నాగభైరువారి పాలెం

(గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలో గూడా నాగభైరవవారిపాలెం ఉంది.)

నాగభైరువారి పాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
నాగభైరువారి పాలెం is located in Andhra Pradesh
నాగభైరువారి పాలెం
నాగభైరువారి పాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°03′52″N 80°13′45″E / 16.064341°N 80.229238°E / 16.064341; 80.229238
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పెదనందిపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

నాగభైరవవారి పాలెం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ పంచాయతీ

మార్చు

ఈ గ్రామ పంచాయతీలో, 2 వార్డులూ, 500 మంది ఓటర్లూ ఉన్నారు. గ్రామంలో సగభాగం పెదనందిపాడు మండలం, ఉప్పలపాడు గ్రామపంచాయతీ కింద, గుంటూరు శాసనసభా పరిధిలోనూ, గుంటూరు పార్లమెంటు పరిధిలోకీ వస్తుంది. మిగతా సగభాగం, చిలకలూరిపేట మండలంలోని గొట్టిపాడు గ్రామ పంచాయతీ కింద, నరసరావుపేట శాసనసభ పరిధిలోకీ, నరసరావుపేట పార్లమెంటు పరిధిలోకీ వస్తుంది.

గ్రామ విశేషాలు

మార్చు

సయ్యద్ సుబానీ

మార్చు
  1. ఈ గ్రామానికి చెందిన సన్నకారు రైతు సయ్యద్ సుబానీ స్వయం కృషితో రూపొందించిన బూమ్ స్ప్రేయర్ (ట్రాక్టర్ ద్వారా పురుగుమందు వెదజల్లే కొత్తరకం పరికరం) లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులలో నమోదయింది. ఈ పరికరంతో ఒక ఎకరాకు 5 నిమిషాలలో పురుగు మందు చల్లవచ్చు.
  2. సయ్యద్ సుబానీ, అతితక్కువ ఖర్చు (రు. 6,000) తో, సోలార్ బూం స్ప్రేయర్ రూపకల్పన చేశారు. అన్ని పైర్లకూ రసాయన ఎరువులు పిచికారీ చేసేవిధంగా దీనిని తయారు చేశాడు. వాతావరణంలో ఉష్ణోగ్రత 25డిగ్రీల సెల్సియస్ ఉంటే ఇది పనిచేస్తుంది. దీనితో రోజుకి 10 ఎకరాల మందు జల్లుకోవచ్చు. ఈ స్ప్రేయర్ వాడటం వలన, ఒక ఎకరానికి 50 రూ. మాత్రమే ఖర్చు అవుతుంది.
  3. సయ్యద్ సుభానీ, చిన సుభానీ సోదరులు, తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, పైరులకు పురుగుమందు పిచికారీ చేయడానికి వీలుగా సౌరశక్తితో పనిచేసే ఒక "సికిల్ స్ప్రేయర్"ను తయారుచేసారు. దీనితో కేవలం 10 నిమిషాలలో, ఒక వంద రూపాయల ఖర్చుతో, ఒక ఎకరం పొలానికి, పురుగుల మందు పిచికారీ చేయవచ్చు. ఈ సికిల్ స్ప్రేయర్ తయారుచేయడానికి వీరికి రు. 25,000-00 ఖర్చు అయింది.
  4. సయ్యద్ సుభానీ రెండువేల రూపాయల ఖర్చుతో, 12 లీటర్ల ట్యాంకుతో, సౌరశక్తితో నడిచే ఒక పంపుసెట్టును తయారుచేసాడు. దీనికి 12 వోల్టుల బ్యాటరీ ఒకటి, 20 వోల్టుల సౌర ప్యానెల్ ఒకటి, 12 వోల్టుల డయాఫ్రం మోటర్ ఒకటి అవసరమవుతుంది.. ఈ పరికరంతో ఒక ఎకరం పొలంలో, ఒక అరగంటలో పురుగు మందు పిచికారీ చేయవచ్చు.

ప్రధానపంటలు

మార్చు

వరి, అపరాలు, కూరగాయలు

ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం

మూలాలు

మార్చు