నాగిళ్ళ రామశాస్త్రి రచయిత, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షులు[1].

నాగిళ్ళ రామశాస్త్రి
Nagilla Rama Sastry.jpg
నాగిళ్ళ రామశాస్త్రి చిత్రం
జననంకరీంనగర్ జిల్లా
నివాసంకరీంనగర్
వృత్తిరచయిత, విమర్శకుడు
యజమానివిద్యుత్ శాఖ ఉద్యోగి(పదవీవిరమణ)
స్వస్థలంకరీంనగర్ జిల్లా, ముల్కనూరు గ్రామం.

జీవిత విశేషాలుసవరించు

ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటులో ఉద్యోగం చేసి పదవీవిరమణ చేసారు. ఆయన కాళోజీ కి అత్యంత సన్నిహితుడు. ఆయనకు కాళోజీ నారాయణరావు గారిలో నాలుగు దశాబ్దాల సాన్నిహిత్యం ఉన్నది. ఆయన ఎక్కువగా రాయలేదు.ఆయన ఒక సహృదహద సాహిత్యాధ్యయనశీలిగా గుర్తింపు పొందారు.ఆయన "కాళోజీ ముచ్చట్లు" తో తన వచర రచనా ప్రజ్ఞను ప్రపంచానికి తెలియజేసారు. ఈ పుస్తకం చదివితే మన మధ్యలేని కాళోజీతో గంటల తరబడి మాట్లాడినట్లు ఉంటుంది. అందులో మరుగున పడిపోతున్న తెలంగాణ నుడికారపు కమ్మదనం పరిమళభరితంగా పరిచయమవుతుంది.

ఆయన అనేక సాహితీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయన "మిత్రమండలి" కి కన్వీనరుగా కూడా యున్నారు. ఆయన కాళోజీ ఫౌండేషన్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు. కాళోజీ జ్ఞాపకార్థం మ్యూజియం ఏర్పాటుకు కృషిచేస్తున్నారాయన. ఆయన కవి కానప్పటికీ కరీంనగర్ జిల్లాలో ముల్కనూరు కు చెందిన శాస్త్ర అద్భుతమైన సాహిత్య విమర్శకుడుగా గుర్తింపబడ్డారు.

అవార్డులుసవరించు

ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'జీవిత చరిత్ర'విభాగంలో లో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.[2][3]

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు