప్నా
కానూన్ మీనా ప్రసాద్
ఉస్నే కహా థా కమ్లీ
1961 అమర్ రహే యే ప్యార్ రజియా హుస్సేన్
చార్ దివారీ లక్ష్మి
హమ్ డోనో రుమా
1962 ఆషిక్ రేణు
మెహందీ లగీ మేరే హాత్ రజని
1963 నర్తకీ లక్ష్మి
ఆజ్ ఔర్ కల్ రాజకుమారి హేమలత/హేమ
1964 కైసే కహూన్
మేరా కసూర్ క్యా హై
1965 ఆకాష్దీప్
బెడగ్ మంజు
జబ్ జబ్ ఫూల్ ఖిలే రీటా ఖన్నా
మొహబ్బత్ ఇస్కో కహేతే హై రజని
టీన్ డెవియన్ నంద
గుమ్నామ్ ఆశా
1966 నీంద్ హమారీ ఖ్వాబ్ తుమ్హారే నిషాద్
పతి పత్ని గౌరీ
1967 పరివార్ మీనా
1968 అభిలాష రీతు
జువారీ సరోజ
1969 బేటి సుధా వర్మ
ధరతీ కహే పుకర్కే రాధ
రాజా సాబ్ పూనమ్
ఇత్తెఫాక్ రేఖ
బడి దీదీ భావన
1970 రూత నా కరో నీతా
రైలు నీత/గీత/కళావతి/ప్రియ
1971 వో దిన్ యాద్ కరో
అధికార్ మీరా
ఉమ్మీద్ 1962 చిత్రం 1971లో విడుదలైంది
1972 షోర్ గీతా
పరిణీత
జోరూ కా గులాం కల్పన
1973 ఛలియా సునీత/నీతా
నయ నషా రీనా
1974 జుర్మ్ ఔర్ సజా రికీ
అస్లియాత్
1977 ప్రాయశ్చిత్ రీటా/రమ్మ
1980 ఖతిల్ కౌన్
1981 అహిస్టా అహిస్టా సంగీత
1982 ప్రేమ్ రోగ్ వీరేంద్ర భార్య
1983 మజ్దూర్ రాధ

అవార్డులు, నామినేషన్లు మార్చు

సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం
1958 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ సహాయ నటి భాభి ప్రతిపాదించబడింది
1961 ఆంచల్ గెలుపు
1970 ఉత్తమ నటి ఇత్తెఫాక్ ప్రతిపాదించబడింది
1982 ఉత్తమ సహాయ నటి అహిస్టా అహిస్టా ప్రతిపాదించబడింది
1983 ప్రేమ్ రోగ్ ప్రతిపాదించబడింది

మరణం మార్చు

నందా తన 75 ఏళ్ల వయసులో ముంబైలోని వెర్సోవా నివాసంలో 2014 మార్చి 25న గుండెపోటుతో మరణించింది.[10]

మూలాలు మార్చు

  1. "Birthday special: 7 lesser known facts about veteran actress Nanda". indiatvnews.com. 7 January 2016. Retrieved 2022-07-21.
  2. "Veteran Bollywood Actress Nanda Passes Away -Bollywood, Featured, General News - India News Portal". indiascanner.com. Archived from the original on 8 September 2017. Retrieved 2022-07-21.
  3. "The Top 10 Films of Nanda". Rediff.
  4. 4.0 4.1 Gavankar, Nilu N. (26 July 2011). The Desai Trio and the Movie Industry of India. ISBN 9781468599817. Retrieved 2022-07-21.
  5. R.K. Murthi. Encyclopedia of Bharat Ratnas. ISBN 978-81-209-1307-3. Retrieved 4 May 2013.
  6. Death of Nanda's father Archived 29 మార్చి 2014 at the Wayback Machine; accessed 30 March 2014.
  7. Ambarish Mishra (26 March 2014). "Nanda, an actor who embodied Indian-ness and quiet dignity, dead". The Times of India. Retrieved 2022-07-21.
  8. "Nanda: The Eternal Sister of Bollywood". www.filmibeat.com. 19 February 2009.
  9. Notice of Nanda's death Archived 31 మార్చి 2014 at the Wayback Machine, magzmumbai.com; accessed 2022-07-21.
  10. Death of Indian actress Nanda, in.lifestyle.yahoo.com; accessed 2022-07-21.

బయటి లింకులు మార్చు