నామ్‌సాయ్ (అరుణాచల్ ప్రదేశ్)

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, నామ్‌సాయ్ జిల్లా లోని ఒక పట్టణం

నామసాయి, భారత రాష్ట్రమైన, అరుణాచల్ ప్రదేశ్ లోని నామసాయి జిల్లా ప్రధానకేంద్రం. ఈ ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనిి 60 నియోజకవర్గాలలో ఒకటి.నామ్సాయ్ నియోజకవర్గం ఎమ్మెల్యే 2016 ఆగష్టు నుండి జింగ్ను నామ్‌చూమ్ వ్యవహరిస్తున్నాడు.[1]

నామ్‌సాయ్
నగరం
నంసాయ్ వద్ద గోల్డెన్ పగోడా
నంసాయ్ వద్ద గోల్డెన్ పగోడా
నామ్‌సాయ్ is located in Arunachal Pradesh
నామ్‌సాయ్
నామ్‌సాయ్
భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో స్థానం
Coordinates: 27°40′08″N 95°52′17″E / 27.66894°N 95.87135°E / 27.66894; 95.87135
దేశం India
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
జిల్లానమ్సాయి
విస్తీర్ణం
 • Total1,587 కి.మీ2 (613 చ. మై)
జనాభా
 (2011)
 • Total95,950
 • జనసాంద్రత60.46/కి.మీ2 (156.6/చ. మై.)
భాషలు
 • అధికారఆంగ్లం
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
792103
టెలిఫోన్ కోడ్03806
Vehicle registrationAR-20

అవలోకనం

మార్చు

ఈ పట్టణ ప్రాంతం నావో-డిహింగ్ నదికి సమీపంలో ఉంది.నావో-డిహింగ్ నదిపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వంతెనను 2002 మార్చిలో ప్రారంభించిన తరువాత ఈ పట్టణం పెద్ద అభివృద్ధిని సాధించింది.ఇది 660.37 మీ. పొడవు కలిగిన వంతెన.పరశురాం వంతెన ప్రారంభోత్సవం తరువాత అరుణాచల్ ప్రదేశ్‌లో ఇది 2 వ స్థానానికి వచ్చింది.ఇది నామ్సాయ్ పట్టటణానికి 85 కి.మీ.దూరంలో ఉంది.తూర్పున 30 కిమీ దూరంలో డియున్ పట్టణం ఉంది. డియున్‌ పట్టణానికి వెళ్లే రహదారి, జాతీయ రహదారి - 52 నుండి ఒక మలుపు తీసుకుంటుంది.ఈ రహదారిని ఆయిల్ ఇండియా లిమిటెడ్ అభివృద్ధి చేసింది.ఇది ప్రతి సంవత్సరం మరింత దిగజారుతున్నప్పటికీ ఇప్పటికీ పనిచేస్తోంది.ప్రధాన రైల్వే స్టేషన్ టిన్సుకియా టౌన్ నుండి 75 కి.మీ.దూరంలో ఉంది.నామ్సాయ్ పట్టణ ప్రాంతంగా వేగంగా అభివృద్ధి చెందింది.

పర్యాటక

మార్చు

గోల్డెన్ పగోడా

మార్చు

నామ్‌సాయ్ జిల్లాలోని తెంగాపని వద్ద ఉన్న గోల్డెన్ పగోడా మఠం ప్రధాన పర్యాటక కేంద్రం.[2][3] ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ మఠాలలో స్థానిక తాయ్-ఖమ్తి భాషలో 'కొంగ్ము ఖామ్' గా పిలువబడే గోల్డెన్ పగోడా ఒకటి.[4]

మీడియా

మార్చు

నామ్‌సాయ్‌లో ఆల్ ఇండియా రేడియో ప్రసార కేంద్రం ఉంది. దీనిని ఆకాశవాణి, నామ్‌సాయ్ అని పిలుస్తారు.ఇది ఎఫ్ఎమ్ పౌన, పున్యాలపై ప్రసారం చేస్తుంది.

మూలాలు

మార్చు
  1. "Namsai MLA". Archived from the original on 19 August 2016. Retrieved 14 August 2016.
  2. "Namsai's Golden Pagoda awes fans in Zubeen's viral Mission China song". The News Mill. 2017-07-29. Retrieved 2017-08-18.
  3. Hundred novice monks ordained at the Golden Pagoda Archived 22 అక్టోబరు 2016 at the Wayback Machine, The Arunachal Times
  4. "నామ్సాయి, Miao". telugu.nativeplanet.com. Retrieved 2021-05-15.

వెలుపలి లంకెలు

మార్చు