నారీ శక్తి వందన్ అధినియమ్

నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ (ఆంగ్లం: Nari Shakti Vandan Adhiniyam) అనేది లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు.[1][2]

నారీ శక్తి వందన్ అధినియమ్
భారత పార్లమెంట్
భారత రాజ్యాంగం (నూట ఇరవై ఎనిమిదవ సవరణ) బిల్లు, 2023
అమలయ్యే ప్రాంతం
  • అన్ని లోక్‌సభ నియోజకవర్గాలు
  • అన్ని శాసనసభ నియోజకవర్గాలు
Enacted byలోక్ సభ
Date enacted2023 సెప్టెంబరు 20
Enacted byరాజ్యసభ
Date enacted2023 సెప్టెంబరు 21
Date assented to2023 సెప్టెంబరు 29
Date of Royal Assentభారత రాష్ట్రపతి
ద్రౌపది ముర్ము
సమాప్తమైన తేదీఅమలులోకి వచ్చిన 15 సంవత్సరాల తర్వాత
Legislative history
Bill introduced in the లోక్ సభనారీ శక్తి వందన్ అధినియమ్
Introduced byమినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ (భారతదేశం), అర్జున్ రామ్ మేఘవాల్
Summary
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో దాదాపు 33 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేయడానికి.
Keywords
మహిళా రిజర్వేషన్, నారీ శక్తి, 33 శాతం రిజర్వేషన్

నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ రాజ్యాంగం (నూట ఇరవై ఎనిమిదవ సవరణ) బిల్లు, 2023కు అధికారిక పేరు.[3] ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 సెప్టెంబరు 19న భారత పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది.[4] రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో 2010లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు 27 ఏళ్లుగా ఆమోదానికి నోచుకోలేదు. అయితే, కొత్త పార్లమెంటు భవనంలో మొదటగా పరిగణించబడిన ఈ బిల్లు[5] 2023 సెప్టెంబరు 20న, లోక్‌సభ బిల్లును 454 అనుకూలంగా, రెండు వ్యతిరేకంగా ఆమోదించింది.[6] రాజ్యసభ 2023 సెప్టెంబరు 21న బిల్లుకు అనుకూలంగా 214 ఓట్లతో ఏకగ్రీవంగా ఆమోదించింది.[7]

మహిళా రిజర్వేషన్ బిల్లు దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉండగా నారీ శక్తి వందన్ అధినియమ్ బిల్లు లోక్‌సభ, రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. కొత్త పార్లమెంటు భవనంలో ఆమోదం పొందిన తొలి బిల్లుగా నమోదయింది.[8]

పార్లమెంట్‌లో ఆమోదం పొందిన నారీ శక్తి వందన్ అధినియమ్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 సెప్టెంబరు 29న సంతకం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అదేరోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ముందురోజు రాజ్యాంగ సవరణ బిల్లుపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సంతకం చేసాడు.[9]

నిబంధనలు

మార్చు

ప్రతిపాదిత చట్టం 33% మహిళా రిజర్వేషన్లను 15 సంవత్సరాల పాటు కొనసాగించాలని నిర్వచించింది. అదనంగా, ఇది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తుల కోసం పార్లమెంటు, శాసనసభలలో మహిళలకు కేటాయించిన రిజర్వ్‌డ్ సీట్లలో కోటా ఏర్పాటు చేయాలని ఆదేశించింది.[10]

కొత్త జనాభా గణనను ప్రచురించి, డీలిమిటేషన్ కసరత్తు పూర్తయిన తర్వాత రిజర్వేషన్ అమలు చేయాలని నిర్వచించారు. ఎన్నికల అనంతరం మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమలు చేసేందుకు జనాభా గణన చేపడతామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సభలో చెప్పాడు. 2024 భారత సాధారణ ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం త్వరలో డీలిమిటేషన్‌ను చేపడుతుందని, బిల్లు అమలులో జాప్యం జరుగుతుందనే భయాందోళనలను పక్కన పెడుతుందని కూడా ఆయన అన్నాడు.[11] జనాభా పెరుగుదలను ఖచ్చితంగా ప్రతిబింబించే లక్ష్యంతో డిలిమిటేషన్ ప్రక్రియ లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించిన నియోజకవర్గాల సరిహద్దుల సవరణను కలిగి ఉంటుంది. పూర్తిగా ఆమోదించడానికి, బిల్లుకు కనీసం 50% రాష్ట్రాల నుండి ఆమోదం అవసరం.[12]

ఇవీ చదవండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Women Reservation Bill: 140 కోట్ల భారత ప్రజలకు అభినందనలు: ప్రధాని మోదీ | pm modi congratulated 140 crore indians about womens quota bill passed in rajya sabha". web.archive.org. 2023-09-22. Archived from the original on 2023-09-22. Retrieved 2023-09-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "'God has given me the opportunity', says PM Modi as women quota bill tabled in LS". Hindustan Times (in ఇంగ్లీష్). 19 September 2023.
  3. Joy, Shemin. "Nari Shakti Vandan Adhiniyam: Top takeaways from the Women's Reservation Bill". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 20 September 2023.
  4. "Women's reservation Bill – imperfect but important".
  5. "Parliament special session: Govt introduces women's reservation bill in LS". Business Standard. Retrieved 19 September 2023.
  6. "India's lower house votes to reserve a third of seats for women". Al Jazeera English (in ఇంగ్లీష్). 20 సెప్టెంబరు 2023. Wikidata Q122735230. Archived from the original on 20 September 2023.
  7. "Women Reservation Bill | పోస్ట్‌ డేటెడ్‌ చట్టం.. మహిళా బిల్లుకు పార్లమెంటు ఆమోదం.. డీలిమిటేషన్‌ తర్వాతే అమల్లోకి-Namasthe Telangana". web.archive.org. 2023-09-22. Archived from the original on 2023-09-22. Retrieved 2023-09-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. "Narendra Modi: మహిళామణులకు మోదీ తల వంచి నమస్కారం.. ఎందుకంటే? - 10TV Telugu". web.archive.org. 2023-09-22. Archived from the original on 2023-09-22. Retrieved 2023-09-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. "Draupadi Murmu: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర | womens reservation bill gets prez murmus nod". web.archive.org. 2023-09-29. Archived from the original on 2023-09-29. Retrieved 2023-09-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  10. "India: 5 key takeaways from Women's Reservation Bill aka 'Nari Shakti Vandan Adhiniyam'". WION (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 20 September 2023.
  11. "Census, delimitation exercise after election: Amit Shah on women's quota bill". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-09-21.
  12. "India: 5 key takeaways from Women's Reservation Bill aka 'Nari Shakti Vandan Adhiniyam'". WION (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 20 September 2023.