నాగౌర్ జిల్లా
రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో నగౌర్ జిల్లా ఒకటి. ఈ జిల్లాలో మొదటిసారిగా పంచాయితీ రాజ్ పరిపాలన ప్రవేశపెట్టబడింది. జిల్లా వైశాల్యం 17,718 చ.కి.మీ. నాగౌర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది.
నాగౌర్ జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
నాగౌర్ జిల్లా
రాజస్థాన్ | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
డివిజను | అజ్మీర్ విభాగం |
ముఖ్య పట్టణం | నాగౌర్ |
మండలాలు | |
విస్తీర్ణం | |
• మొత్తం | 17,718 కి.మీ2 (6,841 చ. మై) |
Website | అధికారిక జాలస్థలి |
భౌగోళికం
మార్చునగౌర్ జిల్లా 26°25' & 27°40' ఉత్తర అక్షాంశం, 73°.10' & 75°.15' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా వాయవ్య సరిహద్దులో బికనీర్ జిల్లా, ఉత్తర సరిహద్దులో చురు జిల్లా, ఈశాన్య సరిహద్దులో సికార్ జిల్లా, తూర్పు సరిహద్దులో జైపూర్ జిల్లా, ఆగ్నేయ సతిహద్దులో అజ్మీర్ జిల్లా, వాయవ్య, పశ్చిమ సరిహద్దులో జోధ్‌పూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో పాలి జిల్లాలు ఉన్నాయి. జిల్లా రాజస్థాన్ లోని మేవార్ ప్రాంతంలో ఉంది. ఇది థార్ ఎడారి సమీపంలో ఉన్న " నార్త్‌వెస్టర్న్ థార్న్ స్క్రబ్ ఫారెస్ట్స్" బెల్టులో ఉంది. జిల్లా ఆగ్నేయ భూభాగం వరకు ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్నాయి. జిల్లా ఆగ్నేయ మూలలో దేశంలోనూ రాష్ట్రంలోనూ అతిపెద్ద ఉప్పునీటి సరోవరంగా గుర్తించబడుతున్న " సంభర్ సరోవరం " ఉంది. ఈ సరోవరం జైపూర్ సరిహద్దు వరకు విస్తరించి ఉంది.
తాలూకాలు
మార్చుజిల్లాలో 10 తాలూకాలు ఉన్నాయి: నాగౌర్, ఖిన్వ్సర్, జయాల్, మెర్ట, డెగన, దిద్వానా, లడ్నన్, పర్బత్సర్, రాయి, కుచమన్. ఖివంసర్ కాక మిగిలినవన్నీ ఉపవిభాగాలుగా ఉన్నాయి. జిల్లాలో 11 మండలాలు 1607 గ్రామాలు ఉన్నాయి.
2011 గణాంకాలు
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,309,234, [1] |
ఇది దాదాపు. | ఉరుగుయా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 102 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 187 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 19.25%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 948:1000 [1] |
జాతీయ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 64.08%.[1] |
జాతీయ సరాసరి (72%) కంటే. | అల్పం |
చారిత్రిక జనాభా
మార్చుచారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% p.a. |
1901 | 5,24,217 | — |
1911 | 5,59,111 | +0.65% |
1921 | 4,87,462 | −1.36% |
1931 | 5,68,434 | +1.55% |
1941 | 6,56,377 | +1.45% |
1951 | 7,63,829 | +1.53% |
1961 | 9,34,948 | +2.04% |
1971 | 12,62,157 | +3.05% |
1981 | 16,28,669 | +2.58% |
1991 | 21,44,810 | +2.79% |
2001 | 27,75,058 | +2.61% |
2011 | 33,07,743 | +1.77% |
source:[4] |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Uruguay 3,308,535 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Connecticut 3,574,097
- ↑ Decadal Variation In Population Since 1901