నకిలీ మనిషి
నకిలీ మనిషి 1980 లో వచ్చిన చిత్రం. ఈ చిత్రంలో ద్విపాత్రలో చిరంజీవి, సంగీత, సునీత, సత్యనారాయణ నటించారు. ఈ చిత్రం 1980 ఆగస్టు 1 న విడుదలైంది.
నకిలీ మనిషి (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.డి.లాల్ |
---|---|
నిర్మాణం | యర్రగుడిపాటి వరదారావు |
కథ | కొమ్మూరి సంబశివరావు |
తారాగణం | చిరంజీవి , సత్యనారాయణ, సంగీత |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
సంభాషణలు | గొల్లపూడి మారుతీరావు |
ఛాయాగ్రహణం | ఎం.జి.ఆర్. మణి ఎస్.డి.లాల్ |
కూర్పు | డి. రాజగోపాలరావు |
నిర్మాణ సంస్థ | రవి చిత్ర ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చుప్రసాద్ ( చిరంజీవి ) ఒక మధ్యతరగతి వ్యక్తి. తన నిజాయితీ కారణంగా ఉద్యోగం కోల్పోతాడు. ఉద్యోగం పొందలేక, తన కుటుంబాన్ని పోషించుకోలేకా డబ్బు కోసం చనిపోవడానికి అంగీకరిస్తాడు. చనిపోయేలా నియమించుకున్న రమ (సునీతా) దాని కోసం డబ్బు చెల్లిస్తుంది. కానీ చివరి నిమిషంలో ప్రసాద్ జీవించాలని కోరుకుంటాడు. గంగరాజు ( సత్యనారాయణ ) సహాయంతో అతను సురక్షితమైన ప్రదేశంలో దాక్కుంటాడు. శ్యామ్ (చిరంజీవి), ప్రసాద్ రూపాన్ని పోలి ఉన్న వ్యక్తి. ఆస్తి కోసం గంగాధర్ రావును రమ సహాయంతో హత్య చేసి డబ్బును దాచిపెట్టిన వంచకుడు. శ్యామ్‌తో ప్రేమలో ఉన్న సుశీల (కవిత) ఆ హత్యను చూసి తెలివి కోల్పోతుంది. సుశీల గంగరాజు సోదరి. ప్రసాద్‌ను హత్య చేస్తే శ్యామ్, ప్రసాద్ పేరిట స్వేచ్ఛగా తిరుగుతూ ఉండవచ్చని రమ ప్లాన్ చేస్తుంది. కానీ ఆమె ప్లాన్ ఎదురు తిరుగుతుంది. శ్యామ్ రమలజీవితాలు ఏ మలుపు తిరుగుతాయి, గంగరాజు ప్రసాద్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటారు అనేది మిగిలిన కథ.
తారాగణం
మార్చు- చిరంజీవి . . . ప్రసాద్ & శ్యామ్ [ద్వంద్వ పాత్రలు]
- సంగీత
- సునీత
- జయమలిని
- కైకాల సత్యనారాయణ
- ఎం. ప్రభాకర్ రెడ్డి ... అతిథి పాత్ర
- రాజనాలా ... అతిథి పాత్ర
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: ఎస్.డి.లాల్
నిర్మాత:యెరగుడిపాటి వరదారావు
నిర్మాణ సంస్థ: రవి చిత్ర ఫిలిమ్స్
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
మాటలు: గొల్లపూడి మారుతీరావు
కథ: కొమ్మూరి సాంబశివరావు
కెమెరా: ఎం.జి.ఆర్.మణి, ఎస్.డి.లాల్
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి.
నిర్మాణంలో పాలుపంచుకున్న సంస్థలు
మార్చు- నిర్మాణ సంస్థ: రవిచిత్రా ఫిల్మ్స్
- అవుట్డోర్ యూనిట్: శారదా ఎంటర్ప్రైజెస్ & ది మోడరన్ థియేటర్స్ లిమిటెడ్
- సౌండ్ ప్రాసెసింగ్: ఆర్కె ఫిల్మ్ లాబొరేటరీస్
- స్టూడియోస్: ఎవిఎం స్టూడియోస్, మురుగన్ మోవిటోన్ & అరుణాచలం స్టూడియోస్
- కలర్ ప్రాసెసింగ్: ప్రసాద్ ఫిల్మ్ లాబొరేటరీ
పాటల జాబితా
మార్చు1.తమలపాకు లాంటిదాన్నీ, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
2.ఇటు మూగ ఆశ అటు మృత్యుఘోష , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, జానకి
3.బొమ్మ బొరుసా ఒకటే వరసా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
4.భలే భలే భలే భలే నరసింహస్వామినిరా , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .
అనల్ప విషయాలు
మార్చు- చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన మొదటి చిత్రం ఇది.
- చిరంజీవికి ఇది పద్దెనిమిదవ చిత్రం. ఇదే పతాకంలో రెండవది.
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.