నందిని గౌడ్ హైదరాబాదు కి చెందిన ఒక ప్రముఖ చిత్రకారిణి, ముద్రణా రంగంలో నిపుణురాలు. ఎం.ఎఫ్. హుసేన్, షంషాద్ హుసేన్, లక్ష్మా గౌడ్ ల వంటి హేమాహేమీలు ప్రదర్శించిన చిత్రాలతో బాటు ఈమె చిత్రాలు కూడా ప్రదర్శింపబడ్డాయి. నందిని గౌడ్ వివిధ అవార్డులని ఫెలోషిప్ లని అందుకొన్నది. 1995 లో జాతీయ స్థాయి స్కాలర్ షిప్ ని అందుకొన్నది భారతదేశ ప్రభుత్వానికి చెందిన సాంస్కృతిక విభాగం నుండి చిత్రకళ కి జూనియర్ ఫెలోషిప్ ని అందుకొన్నది.

నందిని గౌడ్
జననంనందిని గౌడ్
1967
మెదక్ జిల్లా కి చెందిన నిజాంపూర్
ప్రసిద్ధిచిత్రకారిణి

జీవిత చరిత్ర

మార్చు

చిత్రకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన లక్ష్మా గౌడ్ కుమార్తె. తెలంగాణ లోని మెదక్ జిల్లా లో 1967 లో జన్మించినది. బరోడా లోని ఎం.ఎస్. విశ్వవిద్యాలయము లో నుండి చిత్రకళ లో, ముద్రణా రంగంలో పట్టాలు పుచ్చుకొన్నది. హైదరాబాదులోనే నివసిస్తూ, తన స్వంత స్టూడియో నుండి పని చేస్తుంది.

హైదరాబాదు నగరపు జీవితాన్ని, గ్రామీణ జీవితం, అందులో ఉండే సాధు జంతువులు (పిల్లులు, మేకలు) తన చిత్రపటాల్లో కనబడుతూ ఉంటాయి. పూలకుండీలు, పండ్లు ఉన్న పళ్ళెం, మేకప్ సాధనాలు కూడ తన చిత్రపటాల్లో కనబడుతుంటాయి.

"భారతీయ నగరాలని సుందరంగా చిత్రీకరించటం లో పట్టుని సాధించే నా ప్రయత్నాలని నా చిత్రాల్లో చూడవచ్చు." అంటుంది నందిని.

ప్రదర్శనలు

మార్చు

మూలాలు

మార్చు