నారాయణరావుపేట్ మండలం (సిద్ధిపేట జిల్లా)
నారాయణరావుపేట, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1][2][3] మండల కేంద్రం, నారాయణరావుపేట. మండల జనాభా 18970. 2016 లో చేసిన తొలి పునర్వ్యవస్థీకరణలో కాకుండా ఆ తరువాత నుండి 2021 వరకూ మధ్య గల కాలంలో కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో ఇది ఒకటి.[4][5] దానికి ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[6] ప్రస్తుతం ఈ మండలం సిద్దిపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా సిద్దిపేట రెవెన్యూ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 5 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు, 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 75చ.కి.మీ. కాగా, జనాభా 18,852. జనాభాలో పురుషులు 9,397 కాగా, స్త్రీల సంఖ్య 9,455. మండలంలో 4,595 గృహాలున్నాయి.[7]
నారాయణరావుపేట్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, నారాయణరావుపేట్ మండలం స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | సిద్దిపేట జిల్లా |
మండల కేంద్రం | నారాయణరావుపేట్ |
గ్రామాలు | 5 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 179 km² (69.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 18,852 |
- స్త్రీలు | 9,397 |
పిన్‌కోడ్ | 502107 |
మండల విశేషాలు
మార్చు◆ బుగ్గరాజేశ్వర స్వామి టెంపుల్ ఈ మండలంలోనే ఉంది.
◆ దేశంలోనే పేరుగాంచిన ఆదర్శ గ్రామం ఇబ్రహీంపూర్ ఈ మండలంలోనే ఉంది.
◆ దేశంలోనే వినూత్న ఆలోచన పేదవారి దహన సంస్కారాలకి 10000 రూపాయలు ఇస్తున్న గ్రామం గుర్రాలగొంది ఈ మండలంలోనే ఉంది.
సమీప మండలాలు
మార్చు◆ ఈ మండలానికి ఉత్తరాన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగాళ్లపల్లి, పశ్చిమాన ముస్తాబాద్ మండలం, దక్షిణాన సిద్దిపేట గ్రామీణ, తూర్పున చిన్నకోడూర్ మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమండలం లోని గ్రామ పంచాయతీలు
మార్చుఈ మండల పరిధిలో 10 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
- నారాయణరావుపేట్
- లక్ష్మీదేవిపల్లి
- కోదండరావుపల్లి
- బంజేరుపల్లి
- ఇబ్రహీంపూర్
- మాటిండ్ల
- గోపులాపూర్
- జక్కాపూర్
- గుర్రాలగొంది
- మల్యాల్
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "కొత్త మండలంగా నారాయణరావుపేట".
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 28, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
- ↑ "Four new mandals formed, total goes up to 589". The New Indian Express. Retrieved 2021-10-04.
- ↑ G.O.Ms.No. 28, Revenue (DA-CMRF) Department, Dated: 07-03-2019.
- ↑ "Four new mandals formed, total goes up to 589". The New Indian Express. Retrieved 2023-07-29.
- ↑ "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.