నాంపల్లి, తెలంగాణ రాష్ట్రం,హైదరాబాదు జిల్లా,నాంపల్లి మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం.[1]

నాంపల్లి లోని ఒక ప్రాంతం
నాంపల్లి లోని ఒక ప్రాంతం

ఇది హైదరాబాదు నగరంలో అభివృద్ది చెందిన పట్టణ ప్రాంతాలలో నేడు ఇది ఒకటి.ఇది హైదరాబాదు జిల్లాలో ఒక మండలం.

చరిత్రసవరించు

కుతుబ్‌షాహీల కాలంలో నాంపల్లి ఒక చిన్న కుగ్రామం. మెయజ్‌-ఇ-నాంపల్లిగా పిలిచేవారు. ప్రస్తుతం నాంపల్లిగా రూపాంతరం చెందింది. నగరంలో రద్దీ కేంద్రాలలో ఒకటి. నిజాం రాష్ట్రంలో 1670 AD సమయంలో దివాన్ ఆఫ్ నిజాంగా పనిచేసిన రజా అలీ ఖాన్ కు రాసిచ్చిన జాగీర్ పై అతని పేరు నేక్ నామ్ ఖాన్ అని ఉంది. చివరాఖరకు ఆ పేరు నేక్ నాంపల్లిగా, చివరకు నాంపల్లిగా స్థిరపడింది.

రైల్వే స్టేషన్ నిర్మాణంసవరించు

 
నాంపల్లి రైల్వే స్టేషన్

నాంపల్లి రైల్వే స్టేషన్ 1907 లో హైదరాబాద్ యొక్క చివరి నిజాం ఒస్మాన్ అలీ ఖాన్, అస్సాఫ్ జా 7 చే నిర్మించబడింది.దీనిని హైదరాబాదు రైల్వం స్టేషను ఇన కూడా అంటారు.

రవాణా సౌకర్యంసవరించు

నాంపల్లి ప్రాంతం రోడ్డు, రైలు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నడిపే బస్సులు ఈ ప్రదేశం నుండి పలు ప్రదేశాలకు అనుసంధానించబడి ఉన్నాయి.హైదరాబాదు ప్రధాన రైల్వే స్టేషన్ రాష్ట్రం, దేశం యొక్క వివిధ ప్రాంతాలకి అనుసంధానిస్తూ నాంపల్లి రైల్వే స్టేషన్ గా పిలువబడుతుంది. హైదరాబాద్ మల్టీ-మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి స్థానిక నగర రైలు సేవలను నగరం యొక్క ముఖ్యమైన ప్రాంతాలకు అనుసంధానిస్తుంది. ఆటోలు, టాక్సీలు ఏడు సీటర్ కలిగిన మోటారు వాహనాలు నగరం యొక్క వివిధ ప్రాంతాలకు రవాణా చేసే సదుపాయాన్ని అందిస్తున్నాయి.

మూలాలుసవరించు

  1. "Mandals & Villages list of Hyderabad District". Cite web requires |website= (help)

వెలుపలి లంకెలుసవరించు