నందుడు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నందుడు హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని పెంపుడు తండ్రి. గోవులు ప్రధాన సంపదగా గలిగిన గోకులానికి రాజు.
నేపథ్యం
మార్చువసుదేవుడు కంసుడి చెల్లెలు అయిన దేవకిని పెళ్ళి చేసుకుంటాడు. అయితే వారికి అష్టమ గర్భంలో జన్మించిన సంతానంతో తనకు ప్రాణగండం ఉందని రాజ పురోహితుల ద్వారా తెలుసుకుంటాడు. అందుకని దేవకీ వసుదేవులను చెరసాల బంధించి వారికి పుట్టిన బిడ్డలందరినీ సంహరిస్తుంటాడు. అష్టమ సంతానంగా కృష్ణుడు జన్మించినపుడు ఆ శిశువును తీసుకు వెళ్ళి నందుని దగ్గర విడిచిపెట్టి అక్కడ ఉన్న ఆడశిశువు రూపంలో ఉన్న యోగమాయను తీసుకురమ్మని ఆకాశవాణి ఆదేశిస్తుంది. వసుదేవుడు అలాగే చేస్తాడు. అష్టమ సంతానం కలిగిందని తెలియగానే కంసుడు వచ్చి యోగమాయను ఆకాశం లోకి ఎగరేసి కత్తితో చంపబోతాడు. అప్పుడు విచిత్రంగా ఆ శిశువు అదృశ్యమైన అతన్ని సంహరించగల శిశువు మరెక్కడో పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది. అప్పటి నుంచి నందుని సంరక్షణలో ఉన్న శ్రీకృష్ణుని చంపడానికి కంసుడు అనేక రకాలుగా ప్రయత్నించి విఫలుడై చివరికి కృష్ణుని చేతిలో మరణిస్తాడు.
దేవకీ వసుదేవులు చెరసాలలో ఉన్నపుడు వసుదేవుడి మరో భార్యయైన రోహిణి పుత్రుడైన బలరాముని కూడా నందుడు తన సంరక్షణలో ఉంచుకుంటాడు.[1]
నంద గోకులం చక్కని పాడి పశువులతో తులతూగుతుండేది. మొదట్లో నందుడికి శ్రీకృష్ణుడు మహా విష్ణువు అవతారం అని తెలియక కంసుడు పంపిన రాక్షసులు ఆయనకి కీడు తలపెట్టినప్పుడల్లా అతన్ని కాపాడమని మహా విష్ణువును ప్రార్థిస్తుండేవాడు.[2]
మూలాలు
మార్చు- ↑ Carl Woodham (2011). A God Who Dances: Krishna for You. Torchlight Publishing. pp. 95, 99, 103, 104. ISBN 978-0981727363.
- ↑ His Divine Grace A. C. Bhaktivedanta Swami Prabhupad. Krsna, the Supreme Personality of Godhead- Chepter-5. The Bhaktivedanta Book Trust. ISBN 978-9171495587.