నాగు

టి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో 1984లో విడుదలైన తెలుగు చలనచిత్రం

నాగు 1984, అక్టోబరు 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. భువనేశ్వరి మూవీస్ పతాకంపై ఎం. కుమరన్, కె. షణ్ముగం, పద్మ కుమరన్ నిర్మాణ సారథ్యంలో టి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, రాధ నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు. హరనాథ్ నటించిన చివరి చిత్రం.[1]

నాగు
(1984 తెలుగు సినిమా)
Naagu Movie Poster.jpg
దర్శకత్వం టి.ఎల్.వి.ప్రసాద్
నిర్మాణం ఎం. కుమరన్, కె. షణ్ముగం, పద్మ కుమరన్
తారాగణం చిరంజీవి
రాధ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ భువనేశ్వరి మూవీస్
విడుదల తేదీ అక్టోబరు 11, 1984
నిడివి 123 నిముషాలు
భాష తెలుగు

కథసవరించు

నాగు (చిరంజీవి) వృత్తిరీత్యా చిన్నపాటి గుండా. అతను రజని (రాధ) ని ప్రేమిస్తుంటాడు. ఒక రోజు రజని ఒక హోటల్ పై అంతస్తు నుండి పడి చనిపోతుంది. ఆమె హత్యానేరం నాగుపై పడుతుంది. నాగు తండ్రిని జగపతిరావు (కొంగర జగ్గయ్య) అనే వ్యక్తి చంపాడని, రజని హత్య కూడా అతనే చేశాడని నాగు తల్లి చెబుతుంది. జగపతిరావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సంపాదించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి నాగు ఏంచేశాడు, ఎలా విజయం సాధించాడన్నది మిగతా కథ.

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం: టి.ఎల్.వి.ప్రసాద్
 • నిర్మాణం: ఎం. కుమరన్, కె. షణ్ముగం, పద్మ కుమరన్
 • సంగీతం: కె. చక్రవర్తి
 • నిర్మాణ సంస్థ: భువనేశ్వరి మూవీస్
 • సమర్పణ: ఏవియం ప్రొడక్షన్

పాటలుసవరించు

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[2]

 1. మంచోడు అనుకున్న
 2. ముక్కుమీద కోపం
 3. నన్నంటుకోమాకు చలి గాలి
 4. ఓ చెలి

మూలాలుసవరించు

 1. Indiancine.ma, Movies. "Nagu (1984)". www.indiancine.ma. Retrieved 16 August 2020.
 2. Naa Songs, Songs (23 April 2014). "Naagu Songs". www.naasongs.com. Retrieved 16 August 2020.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=నాగు&oldid=3028540" నుండి వెలికితీశారు