నవనాథ చరిత్ర

తెలుగు ద్విపద కావ్యం

నవనాథ చరిత్ర 14-15వ శతాబ్దానికి చెందిన ద్విపద కావ్యము. దీనిని గౌరన రచించెను. దీనిని కోరాడ రామకృష్ణయ్య సంపాదకత్వంలో మద్రాసు విశ్వవిద్యాలయం 1937లో ముద్రించింది.[1]

శ్రీగిరికవి రచించిన నవనాధ చరిత్రను అనుసరించి గౌరన ఈ నవనాథ చరిత్ర ద్విపద కావ్యాన్ని రచించాడు. ఇందులో తొమ్మిది మంది శైవ సిద్దుల మహాత్మ్యం వర్ణించబడిండి. వీరిలో మీననాధుడు అపార మహిమాన్వితుడు. ఆనాటి జనసామాన్యంలో వ్యాప్తిలో ఉన్న సారంగధర కథను రెండు ఆశ్వాసాలలో రచించాడు. చేమకూర వెంకటకవి గౌరన సారంగధర చరిత్రను అనుసరించే సారంగధర కథను రచించాడు. 15వ శతాబ్దంలోని తెలుగు దేశ సాంఘిక స్థితిగతులను తెలుసుకోవడానికి గౌరన రచన ఉపకరిస్తుంది. ఇందులో గొల్లవారికి సంబంధించిన విశేషాలు, పశురోగ వివరణలు ఉన్నాయి.

దీనిని శ్రీశైలంలో ఒక మఠాధిపతిపదియైన భిక్షుకవృత్తి శాంతరాయడు గౌరనమంత్రిని ప్రోత్సాహించినట్లుగా చెప్పుకున్నాడు; కావ్యాన్ని శ్రీశైల మల్లికార్జునికి అంకితమిచ్చాడు.

విషయసూచిక

మార్చు

ప్రథమాశ్వాసము:

కృతి ప్రశంస, ముక్తికాంత భిక్షావృత్తిరాయ ప్రశంస, కృతికర్త వంశావళి, అంకితము, కథాప్రారంభము, కైలాసవర్ణనము, శివుని కొలువు, వసంతవర్ణనము, శివుని యధ్యాత్మ విద్యోపదేశము, మీననాథుని జన్మప్రకారము, శివుడు మీననాథునికి వరము లోసంగుట, శివుడు కైలాసమున కేగుట, మీననాథుని దేశాటనము, మాంధాతపురమున గొల్లడు మీననాథుని దర్శించుట, సారంగధరుని కథ.

ద్వితీయాశ్వాసము:

చౌరంగి వృత్తాంతము, గోరక్షసిద్ధుని కథ, సర్పరూపమొందిన గంధర్వుని కథ

తృతీయాశ్వాసము:

మేఘనాథసిద్ధుని కథ, విరూపాక్షనాథుని కథ, వంచక పురోహితుని కథ, కపోత వృత్తాంతము

చతుర్థాశ్వాసము:

నాగార్జునసిద్ధుని కథ, ఖణికాఖ్యసిద్ధుని కథ, మీననాథుని పరకాయప్రవేశము, మీననాథుని హిమవత్ ప్రయాణము

పంచమాశ్వాసము:

మీననాథుడు శిష్యుల మతవ్యాప్తి జేయ బంపుట, గోరక్షుడు శ్రీశైలంబునకు బోవుట, అల్లమప్రభుని రాక, గోరక్ష-ప్రభువుల సంవాదము, నాగార్జునశిష్యుడు-రసవాదము, విష్ణువు నాగార్జునశిష్యుని బంపుట, వ్యాళిసిద్ధుడు-కాయసిద్ధి, గోరక్కుని వృత్తాంతము, కృష్ణకంధారభూపుని కథ

మూలాలు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. గౌరన (1937). నవనాథ చరిత్ర (in Telugu). Madras: మద్రాసు విశ్వవిద్యాలయం. Retrieved 13 March 2021.{{cite book}}: CS1 maint: unrecognized language (link)