నానల్ నగర్
నానల్ నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని వార్డు నెంబరు 69లో ఉంది. ఇక్కడ బృందావన్ కాలనీ, ఖాదర్ బాగ్, సాలార్ జంగ్ కాలనీ, దిల్షాద్ నగర్ కాలనీ, డ్రీం స్టేట్ అనే ఉప ప్రాంతాలు ఉన్నాయి.
నానల్ నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°23′41″N 78°25′38″E / 17.394611°N 78.427167°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
జనాభా | |
• Total | 1,50,000 |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 028 |
Vehicle registration | టిఎస్ 13 |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | కార్వాన్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
సమీప ప్రాంతాలు
మార్చు- ఉత్తరం వైపు బంజారా హిల్స్, అహ్మద్ నగర్
- తూర్పు వైపు షేక్ పేట, టోలీచౌకీ
- దక్షిణం వైపు లంగర్‌హౌస్, గుడిమల్కాపూర్
- పశ్చిమం వైపు మెహదీపట్నం, విజయనగర్ కాలనీ
ప్రార్థనా స్థలాలు
మార్చుఇక్కడికి సమీపంలో శ్రీ సాయిబాబా దేవాలయం, కనకదుర్గ దేవాలయం, మస్జిద్-ఇ-సల్మా, మదీనా మసీదు మొదలైన ప్రార్థనా స్థలాలు ఉన్నాయి.
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నానల్ నగర్ మీదుగా సికింద్రాబాదు, లక్డికాపూల్, టోలీచౌకీ, బాపు ఘాట్ మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[2] ఇక్కడికి సమీపంలోని నాంపల్లి రైల్వే స్టేషను, లక్డికపూల్ రైల్వే స్టేషనులలో ఎంఎంటిఎస్ రైలు సౌకర్యం ఉంది.
ఇతర వివరాలు
మార్చునానల్ నగర్ రోడ్డు నుండి (కాంగ్రెస్ హ్యాండ్ విగ్రహం[3]) నుండి లంగర్ హౌజ్, గుడిమల్కాపూర్ వైపు వెళ్ళే త్రి-జంక్షన్ వరకు అనేక దుకాణాలు ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "Nanal Nagar, Mehdipatnam Locality". www.onefivenine.com. Retrieved 2021-02-03.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-03.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Sonia Gandhi unveils pylon in memory of freedom fighters". The Hindu. 2006-01-22. ISSN 0971-751X. Retrieved 2021-02-03.