సొక్రాటియా ఎక్సోర్హిజా
సొక్రాటియా ఎక్సోర్హిజా (ఆంగ్లం:Socratea exorrhiza) అనే చెట్టును "వాకింగ్ పామ్" లేదా Cashapona గా కూడా పిలుస్తారు. ఇవి దక్షిణ అమెరికా, మధ్య అమెరికా లోని ఉష్ణమండల ప్రాంతాలలోని వర్షారణ్యాలలో ఉంటాయి. ఇవి 25 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటి కాండము యొక్క వ్యాసము 16 సెంటీ మీటర్ల వరకూ ఉంటుంది.[1] కానీ మరింత సాధారణంగా తీసుకుంటే ఎత్తు 15 నుండి 20 మీటర్లు, వ్యాసము 12 సెంటీమీటర్లు కలిగి యుంటాయి[2]. ఇవి అసాధారణంగా స్టిల్ట్ మూలాలు కలిగి ఉంటాయి. దీని యొక్క విధులపై యిప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. epiphyte యొక్క అనేక జాతులు పామ్ చెట్లలో కనుగొనడం జరిగింది. పామ్ అనేది బీటిల్స్, అనేక రకాల జీవులు వీటి విత్తనాలు లేదా మొలకలను తినడంవలన పర పరాగ సంపర్కం జరుగుతుంది.
సొక్రాటియా ఎక్సోర్హిజా | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | S. exorrhiza
|
Binomial name | |
Socratea exorrhiza |
“ | ఒక మొక్కను తెచ్చి మీ పెరటిలో పాతండి. అది ఎన్నేళ్ళయినా అక్కడే పెరుగుతుంది. మనకు తెలిసిన చెట్లన్నీ ఇంతే. కానీ దక్షిణ అమెరికా ఖండంలోని అమెజాన్ అడవులలో ఓ వింత చెట్టు ఉంది. దాన్ని తీసుకొని వచ్చి మీ పెరట్లో వేసి యేడాది తర్వాత చూస్తే ముందుకో, వెనుకకో, ప్రక్కకో వెళ్ళిపోయి ఉంటుంది. భూమి లోని సారం, సూర్యరశ్మి ఉన్నచోటుకి యివి జరుగుతాయి. ఇది పామ్ కుటుంబానికి చెందిన ఓ చెట్టు. దీనిని Socratea exorrhiza అంటారు. కానీ దీనిని నడిచే చెట్టు లేదా వాకింగ్ పామ్ గానే పిలుచుకుంటారు | ” |
స్టిల్ట్ వేర్ల విధులు
మార్చు1961 లో 'సొక్రాటియా ఎక్సోర్హిజా యొక్క అసాధారణ స్టిల్ట్ మూలాల గూర్చి "కార్నర్" సిద్ధాంతీకరించాడు. ఈయన అడవిలోని మురికి ప్రాంతాలలో ఎదగడానికి ఈ చెట్లకు అనుకూలంగా ఉంటుందని ప్రతిపాదించాడు. కానీ ఈ సిద్ధాంతం ప్రకారం స్టిల్ట్ మూలాలు వరదల మూలంగా కదులుట, యితర ప్రత్యామ్నాయ విధుల గూర్చి సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. 1980 లో "జాన్ హెచ్.బోడ్లే" పామ్ చెట్లు నిజానికి వేరొక చెట్టు విత్తనాలు పడినపుడు అంకురోత్పత్తి పాయింట్ నుండి దూరంగా "నడక" సాగిస్తాయని సూచించాడు. అలాంటి సంఘటనలు జరిగినట్లు ఉంటే అపుడు పామ్ చెట్టు నిలువు స్టిల్ట్ మూలాలు ఉత్పత్తివేసి తనకు తానుగా నిలబడగలదు. అపుడు దాని అసలైన వేళ్ళు కుళ్ళిపోతాయి. అపుడు ఈ మొక్క స్థానం మారుతుంది[3]. డిసెంబర్ 2009 లో అనువాద విమర్శకుడు "రోడ్ఫోర్" " మనం ఆసక్తికరంగా ఆలోచించే విధంగా వర్షాధార అడవుల లోని నేలలలో ఏ చెట్లూ నడవడం జరుగదు. అది కేవలం పురాణం " అని వ్రాశాడు. రెండు విశదమైన అధ్యయనాలు ఉదహరించడం జరిగినది[4][5][6]. సాధారణ మూలాల కంటే స్టిల్ట్ మూలాల యొక్క ఉపయోగాలు ప్రతిపాదించబడ్డాయి. 1983 లో "స్వైన్" స్టిల్ట్ మూలాలు పామ్ చెట్ల వాటి వేర్ల కదలికను నియంత్రించడనికి చాలా వ్యర్థాలను వాటి వేళ్ళవద్ద గుమికూడిస్తాయని ప్రతిపాదించాడు. "హార్ట్‌స్టోన్" 1983 లో స్టిల్ట్ మూలాలు చెట్టు కాండం వ్యాసం పెంచనీయకుండా కాంతి చేరుకోవడానికి పైకి ఎదగడానికి అనుమతించేలా చేస్తాయని ప్రతిపాదించాడు. వేర్లు చెట్టు మరింత స్థిరంగా ఉండాటానికి ఉపకరిస్తాయి. ఇవి మొక్కను వేగంగా మరింత ఎత్తుకు ఎదగనీయడానికి అవకాశాన్నివ్వవు. ఈ వేర్లు పామ్ చెట్టును బయోమాస్(జీవద్రవ్యరాశి) ను భూమిలోపల ఉన్న వేరుభాగంకంటే తక్కువ చేరేటట్లు చేస్తాయి. అందువలన చెట్టు భూమిపైకి పెరగడానికి మరింత శక్తి వస్తుంది.
వృక్షరూపములు లేదా అంట్లు
మార్చు"ఎపిఫైట్" యొక్క అనేక వృక్ష జాతులు ఈ సొక్రాటియా ఎక్సోర్హిజా పై పెరుగుతున్నట్లు కనుగొన్నారు. పనామా లోని 118 రకాల వృక్షాలపై అధ్యయనం చేసి వాటిలో 15 కుటుంబాలలలోని 66 జాతులను కనుగొన్నారు. వాటిలో 30 శాతం కాండాలు "బ్రయోఫైట్స్"కు చెందినవి, వాటి కాండం వ్యాసము పెరిగేకొద్దీ సాపేక్ష కవరేజ్ పెరిగినట్లు కనుగొన్నారు. వాటిలో సగము చెట్లు వాటిపై వాస్కులర్ ఎపిఫైట్స్ కలిగియున్నాయి. 85 రకాలలో 12 వివిధ జాతులు పామ్ చెట్లలో కనుగొన్నారు. మరొక చెట్టు 16 వివిధ జాతులతో నిండిపోయింది
ఆకు పదనిర్మాణం
మార్చుసొక్రాటియా ఎక్సోర్హిజా యొక్క ఆకులు సూర్యుని సమక్షంలో దళసరిగా పెరుగుతాయి. ఇవి ఎక్కువ ట్రైక్రోమ్స్, అధిక స్టొమేటాను నీడలో గల ఆకుల కంటే కలిగి యుంటాయి.[7]
ప్రిడేటర్
మార్చుWhite-lipped peccaries predate a large proportion of the seeds of S. exorrhiza and play an important role in limiting their population.[8]
పునరుత్పత్తి
మార్చుS. exorrhiza flowers mostly during the dry season[9] and is considered to be beetle pollinated, being frequently visited by species of Phyllotrox (Derelomini) and Mystrops (Nitidulidae).[10] Seeds weigh around 3.5 g and are around 2 cm long and 1.5 cm wide, only around 45% of them germinate and around one quarter of these die.[11]
ఉపయోగాలు
మార్చుదీని కాండము ఇళ్ళ నిర్మాణానికి ఉపయోగపడుతుంది. వివిధ వస్తువుల తయారీకి వాడుతారు[12][13] దీని కాండమును పొడవైన ముక్కలుగా కత్తిరించి వాటిని గొట్టాలుగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ భాగాలు బోలుగా ఉంటాయి.[14] దీని వేర్లు నీళ్లలో మరిగించి టీ తయారుచేసుకుంటారు.[15] పసుపు పండ్లు తినదగినవిగా ఉంటాయి.[12]
లక్షణాలు
మార్చుపొడవైన కాండం క్రింద ఉన్నవన్నీ దీనివేళ్ళే. దీని వేళ్ళలో కొన్ని భూమి నుండి ఆరడుగుల ఎత్తు వరకు ఉంటాయి. ఇవే చెట్టు కదిలేందుకు ఉపయోగపడతాయి. అనగా యివి గబగబ నడుచుకొని పోలేవు. ఈ చెట్లకు అధిక సూర్యరశ్మి, పోషకాలు కావాలి. దట్టమైన అడవులలో నేలపై సూర్యరశ్మి పడుట అరుదుగా ఉంటుంది. అలాంటి పరిస్థితులలో తన వ్రేళ్ల సాయంతో నెమ్మదిగా నడవడం మొదలుపెడుతుంది. అది ఎలాగంటే బయటికి ఉన్న వేళ్ళు కొంచెం ప్రక్కకి నాటుకుంటాయి. అవి పాతుకున్నాక పాత వేళ్లను క్రమంగా వదిలించుకుంటాయి. ఇదంతా చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇలా ఒక చెట్టు ఏడాదికి ఒక మీటరు దూరం వెళ్లగలదు. ప్రపంచంలో యిలా నడవగలిగే చెట్టు యిది ఒక్కటే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇవి కూడా చూడండి
మార్చుసూచికలు
మార్చు- ↑ doi:10.1017/S0266467403003092
This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand - ↑ Michael J. Balick (Summer 1985). "The indigenous palm flora of "Las Gaviotas" Colombia, including observations on local names and uses". 30 (3): 10.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ 3.0 3.1 Bodley, John; and Benson, Foley C. (March 1980). "Stilt-Root Walking by an Iriarteoid Palm in the Peruvian Amazon". Biotropica. 12 (1). jstor: The Association for Tropical Biology and Conservation: 67–71. doi:10.2307/2387775. JSTOR 2387775.
- ↑ Radford, Benjamin (December 2009). "The Myth of the Walking Tree". Skeptical Inquirer. 33 (6). Committee for Skeptical Inquiry: 23.
- ↑ Avalos, Gerardo; Salazar, Diego; and Araya, Ana (2005). "Stilt root structure in the neotropical palms Irlartea deltoidea and Socratea exorrhiza". Biotropica. 37 (1): 44–53. doi:10.1111/j.1744-7429.2005.03148.x.
{{cite journal}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ Goldsmith, Gregory; and Zahawi, Rakan (September–December 2007). "The function of stilt roots in the growth strategy of Socratea exorrhiza (Arecaceae) at two neotropical sites" (PDF). Revista de Biologia Tropical. 55 (3–4): 787–793. ISSN 0034-7744. PMID 19086384. Archived from the original (PDF) on 2012-02-28. Retrieved 2013-07-20.
- ↑ Araus, Jose; and Hogan, Kevin (June 1994). "Leaf structure and patterns of photoinhibition in two neotropical palms in clearings and forest understory during the dry season". American Journal of Botany. 81 (6). jstor: Botanical Society of America: 726–738. doi:10.2307/2445651. JSTOR 2445651.
- ↑ Keuroghlian, Alexine; and Eaton, Donald (2009). "Removal of palm fruits and ecosystem engineering in palm stands by white-lipped peccaries (Tayassu pecari) and other frugivores in an isolated Atlantic Forest fragment". Biodiversity and Conservation. 18 (7): 1733–1750. doi:10.1007/s10531-008-9554-6. ISSN 1572-9710.[permanent dead link]
- ↑ మూస:Jstor
This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand - ↑ "Pollination of Amazon palms". Archived from the original on 2009-01-31. Retrieved 2009-09-29.
- ↑ మూస:Jstor
This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand - ↑ 12.0 12.1 "Botanical Museum leaflets, Harvard University". 29. 1983.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ "Socratea exorrhiza (Cashapona) « Rainforest Conservation Fund". Archived from the original on 2017-09-17. Retrieved 2011-04-12.
The trunk is used in the construction of houses and other structures.
- ↑ "Socratea exorrhiza (Cashapona) « Rainforest Conservation Fund". Archived from the original on 2017-09-17. Retrieved 2011-04-12.
The inner part of the stilt roots is used as a male aphrodisiac.
- ↑ "Useful Plants: Cashapona, Socratea exorrhiza". How Stuff Works. Retrieved 2009-09-29.