సారంగధర
సారంగధర (Sarangadhara) ఒక చరిత్రాత్మక కథ. ఇది రాజరాజ నరేంద్రుడు పరిపాలించే కాలంలో జరిగిందని నమ్మకం. దీనిని గురజాడ అప్పారావు ఆంగ్లంలో పద్య కావ్యంగా రచించారు. తరువాత ఇది సుప్రసిద్ధ నాటకంగా ఆంధ్రదేశమంతా ప్రదర్శించబడింది. ఇది తెలుగులో రెండు సినిమాలు నిర్మించబడ్డాయి.
కథ
మార్చురాజ రాజ నరేంద్రుడు రాజమండ్రిని రాజధానిగా చేసుకొని వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తుండేవాడు. రాజరాజనరేంద్రుడినికి సారంగధరుడు అనే కుమారుడు, చిత్రాంగి అనే రెండవ భార్య ఉండేది. రాజరాజ నరేంద్రుడి సవతి తల్లి కుమారుడు విజయాదిత్యుడు రాజ రాజ నరేంద్రుడికి పక్కలో బల్లం వలే ఉండేవాడు.
ఒకరోజు చిత్రాంగి సారంగధారుడిని విందుకు ఆహ్వానించింది, వేట పై ఆసక్తి ఉన్న సారంగధారుడు విందుకు రాకుండా వేటకు వెళ్తాడు. ఆ విషయాన్ని చారుల ద్వారా తెలుసుకొన్న విజయాదిత్యుడు చిత్రాంగి - సారంగధారుడికి అక్రమ సంభంధం ఉన్నదని రాజారాజ నరేంద్రుడి చెబుతాడు. విషయా విషయాలు పరిశీలించకుండా రాజరాజ నరేంద్రుడు సారంగధారుడి రెండు చేతులు, రెండు కాళ్ళు ఖండించాలని శిక్ష వేస్తాడు. సేవకులు రాజాజ్ఞ పరిపాలించి సారంగధారుడిని నగరానికి ఉత్తర దిశలో అడవులతో నిండిన ఒక ఎత్తైన పర్వతం మీద రెండు చేతులు రెండు కాళ్ళు ఖండించి పాడవేస్తారు. సారంగధారుడు రెండు చేతులు కాళ్ళ నుండి నెత్తురు పారుతూ ఉండగా సారంగధారుడూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు సారంగ ధారుడికి ఆకాశవాణి ద్వారా పూర్వ జన్మలో చేసిన పాపం వల్ల ఈ శిక్షని అనుభవించవలసి వచ్చిందని, ఈ జన్మలో పాపం ఏమి చెయ్యలేదని చెబుతుంది. ఆ ఆర్త నాధం విన్న మేఘనాధ అనే శివ భక్తుడు అక్కడకు వచ్చి సారంగధారుడికి సపర్యలు చేసి, శివుడిని ప్రార్థించమని సలహా చెబుతాడు. సారంగధారుడు మేఘనాధుడి సూచన ప్రకారం శివుడి ఆరాధిస్తే శివుడు ఆ ప్రార్థనతో సంతృప్తి చెంది సారంగధారుడికి తన పూర్వపు చేతులు, కాళ్ళు, మంచి అందమయిన శరీరాన్ని ప్రసాదిస్తాడు.
సారంగధరేశ్వర దేవాలయం
మార్చుసారంగధరుడికి దర్శనం ప్రసాదించిన కొండమీద వెలసిన శివుడు సారంగధరేశ్వరుడిగా కొలవబడుతున్నాడు. ఇది రాజమండ్రి పట్టణంలో కోరుకొండ మార్గంలో ఉంది.
సినిమాలు
మార్చు- సారంగధర (1930 సినిమా), 1930లో వై.వి.రావు దర్శకత్వంలో నిర్మించిన మూకీ సినిమా.
- సారంగధర (1937 సినిమా), 1937లో పి.పుల్లయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా. బందా కనకలింగేశ్వరరావు సారంగధరుడిగా నటించారు.
- సారంగధర (1957 సినిమా), 1957లో ఎన్.టి.రామారావు, భానుమతి నటించిన సినిమా.