నాగౌర్ జిల్లా

రాజస్థాన్ లోని జిల్లా

రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో నగౌర్ జిల్లా ఒకటి. ఈ జిల్లాలో మొదటిసారిగా పంచాయితీ రాజ్ పరిపాలన ప్రవేశపెట్టబడింది. జిల్లా వైశాల్యం 17,718 చ.కి.మీ. నాగౌర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది.

నాగౌర్ జిల్లా
ఎడమ నుండి సవ్యదిశలో: లడ్నులోని జైన దేవాలయం, నాగౌర్ కోట, మెర్టా వద్ద మీరాబాయి మ్యూజియం, స్కైలైన్ ఆఫ్ దిద్వానా, జోర్డాలోని బాబా హరిరామ్ ఆలయం
నాగౌర్ జిల్లా
రాజస్థాన్
రాజస్థాన్ పటంలో నాగౌర్ జిల్లా స్థానం
రాజస్థాన్ పటంలో నాగౌర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
డివిజనుఅజ్మీర్ విభాగం
ముఖ్య పట్టణంనాగౌర్
మండలాలు
విస్తీర్ణం
 • మొత్తం17,718 కి.మీ2 (6,841 చ. మై)
Websiteఅధికారిక జాలస్థలి
16. రాజస్థాన్ రాష్ట్ర పటంలో నాగౌర్ జిల్లా స్థానం

భౌగోళికం

మార్చు

నగౌర్ జిల్లా 26°25' & 27°40' ఉత్తర అక్షాంశం, 73°.10' & 75°.15' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా వాయవ్య సరిహద్దులో బికనీర్ జిల్లా, ఉత్తర సరిహద్దులో చురు జిల్లా, ఈశాన్య సరిహద్దులో సికార్ జిల్లా, తూర్పు సరిహద్దులో జైపూర్ జిల్లా, ఆగ్నేయ సతిహద్దులో అజ్మీర్ జిల్లా, వాయవ్య, పశ్చిమ సరిహద్దులో జోధ్‌పూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో పాలి జిల్లాలు ఉన్నాయి. జిల్లా రాజస్థాన్ లోని మేవార్ ప్రాంతంలో ఉంది. ఇది థార్ ఎడారి సమీపంలో ఉన్న " నార్త్‌వెస్టర్న్ థార్న్ స్క్రబ్ ఫారెస్ట్స్" బెల్టులో ఉంది. జిల్లా ఆగ్నేయ భూభాగం వరకు ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్నాయి. జిల్లా ఆగ్నేయ మూలలో దేశంలోనూ రాష్ట్రంలోనూ అతిపెద్ద ఉప్పునీటి సరోవరంగా గుర్తించబడుతున్న " సంభర్ సరోవరం " ఉంది. ఈ సరోవరం జైపూర్ సరిహద్దు వరకు విస్తరించి ఉంది.

తాలూకాలు

మార్చు

జిల్లాలో 10 తాలూకాలు ఉన్నాయి: నాగౌర్, ఖిన్వ్సర్, జయాల్, మెర్ట, డెగన, దిద్వానా, లడ్నన్, పర్బత్సర్, రాయి, కుచమన్. ఖివంసర్ కాక మిగిలినవన్నీ ఉపవిభాగాలుగా ఉన్నాయి. జిల్లాలో 11 మండలాలు 1607 గ్రామాలు ఉన్నాయి.

2011 గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,309,234, [1]
ఇది దాదాపు. ఉరుగుయా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 102 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 187 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.25%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 948:1000 [1]
జాతీయ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 64.08%.[1]
జాతీయ సరాసరి (72%) కంటే. అల్పం

చారిత్రిక జనాభా

మార్చు
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19015,24,217—    
19115,59,111+0.65%
19214,87,462−1.36%
19315,68,434+1.55%
19416,56,377+1.45%
19517,63,829+1.53%
19619,34,948+2.04%
197112,62,157+3.05%
198116,28,669+2.58%
199121,44,810+2.79%
200127,75,058+2.61%
201133,07,743+1.77%
source:[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Uruguay 3,308,535 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Connecticut 3,574,097
  4. Decadal Variation In Population Since 1901

సరిహద్దులు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు