నానాసాహెబ్ పురోహిత్
దిగంబర్ వినాయక్ పురోహిత్, (1907 మే 28 - 1994), అలియాస్ నానాపురోహిత్ లేదా నానాసాహెబ్ పురోహిత్, కొలాబా ప్రాంతంలోని మహాద్ కు చెందిన ఒక భారతీయ సోషలిస్ట్ రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు.[1][2][3][4][5] పురోహిత్ భారత స్వాతంత్ర్యోద్యమంలో తీవ్రవాదపోరాటాలకు నాయకత్వం వహించాడు. సుదీర్ఘకాలం లోక్‌సభ సభ్యుడుగా ఉన్నాడు
వ్యక్తిగత జీవితం
మార్చుపురోహిత్ మహార్ సంతతికి చెందినవాడు.[6] అతను తన ఇరవైసంవత్సరాల వయస్సులో సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు.[1] రాజకీయ కార్యకలాపాలు కాకుండా, పురోహిత్ ఉద్యానవనాలను ఆస్వాదించాడు.[1]
క్విట్ ఇండియా ఉద్యమం
మార్చుకాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ, క్విట్ ఇండియా ఉద్యమంలో పురోహిత్ చురుకుగా పాల్గొన్నాడు.[1] అతను మహాద్‌లో తహసీల్దార్ కార్యాలయంపై నిర్వహించిన రైతుల భారీ తిరుగుబాటు దాడికి నాయకత్వం వహించాడు.[3][7] దాడిసమయంలో జరిగినకాల్పుల్లో ఒక ప్రభుత్వ అధికారితోసహా ఐదుగురు తిరుగుబాటుదారులు మరణించారు.[8] ఆతర్వాత పురోహిత్ పోలీసుల వల నుండి తప్పించుకున్నాడు. అతను కరాచీకి మకాం మార్చాడు. ఈ కాలంలో అతను పూనాలోని సోషలిస్ట్ నాయకత్వం ఆదేశాల మేరకు పనిచేశాడు. అచ్యుత్ పట్వర్ధన్ కేంద్రవ్యక్తిగా పనిచేశాడు.పట్వర్ధన్ కరాచీలో ఉద్యమాన్నినిర్వహించే బాధ్యతను పురోహిత్ కు అప్పగించాడు.[3]
జంజీరా పోరాటం
మార్చు1948లో పురోహిత్, సమీపంలోని జంజీరారాష్ట్రాన్ని విముక్తి చేయడానికి ప్రజల సైన్యం నాయకుడు మోహన్ ధరియాతో కలిసిపోరాడాడు.[8] తిరుగుబాటుదారులు మసలే తాలూకా సరిహద్దులోని ఖమ్‌గావ్ వద్ద సైనిక శిబిరాన్నిఏర్పాటుచేశారు అక్కడ స్వతంత్ర జంజీరా రాష్ట్రం కోసం తాత్కాలిక ప్రభుత్వాన్ని [8][9] పురోహిత్ (ప్రధాన మంత్రి), సదాశివ్ బగైత్తర్ (హోం మంత్రి), మోహన్ ధారియా (విదేశాంగ మంత్రి) జనార్దన్ భోక్రే (రక్షణ మంత్రి) లుగా పోటీప్రభుత్వం ఏర్పాటు చేశారు.[8][9]
ఎన్నికల రాజకీయాలు
మార్చుఅతను 1951 బొంబాయి శాసనసభ ఎన్నికల్లో విజేతగా నిలిచాడు. పోలాద్పూర్ - మహాద్ నియోజకవర్గంలో 13,597 ఓట్లతో (68.63%) గెలిచాడు.[2][10] అతను సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఆ సమయంలో, అతను కీలకపరిశ్రమల జాతీయీకరణ, ప్రపంచ రాజకీయాలలో మూడవ శిబిరాన్ని నిర్మించడం కోసం వాదించాడు.[1]
ప్రజా సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా 19,091 ఓట్లు (70.40%) సాధించి,1957 శాసనసభ ఎన్నికల్లో మహాద్ స్థానాన్ని అతను నిలుపుకున్నాడు.[11] 1961 నాటికి పురోహిత్ మహారాష్ట్ర శాసనసభలో పి.ఎస్.పి. ఉపనాయకుడుగా ఎదిగాడు.[12] అయితే,1962 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రహీమ్ ఎ.గఫూర్ అంతూలే చేతిలో శ్రీవర్ధన్ నియోజకవర్గంలో ఓడిపోయాడు.పురోహిత్ 7,475 ఓట్లతో (25.76%) రెండవ స్థానంలో నిలిచాడు.[13]
పురోహిత్ 1972లో మహారాష్ట్ర నుండితిరిగి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా 27,737 ఓట్లతో (55.32%) ఎన్నికయ్యాడు.[14] 1978 శాసనసభ ఎన్నికల్లో పురోహిత్ జనతా పార్టీ అభ్యర్థిగా మహాద్ సీటును గెలిచాడు.అతను 37,413 ఓట్లు (60.03%) పొందాడు.[15]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 Sud, S. P. Singh, and Ajit Singh Sud. Indian Elections and Legislators. Ludhiana: All India Publications, 1953. p. 194
- ↑ 2.0 2.1 Chavan, Yashwantrao Balwantrao, and Viṭhṭhala Gopāḷa Khobarekara. Yaśavantarāva Cavhāṇa, vidhimaṇḍaḷātīla nivaḍaka bhāshaṇe = Yeshwantrao Chavan, selected speeches (Marathi) in the state legislatures, 1946-62, Vol. 2. Mumbaī: Yaśavantarāva Cavhāṇa Pratishṭhāna Mumbaī, 1990. p 449
- ↑ 3.0 3.1 3.2 Chaudhari, K. K. Quit India Revolution: The Ethos of Its Central Direction. Mumbai: Popular Prakashan, 1996. pp. 303, 309
- ↑ Library of Congress. Accessions List, India. New Delhi: Library of Congress Office, 1977. p. 38
- ↑ The Journal of Parliamentary Information, Vol. 41. Lok Sabha Secretariat, 1995. p. 66
- ↑ Nehru, Jawaharlal, R. Kumar, and H. Y. Sharada Prasad. Selected Works of Jawaharlal Nehru, Vol. 8. 1989. p. 218
- ↑ Janata, Vol. 62. 2007
- ↑ 8.0 8.1 8.2 8.3 webindia123. Freedom fighter, leader, politician - Mohan Dharia remembered Archived 2021-09-27 at the Wayback Machine
- ↑ 9.0 9.1 Bhosale, Arun, Ashok S. Chousalkar, and Lakshminarayana Tarodi. Freedom Movement in Princely States of Maharashtra. Kolhapur: Shivaji University, 2001. p. 173
- ↑ Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1951 TO THE LEGISLATIVE ASSEMBLY OF BOMBAY
- ↑ Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1957 TO THE LEGISLATIVE ASSEMBLY OF BOMBAY
- ↑ Selections from the Departmental Decisions of the Speaker. Maharashtra Legislative Assembly. 1963. pp. 210, 212
- ↑ Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1962 TO THE LEGISLATIVE ASSEMBLY OF MAHARASHTRA
- ↑ Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1972 TO THE LEGISLATIVE ASSEMBLY OF MAHARASHTRA
- ↑ Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1978 TO THE LEGISLATIVE ASSEMBLY OF MAHARASHTRA