నసుమ్ అహ్మద్
నసుమ్ అహ్మద్ (జననం 1994 డిసెంబరు 5) బంగ్లాదేశ్ క్రికెటరు. అతను దేశీయ క్రికెట్‌లో సిల్హెట్ డివిజన్ తరపున ఆడుతున్నాడు. 2021 మార్చిలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు.[2]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | సిల్హెట్, బంగ్లాదేశ్ | 1994 డిసెంబరు 5||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. (183 cమీ.)[1] | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Left-arm orthodox spin | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 138) | 2022 జూలై 10 - వెస్టిండీస్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 మార్చి 23 - ఐర్లాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 69) | 2021 మార్చి 28 - న్యూజీలాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 మార్చి 31 - ఐర్లాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 13 March 2023 |
తొలినాళ్ళ జీవితం
మార్చునసుమ్ అహ్మద్ 1994 డిసెంబరు 5న సిల్హెట్ ప్రాంతం లోని జలాలాబాద్‌లో బెంగాలీ ముస్లిం తల్లిదండ్రులకు జన్మించాడు. అతని తాత, 1958లో సునమ్‌గంజ్ జిల్లా, డెరాయ్ లోని మర్దాపూర్ గ్రామం నుండి సిల్హెట్‌కు వలస వెళ్ళాడు. [3]
కెరీర్
మార్చు2019 నవంబరులో, 2019–20 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో చటోగ్రామ్ ఛాలెంజర్స్ తరపున ఆడేందుకు నసుమ్ ఎంపికయ్యాడు. [4]
2020 మార్చిలో, జింబాబ్వేతో సిరీస్ కోసం బంగ్లాదేశ్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టుకు నసుమ్ ఎంపికయ్యాడు. [5] 2021 జనవరిలో, వెస్టిండీస్‌తో జరిగే వన్ డే ఇంటర్నేషనల్ (వన్‌డే) సిరీస్‌కు ప్రాథమిక జట్టులో ఎంపికైన నలుగురు కొత్త ఆటగాళ్లలో అతనొకడు. [6] 2021 ఫిబ్రవరిలో, న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ కోసం ఎంపికయ్యాడు. [7] బంగ్లాదేశ్ తరపున 2021 మార్చి 28న న్యూజిలాండ్‌పై తన T20I రంగప్రవేశం చేసాడు. [8]
2021 ఆగస్టు 3 న ఆస్ట్రేలియాతో జరిగిన T20 మ్యాచ్‌లో, నసుమ్ 19 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి, బంగ్లాదేశ్ మొదటిసారి T20లో ఆస్ట్రేలియాపై విజయం సాధించడంలో తోడ్పడ్డాడు. [9] [10]
2021 సెప్టెంబరు 8న, న్యూజిలాండ్‌తో జరిగిన T20 మ్యాచ్‌లో, నసుమ్ 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ న్యూజిలాండ్‌తో మొదటిసారి T20 సిరీస్‌ను గెలుచుకోవడంలో అది సహాయపడింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. [11] అదే నెలలో నసుమ్, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు ఎంపికయ్యాడు. [12]
2022 ఫిబ్రవరిలో నసుమ్, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టుకు ఎంపికయ్యాడు. [13] 2022 మార్చిలో, దక్షిణాఫ్రికాతో జరిగే వన్‌డే సిరీస్ కోసం కూడా ఎంపికయ్యాడు. [14] 2022 మేలో, వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ కోసం, మళ్లీ వన్‌డే జట్టుకు ఎంపికయ్యాడు.[15] 2022 జూలై 10న వెస్టిండీస్‌పై తన తొలి వన్‌డే ఆడాడు.[16]
మూలాలు
మార్చు- ↑ Faiz Ahmed, Syed (8 September 2021). "Nasum's confidence from Mirpur must be translated into T20 WC". Dhaka Tribune.
The six-feet tall బౌలరు [...]
- ↑ "Nasum Ahmed". ESPN Cricinfo. Retrieved 13 August 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "নিষেধাজ্ঞা নিয়ে মুখ খুললেন নাসুম" [Nasum opens up about ban]. Somoy TV (in Bengali). 17 August 2021.
- ↑ "BPL draft: Tamim Iqbal to team up with coach Mohammad Salahuddin for Dhaka". ESPN Cricinfo. Retrieved 18 November 2019.
- ↑ "Bangladesh T20 squad: Mushfiqur Rahim back, Nasum Ahmed breaks in". ESPN Cricinfo. Retrieved 5 March 2020.
- ↑ "No place for Mashrafe against West Indies". The Daily Star. Retrieved 4 January 2021.
- ↑ "Bangladesh leave out Taijul Islam for New Zealand tour". ESPN Cricinfo. Retrieved 19 February 2021.
- ↑ "1st T20I, Hamilton, Mar 28 2021, Bangladesh tour of New Zealand". ESPN Cricinfo. Retrieved 28 March 2021.
- ↑ "Bangladesh vs Australia: Nasum Ahmed shines as Tigers register first win over visitors in T20Is - Firstcricket News, Firstpost". Firstpost. Retrieved 3 August 2021.
- ↑ Desk, India com Sports (3 August 2021). "Live Bangladesh vs Australia Match 1st T20I Score : Live Updates From Dhaka". India News, Breaking News | India.com (in ఇంగ్లీష్). Retrieved 3 August 2021.
- ↑ "Bangladesh Beat New Zealand By 6 Wickets To Seal T20 series Win | Cricket News". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 8 September 2021.
- ↑ "No surprises as Bangladesh name Mahmudullah-led squad for T20 World Cup". ESPN Cricinfo. Retrieved 9 September 2021.
- ↑ "Ebadot gets ODI call-up as Bangladesh name four uncapped players for Afghanistan series". ESPN Cricinfo. Retrieved 14 February 2022.
- ↑ "Shakib Al Hasan, Tamim Iqbal back in Bangladesh Test squad". ESPN Cricinfo. Retrieved 3 March 2022.
- ↑ "Anamul Haque recalled for WI white-ball series; Mustafizur Rahman back in Test squad". ESPN Cricinfo. Retrieved 22 May 2022.
- ↑ "1st ODI, Providence, July 10, 2022, Bangladesh tour of West Indies". ESPN Cricinfo. Retrieved 10 July 2022.