నల్ల మస్తాన్ దర్గా
గుంటూరు నల్లమస్తాన్గా ప్రసిద్ధిగాంచిన కాలే మస్తాన్ షాహ్ వలీ (1685-1895) గుంటూరు నగరంలోని ఆర్. అగ్రహారం వద్ద స్థిరపడిన ఇస్లాం మత గురువు. స్థానికుల ప్రకారం ఈయన ఒక అవధూత. ఈయనను హిందువులు, మొహమ్మదీయులు ఇరువురూ పూజిస్తారు.
దర్గా
మార్చుదర్గా అనేది సూఫీ మతానికి చెందిన మొహమ్మదీయ మత గురువుల సమాధి. కాలే మస్తాన్ షాహ్ వలీ దర్గా గుంటూరు నగరంలోని నగరంపాలెం పేటలో ఉంది.
మస్తాన్ షాహ్ వలీ జీవితం
మార్చుసయ్యదు వంశంలో, తమిళనాడులోని తిరుచునాపల్లిలో పుట్టిన వలీ[1] బాల్యంలోనే ఇల్లు వదిలేసి తపస్సు చేస్తూ దేశాటన చేస్తూ అనంతపురం జిల్లా ధర్మవరం, గుంతకల్లు, నెల్లూరు దగ్గర కసుమూరు, రాజమండ్రి దగ్గర గోకవరం, విశాఖపట్నం పరాడకొండ, కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని కొత్తపేట, మరెన్నో ఊర్లు తిరిగి వయోవృద్ధుడిగా గుంటూరు వచ్చి స్థిరపడ్డాడు. నల్లని శరీరఛాయ వలన నల్ల మస్తాన్/కాలే మస్తాన్ అని పిలవబడ్డాడు. చనిపోయిన మేకను బ్రతికించడం, మాంసంగా మారిన కోడిని తిరిగి యథారూపంలోకి తెప్పించడం, తన శరీరం ముక్కలుగా చేసి తిరిగి ఒకటై బ్రతకడం లాంటి మహిమలు చూపించాడని ఆయన భక్తులు నమ్ముతారు. "ఖండ యోగ సిద్ధి" అనగా శరీరం ముక్కలుగా కోసేసినా తిరిగి అతికించి బతికించడం సిద్ధించిన వ్యక్తిగా కూడా జనం నమ్ముతారు.
చావు
మార్చువలీ 1895 మే 23న దేహం చాలించాడు. ఆ తేదీన మరణించనున్నట్టు అందుకు 5 రోజుల ముందే
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రప్రదేశ్ లో దర్శించవలసిన ప్రముఖ దర్గాలు. రాజమండ్రి: మోహన్ పబ్లికేషన్స్. p. 1.