నారాయణవనం
నారాయణవనం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన జనగణన పట్టణం.[1]. ఇది పుత్తూరుకి 5 కి.మి., తిరుపతికి 40 కి.మి. దూరంలో ఉంది. కొన జలపాతాలు, సినిగిరి పెరుమాళ్ కోన, అధలన కోన నారాయణవనానికి అతి దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ జలపాతాలు సంవత్సరంలో 365 రోజులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ పట్టణం సముద్ర మట్టానికి 122 మీటర్ల ఎత్తులో, 13.42° రేఖాంశం 79.58° అక్షాంశం మీద ఉంది. ఇక్కడ అతిప్రాచీనమైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది.
శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంసవరించు
ఆకాశరాజు కూతురైన పద్మావతికి శ్రీ వేంకటేశ్వరస్వామికి వివాహం ఇక్కడే జరిగిందని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇక్కడ ప్రధాన ఆలయంలో ఉన్న దేవుడు శ్రీకళ్యాణ వేంకటేశ్వరుడు. ప్రధాన దేవాలాయానికి అనుబంధంగా చిన్న దేవాలయాలు ఉన్నాయి.అవి:
- శ్రీ పద్మావతి అమ్మవారు గుడి
- శ్రీ ఆండాళ్ అమ్మవారి గుడి
- శ్రీ సీత లక్ష్మణ సమేత రాములవారి గుడి
- శ్రీ రంగనాయకులవారి గుడి
- శ్రీ పరాశర స్వామివారి గుడి
- శ్రీ వీరభద్ర స్వామి వారి గుడి
- శ్రీ శక్తివినాయక గుడి
- శ్రీ అగస్త్యేశ్వరస్వామి గుడి
- శ్రీ అవనాక్షమ్మ గుడి
శ్రీ వేంకటేశ్వర స్వామికి పద్మావతికి ఇక్కడే వివాహం జరిగిందని అంటుంటారు. దానికి ఋజువుగా ఇక్కడ అమ్మవారి నలుగు పిండికి అవసరమైన తిరగలి కనిపిస్తోంది. ఈ దేవాలయం నిర్వహణా బాధ్యతలు 1967 నుండి తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆద్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతిఏడూ అమ్మవారికి 18 రోజులపాటు జాతర జరుగుతింది. అది ఆగస్టు 22 - 26 తేదీల మద్యలో ప్రారంబమై సెప్టెంబరు 11 -12 తేదీలలో ముగుస్తుంది. ఈ అమ్మవారికి పూజలు చేస్తే పెళ్ళికానివారికి పెళ్ళి అవుతుందని, పిల్లలు కలగని వారికి పిల్లలు కలుగుతారని భక్తుల నమ్మిక. శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి అయిన ఆకాశ రాజుకు ఈ అమ్మవారి కటాక్షంతోనే పద్మావతి జన్మించిందని భక్తులు నమ్ముతారు.
శ్రీ కైలాసనాధస్వామి ఆలయం, కైలాసకోనసవరించు
నారాయణవనం సమీపంలోని శ్రీ కామాక్షీ సమేత కైలాసనాధస్వామి ప్రకృతిలో ఒక ఆకృతిగా తరాలు మారినా చెక్కుచెదరని రమ్య మోహనాకృతిగా కొలువుదీరి ఉన్నాడు. శేషాచల కనుమలలో "కాకముఖ" పర్వత శ్రేణిపై ఈ కైలాసకోన ఆవరించి ఉంది. ప్రాకృతికశోభకు అచ్చమైన నెలవుగా, ప్రకృతి పులకింతకు నిక్కమైన కొలువుగా, కైలాసకోన ఆకట్టుకుంటుంది. శివుడే తన ఆత్మలింగాన్ని స్వయంగా ఇక్కడ కొండగుహలలో ప్రతిష్ఠించాడని పురాణకథనం.
పండుగలు విశేషాలుసవరించు
శ్రీ పరాశర స్వామి చంపకవల్లి అమ్మవారి ఉత్సవ విగ్రాహాలకి, శ్రీ అగస్త్యేశ్వరస్వామి, శ్రీ మరకతవల్లి అమ్మవారి ఉత్సవ విగ్రాహాలకి సంక్రాంతి తరువాత గిరి ప్రదిక్షణ అనే కొండ చుట్టు తిరునాళ్ళు జరుగుతాయి.
- ఆండ్డాళ్ నీరోత్సవం
- ఫంగుణి ఉత్తరోత్సవం
- తెప్పోత్సవం
- వరలక్ష్మీ వ్రతం
- ఆణీవారి ఆస్థానం
- రథ సప్తమి
- ఉగాది ఆస్థానం
- శ్రీ రామ నవమి
- చైత్ర పౌర్ణమి
- దీపావళి ఆస్థానం
- వైకుంత ఏకాదశి
- కార్తీక దీపం
మూలాలుసవరించు
ఇవి కూడా చూడండిసవరించు
- ఆంధ్ర ప్రదేశ్ విశిష్ట దేవాలయాలు
- ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా
- సొరకాయ స్వామి గురించి - ఆంగ్ల వికీ వ్యాసం en:Sorakaya Swami
[1] ఈనాడు తీర్థయాత్ర పేజీ. 2013 నవంబరు 27.
Wikimedia Commons has media related to Narayanavanam. |
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-08-20.