హైదరాబాదు రైల్వే స్టేషను

నిజాం రాష్ట్రంలో 1670 AD సమయంలో దివాన్ ఆఫ్ నిజాంగా పనిచేసిన రజా అలీ ఖాన్ కు రాసిచ్చిన జాగీర్ పై ఆయన పేరు నేక్ నామ్ ఖాన్ అని ఉంది. చివరాకరుకు ఆ పేరు నేక్ నాంపల్లిగా, చివరకు నాంపల్లిగా స్థిరపడింది.

Hyderabad Deccan
హైదరాబాద్ దక్ఖన్ రైల్వే స్టేషను
Indian Railway Station
Hyderabad Deccan station.jpg
Front view of the station
సాధారణ సమాచారం
LocationHyderabad District, Telangana
 India
Coordinates17°23′33″N 78°28′03″E / 17.3924°N 78.4675°E / 17.3924; 78.4675Coordinates: 17°23′33″N 78°28′03″E / 17.3924°N 78.4675°E / 17.3924; 78.4675
Elevation1,759 ft
ఫ్లాట్ ఫారాలు6
ఇతర సమాచారం
స్టేషను కోడుHYB
జోన్లు South Central Railway
డివిజన్లు సికింద్రాబాద్
History
Opened1874
విద్యుత్ లైను2003
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
నాంపల్లి రైల్వేస్టేషను

నాంపల్లి రైల్వే స్టేషనుగా ప్రసిద్ధిచెందిన హైదరాబాదు దక్ఖన్ రైల్వే స్టేషను హైదరాబాదులోని ముఖ్యమైన రైల్వే స్టేషను. 1874 అక్టోబరు 8 తేదీన హైదరాబాదు రవాణా చరిత్రలో ఒక మరుపురాని రోజు. ఈ రోజు అప్పటి నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ హైదరాబాదు రైల్వే స్టేషనును ప్రారంభించారు.

చరిత్రసవరించు

బొంబాయి నుండి మద్రాసు వరకు ఆంగ్లేయుల కాలంలోనే రైలు మార్గాన్ని ప్రతిపాదించగా, హైదరాబాద్ నగరాన్ని ఈ మార్గంతో అనుసంధానం చేయడం మంచిదని అప్పటి నిజాం పాలకు భావించారు. 1855లో అప్పటి బ్రిటిష్ ప్రతినిధి డల్హౌసి నిజాం పాలకులకు ఈ మేరకు ప్రతిపాదనను పంపారు. తదనుగుణంగా షోలాపూర్ నుండి హైదరాబాద్ కు రైలు మార్గాన్ని నిర్మించేందుకు 1862లో ఆమోదం లభించింది. నిజాం పాలకుల ఆర్థిక వనరులతో నిజాం స్టేట్ రైల్వే కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అప్పటికే ప్రారంభించిన 110 కిలోమీటర్ల వాడి - హైదరాబాద్ రైలు మార్గ నిర్మాణ పనులు వేగం పుంజుకోవడంతో 1874 అక్టోబరు 8 తేదీన రైలు మార్గాన్ని ప్రారంభించారు.

మొదట ఈ రైలు మార్గంలో రాకపోకలు తక్కువగా సాగడంతో నిజాం స్టేట్ రైల్వే ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూసింది. తదనంతరం రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలను కలుపుతూ రైలు మార్గాల ఏర్పాటు పనులు ప్రారంభయ్యాయి. 1930లో నిజాం స్టేట్ రైల్వే సంస్థ ఒక ప్రత్యేక ప్రతిపత్తి గల సంస్థగా రూపుదిద్దుకొని రైల్వే కార్యకలాపాలు చేపట్టింది. భారత స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వంలో విలీనమైంది. క్రమంగా మధ్య రైల్వేలోని వివిధ డివిజన్లను, దక్షిణ రైల్వే పరిధిలోని కొంతభాగాన్ని విభాగించి, దక్షిణ మధ్య రైల్వేను ఏర్పాటుచేశారు.

రైలు మార్గములుసవరించు

పరీవాహక ప్రాంతాలుసవరించు

స్టేషను స్టేషను కోడ్ సమీపంలోని శివార్లలో విస్తరణ జరిగింది
సికింద్రాబాద్ ఎస్‌సి మారేడ్‌పల్లి, ప్యాట్నీ, కార్ఖానా,
జేమ్స్ స్ట్రీట్ జెఈటి ఎమ్‌.జి.రోడ్డు, ప్యారడైజ్, రాణిగంజ్, మినిష్టర్ రోడ్డు, హుస్సేన్ సాగర్
సంజీవయ్య పార్క్ ఎస్‌జెవిపి నెక్లెస్ రోడ్డు, మినిష్టర్ రోడ్డు, మహాత్మా గాంధీ రోడ్, పట్టిగడ్డ
బేగంపేట బిఎమ్‌టి అమీర్‌పేట, గ్రీన్‌ల్యాండ్స్, సోమాజిగూడ, పంజగుట్ట, బ్రాహ్మణవాడి
ప్రకృతి చికిత్సాలయ ఎన్‌సిహెచ్‌ఎస్ బల్కంపేట్, అమీర్‌పేట, సంజీవరెడ్డి నగర్
ఫతే నగర్ ఎఫ్‌ఎన్‌బి బాలానగర్, సనత్‌నగర్, యెల్లమ్మ గుడి
భరత్ నగర్ బిటిఎన్‌ఆర్ మూసపేట్, కూకట్‌పల్లి, నిజాంపేట్, సనత్‌నగర్
బోరబండ బిఆర్‌బిడి అల్లాపూర్, గాయత్రినగర్, తులసినగర్, మోతినగర్, రాజీవ్ నగర్, యర్రగడ్డ
హైటెక్ సిటీ హెచ్‌టిసివై కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలని కెపిహెచ్‌బి, ఇజ్జత్ నగర్, మాదాపూర్, జెఎన్‌టియు
హఫీజ్‌పేట్ హెచ్‌ఎఫ్‌జడ్ మాదాపూర్, కొండాపూర్, మియాపూర్
చందా నగర్ సిడిఎన్‌ఆర్ చందానగర్, మదీనాగూడ
లింగంపల్లి ఎల్‌పిఐ బిహెచ్ఇఎల్ టౌన్షిప్, హెచ్‌సియు, గచ్చిబౌలి
సీతాఫల్‌మండి ఎస్‌టిపిడి ఈఎఫ్‌ఎల్‌యు, తార్నాక
ఆర్ట్స్ కాలేజ్ ఎటిసి ఉస్మానియా విశ్వవిద్యాలయం, వారాసిగూడ, ఆడిక్‌మెట్
జామియా ఉస్మానియా జెఒఒ బర్కత్‌పుర, రాంనగర్
విద్యానగర్ విఎఆర్ శంకర్ మఠం, ఆర్టీసీ X రోడ్స్, చిక్కడపల్లి, శివం రోడ్, తిలక్‌నగర్, అంబర్‌పేట్
కాచిగూడ కెసిజి బర్కత్‌పుర, చాదర్‌ఘాట్, నారాయణగూడ, కోటి, అబిడ్స్
మలక్‌పేట ఎమ్‌ఎక్స్‌టి చాదర్‌ఘాట్, నల్గొండ 'X' రోడ్లు, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట్, చార్మినార్
దబీర్‌పుర డిక్యుబి చంచల్‌గూడ, సైదాబాద్, ప్రింటింగ్ ప్రెస్, పురాణీ హవేలీ, మీర్ ఆలం మండి, సాలార్ జంగ్ మ్యూజియం
యాకుత్‌పురా వైకెఎ సైదాబాద్, సంతోష్ నగర్, మాదన్నపేట్, పిసాల్ బండ , రెయిన్ బజార్ ఎడిబజార్, బ్రాహ్మణ వాడి, బడా బజార్
ఉప్పుగూడ హెచ్‌పిజి లాల్ దర్వాజా, అలియాబాద్, శాలిబండ, దారుషిఫా, జహనుమ, చార్మినార్
ఫలక్‌నామా ఎఫ్‌ఎమ్ ఉద్దేన్ గడ్డ, చాంద్రాయణ గుట్ట, బర్కాస్
హైదరాబాద్ దక్కన్ హెచ్‌వైబి సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, హైదర్‌గూడ, అబిడ్స్, మొజాంజాహి మార్కెట్, దేవి బాగ్, క్రిమినల్ కోర్ట్స్,
లక్డి కా పుల్ ఎల్‌కెపిఎల్ సైఫాబాద్, రెడ్ హిల్స్, పబ్లిక్ గార్డెన్స్, మాసాబ్ ట్యాంక్, నీలోఫర్ హాస్పిటల్
ఖైరతాబాద్ కెక్యుడి బంజారా హిల్స్, రాజ్ భవన్ రోడ్, పంజగుట్ట, చింతల్ బస్తీ
నెక్లెస్ రోడ్ ఎన్‌ఎల్ఆర్‌డి రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ, పంజగుట్ట, ఎమ్‌ఎస్ మఖ్త
లాలగూడ ఎల్‌జిడిహెచ్ లాల్లగూడ , మల్కాజ్‌గిరి , శాంతినగర్, తుకారం గేట్
మల్కాజ్‌గిరి ఎమ్‌జెఎఫ్ మల్కాజ్గిరి, ఆనంద్‌బాగ్, హనుమాన్‌పేట్, మీర్జాల్‌గూడ
దయానంద్ నగర్ డివైఈ వాణి నగర్, మల్లికార్జున నగర్, ఆర్‌కె నగర్
సఫిల్‌గూడ ఎస్‌ఎఫ్‌ఎక్స్ సఫిల్గూడ, వినాయక్ నగర్, సాయినాదపురం
రామకృష్ణాపురం ఆర్‌కెఒ నేరేడ్‌మెట్
అమ్ముగూడ ఎఎమ్‌క్యు సైనిక్‌పురి
కావల్రీ బ్యారక్స్ సివిబి లోతకుంట
ఆల్వాల్ ఎఎల్‌డబ్ల్యు పాత
బొల్లారం బజార్ బిఒజడ్ కొంపల్లి
బొల్లారం బిఎమ్‌ఒ రిసాల బజార్ వాటర్ ట్యాంక్ / హకీంపేట్

మూలాలుసవరించు

  • నాంపల్లి స్టేషనుకు 135 ఏళ్ళు, ఈనాడు 2008 అక్టోబరు 8 దినపత్రికలో ప్రచురించిన వ్యాసం ఆధారంగా.