నమిలికొండ బాలకిషన్ రావు

నమిలికొండ బాలకిషన్ రావు (నబారా) (1950, సెప్టెంబరు 6 - 2023, మార్చి 30), తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, న్యాయవాది, ప్రసారిక పత్రిక సంపాదకుడు. చైతన్య సాహితీ, సాంస్కృతిక సమాఖ్య, సాహితీ సమితి, పోతన విజ్ఞాన పీఠం, కాళోజీ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులుగా, రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయంలో క్రియాశీల సభ్యుడిగా, వరంగల్‌ పోతన విజ్ఞాన పీఠం కార్యదర్శిగా విశేష సేవలు అందించాడు.[1]

నమిలికొండ బాలకిషన్ రావు
నమిలికొండ బాలకిషన్ రావు
జననం1950, సెప్టెంబరు 6
పూడూరు, కరీంనగర్ జిల్లా, తెలంగాణ
మరణం2023 మార్చి 30(2023-03-30) (వయసు 72)
హనుమకొండ, తెలంగాణ
వృత్తిన్యాయవాది
ప్రసిద్ధికవి, పత్రిక సంపాదకుడు.
భార్య / భర్తగోకుల్‌ రాణి
పిల్లలుఒక కుమారుడు (డాక్టర్‌ పాంచాల్‌రాయ్‌)
ఇద్దరు కుమార్తెలు (కవిత భరద్వాజ్‌, హరిత భరద్వాజ్‌)
తల్లిదండ్రులునారాయణరావు - రత్నబాయి

బాలకిషన్ రావు 1950, సెప్టెంబరు 6తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, పూడూరులో నారాయణరావు - రత్నబాయి దంపతులకు రెండో సంతానంగా జన్మించాడు.[2]

విద్య, ఉద్యోగం

మార్చు

జగిత్యాలలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత హనుమకొండలోని రాగన్న దర్వాజ ప్రాంతంలో స్థిరపడ్డాడు. ఎం.ఏ., ఎల్.ఎల్.బి. పట్టభద్రుడైన బాలకిషన్ హనుమకొండలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. డాక్యుమెంట్‌ రైటర్‌గా కూడా సుప్రసిద్ధులయ్యారు.

వ్యక్తిగత జీవితం

మార్చు

బాలకిషన్‌రావుకు గోకుల్‌ రాణితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (డాక్టర్‌ పాంచాల్‌రాయ్‌), ఇద్దరు కుమార్తెలు (కవిత భరద్వాజ్‌, హరిత భరద్వాజ్‌) ఉన్నారు.[2]

సాహితీ ప్రస్థానం

మార్చు

వరంగల్లు, హనుమకొండలలో అనేక సాహితీ కార్యక్రమాలను నిర్వహించాడు. వర్ధమాన రచయితలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1982లో ప్రసారిక అనే మాసపత్రికను స్థాపించాడు. నబారా సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేసి ఎందరో రచయితలను సత్కరించాడు. బాలకిషన్‌రావు రచనలపై రెండు విమర్శక గ్రంథాలు వెలువడ్డాయి.[3]

రచనలు

మార్చు
  1. యువస్వరం (1981)
  2. అక్షర చిత్రాలు (1986)
  3. శాంతి సమత (1989)
  4. అక్షరాల్లో అనంతం (1990)
  5. అక్షర ప్రతిబింబం (2006)
  6. ప్రసారకీయ కుసుమాలు (2010)

బాలకిషన్ రావు అనారోగ్యంతో తన 72 ఏళ్ళ వయసులో హనుమకొండలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2023, మార్చి 30న మరణించాడు.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ABN (2023-03-31). "సాహితీవేత్త 'నమిలికొండ' కన్నుమూత". Andhrajyothy Telugu News. Retrieved 2023-03-31.
  2. 2.0 2.1 telugu, NT News (2023-03-31). "సాహితీ శిఖరం నమిలికొండ అస్తమయం". www.ntnews.com. Archived from the original on 2023-03-31. Retrieved 2023-03-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. sivanagaprasad.kodati. "కవి నమిలికొండ బాలకిషనరావు ఇక లేరు". Asianet News Network Pvt Ltd. Archived from the original on 2023-03-30. Retrieved 2023-03-30.