హెలెన్ (నటి)

భారతీయ చిత్ర నటి మరియు నృత్యకారిణి

హెలెన్ జైరాజ్ రిచర్డ్‌సన్ హిందీ సినిమాలలో నటించిన నటీమణి, నర్తకీమణి. ఈమె తండ్రి ఆంగ్లో ఇండియన్. ఆర్మీలో పనిచేశాడు. తల్లి బర్మాదేశస్థురాలు. నర్సుగా పనిచేసింది. హెలెన్ 1939, నవంబర్ 21న బర్మాలో జన్మించింది. ఈమె తండ్రి రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించాడు. బర్మాపై జపాన్ దండెత్తిన సందర్భంలో 1942లో ఈమె కుటుంబం భారతదేశానికి కాందిశీకులుగా వలస వచ్చింది. తన తల్లి సంపాదన కుటుంబపోషణకు సరిపోక పోవడంతో ఈమె చదువు కొనసాగించలేకపోయింది. 1951లో ఈమె సినిమారంగానికి పరిచయమైంది. 1953లో హౌరా బ్రిడ్జ్ అనే హిందీ సినిమా ద్వారా నటిగా స్థిరపడింది. ఈమె 700లకు పైగా చిత్రాలలో నటించింది. ఈమె 1981లో హిందీ చిత్ర రచయిత సలీంఖాన్‌ను వివాహం చేసుకుంది. ప్రఖ్యాత హిందీ సినిమా హీరో సల్మాన్ ఖాన్‌కు ఈమె సవతి తల్లి. ఈమె జీవితాన్ని ఆధారం చేసుకుని నాలుగు సినిమాలు, ఒక పుస్తకం వెలువడింది. ఈమె హిందీ సినిమాలతో పాటు దక్షిణాది భాషా చిత్రాలలో కూడా నాట్యం చేసింది. ఈమెకు 1999లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, 2009లో భారత ప్రభుత్వం వారిచే పద్మశ్రీ పురస్కారం లభించాయి.

హెలెన్
2019లో హెలెన్
జననం
హెలెన్ ఆన్ రిచర్డ్సన్

(1938-11-21) 1938 నవంబరు 21 (వయసు 86)
రంగూన్, బ్రిటీష్ బర్మా
(ప్రస్తుత యాంగోన్, మయన్మార్
జాతీయతబ్రిటిష్ బర్మీస్ (1938–1946)
బ్రిటీష్ ఇండియన్ (1946–1947)
ఆంగ్లో-ఇండియన్ (1947–1957)
భారతీయురాలు (1957–ప్రస్తుతం)
వృత్తి
  • నటి
  • నర్తకి
క్రియాశీల సంవత్సరాలు1951–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
ప్రేమ్ నారాయణ్ అరోరా
(m. 1957; div. 1974)

సలీం ఖాన్
(m. 1981)
పురస్కారాలుఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
సన్మానాలుపద్మశ్రీ పురస్కారం (2009)

ఈమె నటించిన తెలుగు సినిమాలు

మార్చు
  1. సంతోషం (1955)
  2. వేగుచుక్క (1957)
  3. భూకైలాస్ (1958)‌
  4. వీరప్రతాప్ (1958)
  5. కాలాంతకుడు (1960)
  6. మదనమంజరి (1961)
  7. చలాకీపిల్ల (1965)
  8. ఉక్కు మనిషి (1965)
  9. సింద్ బాద్ ఆలీబాబా అల్లాడీన్ (1965)
  10. పిల్లా-పిడుగు (1971)
  11. నిజం నిరూపిస్తా (1972)
  12. దసరా పిచ్చోడు (1973)
  13. హేమా హేమీలు (1979)
  14. భోగిమంటలు (1981)

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు