నల్లగట్ల స్వామి దాస్

నల్లగట్ల స్వామి దాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తిరువూరు నియోజకవర్గం నుండి  రెండుసార్లు శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.

నల్లగట్ల స్వామి దాస్
పదవీ కాలం
1994 – 2004
ముందు కోనేరు రంగారావు
తరువాత కోనేరు రంగారావు
నియోజకవర్గం తిరువూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1963-10-04) 1963 అక్టోబరు 4 (వయసు 61)
అనుమోల్లంక, గంపలగూడెం మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(2024-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ (1994-2024)
జీవిత భాగస్వామి సుధా రాణి నల్లగట్ల
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్, తెలంగాణ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

నల్లగట్ల స్వామి దాస్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివియా హోదాల్లో పని చేసి 1994, 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో తిరువూరు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2004, 2009, 2014 ఎన్నికలలో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత టీడీపీని వీడి 2023 జనవరి 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి[1], 2023 జనవరి 18న తిరువూరు వైసీపీ ఇన్‌చార్జ్‌గా నియమితుడయ్యాడు.[2]

నల్లగట్ల స్వామి దాస్ 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో తిరువూరు నుండి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస రావు చేతిలో 21874 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]

మూలాలు

మార్చు
  1. Sakshi (11 January 2024). "సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన స్వామిదాస్". Archived from the original on 12 January 2024. Retrieved 12 January 2024.
  2. Eenadu (18 January 2024). "నియోజకవర్గ ఇన్‌ఛార్జిల మార్పు.. వైకాపా నాలుగో జాబితా విడుదల". Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.
  3. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Tiruvuru". Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024.