పీలా కాశీ మల్లికార్జునరావు

సినీ నటుడు
(మల్లికార్జున రావు (నటుడు) నుండి దారిమార్పు చెందింది)

మల్లికార్జునరావు (1950 అక్టోబరు 10 - 2008 జూన్ 24) తెలుగు సినీ, రంగస్థల హాస్య నటులు.[1] అతని పూర్తి పేరు పీలా కాశీ మల్లికార్జునరావు. పాఠశాల దశనుంచే నాటకాల్లో నటించే వారు. 50 నుంచి 60 నాటకాలూ, ఏకపాత్రాభినయం పాత్రలూ అతనికి నటన మీద మంచి పట్టు లభించేదానికి దోహదపడ్డాయి.

మల్లికార్జునరావు
జననం
పీలా కాశీ మల్లికార్జునరావు

(1950-10-10)1950 అక్టోబరు 10
మరణం2008 జూన్ 24(2008-06-24) (వయసు: 57)
మరణ కారణంరక్త కేన్సర్
వృత్తిరంగస్థల నటుడు, సినిమా నటుడు
రాజకీయ పార్టీతెలుగుదేశం
పిల్లలుఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు
తల్లిదండ్రులు
  • పీలా పోతు నాయుడు (తండ్రి)
  • పీలా అచ్చియమ్మ (తల్లి)

తొలి జీవితం

మార్చు

మల్లిఖార్జునరావు , పీలా పోతు నాయుడు, పీలా అచ్చియమ్మ దంపతులకు 1950 అక్టోబరు 10న అనకాపల్లిలోని గవరపాలెంలో జన్మించారు. అతని తండ్రి పీలా పోతు నాయుడు స్వాతంత్ర్య సమరయోధుడు, అనకాపల్లిలో భూస్వామి. మల్లికార్జునరావు గవరపాలెంలో గౌరీ వ్యాయామశాలను ఏర్పాటు చేశారు.అతని మార్గదర్శకత్వంలో మళ్ల వెంకట మాణిక్యాలు 1984 ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్నారు.[2]

భమిడిపాటి రాధాకృష్ణ రాసిన లెక్కలు తెచ్చిన చిక్కులు అతని తొలి నాటకం. అతనిని రంగస్థలంపై నటుడిగా నిలబెట్టింది పలుకే బంగారమాయె చిత్రం. ఇందులో నిర్మాత వేషం మల్లికార్జునరావుకి ఎంతో గుర్తింపు నిచ్చింది. అనకాపల్లిలోనే ఎ.ఎమ్‌.వి.ఎమ్‌. ఆసుపత్రిలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. అక్కడి ట్రేడ్‌ యూనియన్‌కి నాయకత్వం వహించారు. అతనికి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

సినీ ప్రస్థానం

మార్చు

దివంగత నటులు రావు గోపాలరావు సహకారంతో చిత్రసీమలోకి ప్రవేశించారు. 1972లో తులసి అనే చిత్రంలో చిన్నవేషం వేశారు. ఆ సమయంలోనే పార్వతీ పరమేశ్వరులు చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. తరువాత నాగమల్లి లాంటి కొన్ని చిత్రాల్లో నటించారు. వంశీతో ఏర్పడ్డ పరిచయం అతని సినీజీవితాన్ని మలుపు తిప్పింది.

వంశీ మొదటిచిత్రం మంచు పల్లకీలో చిన్న పాత్ర పోషించారు. అన్వేషణలో పులిరాజుగా మల్లికార్జునరావు నటన చిత్రసీమను ఆకట్టుకొంది. అదే సమయంలో తన తండ్రి అస్వస్థతకు లోనైతే అనకాపల్లి వెళ్లడం వల్ల అవకాశాలు కోల్పోయారు. 'లేడీస్‌ టైలర్‌'లో బట్టల సత్యం పాత్ర తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 350కి పైగా సినిమాల్లో నటించారు. తమ్ముడు సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును పొందారు. ఏప్రిల్‌ ఒకటి విడుదల, కనకమాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ట్రూపు, హలో బ్రదర్‌, ఆలీబాబా అరడజను దొంగలు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, బద్రి, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఎవడి గోల వాడిది, మా ఆయన సుందరయ్య (2001) లాంటి చిత్రాలు అతనికి ఏంతో పేరు తీసుకొచ్చాయి. మల్లికార్జునరావు నటనలో తనకంటూ ఓ పంథాను ఏర్పరచుకొన్నారు. తొలినాళ్లలో రావుగోపాలరావు ప్రభావం ఉండేది. తన సంభాషణ శైలిలో ఉత్తరాంధ్ర యాసని మేళవించడంతో జనాన్ని సులభంగా ఆకట్టుకోగలిగారు. ఆ యాసనీ, మాండలికాన్నీ సాధికారికంగా మాట్లాడగలిగిన నటుడిగా గుర్తింపు పొందారు. అలాగే గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్రలకు జీవంపోసే నటుల్లో అతను ముందుండే వారు. చివరిగా ఆయన నటించిన చిత్రం మహా నగరంలో.

నటించిన చిత్రాలు

మార్చు

పురస్కారాలు

మార్చు

పదవులు

మార్చు
  • తెలుగుదేశం పార్టీతో సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా[1] అతనుకు సన్నిహిత సంబంధాలున్నాయి.
  • మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లు ఎంపికయ్యారు.

57 సంవత్సరాల వయస్సులో మంగళవారం 24 జూన్, 2008 ఉదయం 10.30 ని.లకు రక్త కేన్సర్‌ (లుకేమియా) వ్యాధితో తుదిశ్వాస విడిచారు.[1]

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 ఈనాడు దినపత్రిక వెబ్సైట్ నుండి నవ్వుల మల్లి ఇక లేరు Archived 2011-09-01 at the Wayback Machine వివరాలుజూన్ 25,2008న సేకరించబడినది.
  2. TeluguOne (2021-06-24), Comedian Mallikarjuna Rao First Social Media Interview | Battala Satti Comedy | TeluguOne, retrieved 2025-02-21
  3. "143 review". idlebrain. Retrieved 16 May 2019.
  4. తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Archived from the original on 16 మే 2019. Retrieved 16 May 2019.
  5. ఆంగ్లదిన పత్రిక ది హిందూ వెబ్సైట్ నుండి Comedy is his forte Archived 2008-06-27 at the Wayback Machine వివరాలుజూన్ 25,2008న సేకరించబడినది.