నిజాం క్లబ్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సైఫాబాద్‌లో ఉన్న క్లబ్.

నిజాం క్లబ్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సైఫాబాద్‌లో ఉన్న క్లబ్. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎదురుగా ఉన్న ఈ క్లబ్ చుట్టూ 4 ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉంది.[1]

నిజాం క్లబ్
నిజాం క్లబ్
స్థానంసైఫాబాద్‌, హైదరాబాదు, తెలంగాణ
యజమానిహైదరాబాద్ రేస్ క్లబ్
ప్రారంభం1884, సెప్టెంబరు 26
అధికారిక వెబ్‌సైటు

చరిత్ర

మార్చు

1884, సెప్టెంబరు 26న ఈ క్లబ్ స్థాపించబడింది. నిజాం కాలంలో నవాబ్ మహబూబ్ అలీ ఖాన్, అసఫ్ జా VI కు హైదరాబాద్ రాష్ట్రంలో సికింద్రాబాద్ క్లబ్ మాత్రమే ఉండేది. ప్రత్యేకంగా ఇది బ్రిటిష్ రెసిడెంట్‌కి మాత్రమే పరిమితమయింది. దాంతో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన మంత్రి - మీర్ లైక్ అలీ ఖాన్ సాలార్ జంగ్ II జాతి, మతం, హోదా, సంస్కృతులతో సంబంధం లేకుండా అందరికోసం ఒక క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించడంతో ఈ నిజాం క్లబ్ ఏర్పాటు చేయబడింది.

1885లో, మహబూబ్ అలీ ఖాన్, అసఫ్ జాహ్ VI ఈ క్లబ్ భవనం అద్దెకు నెలకు 100 రూపాయలు మంజూరు చేశాడు. 1946 వరకు ఈ మంజూరు కొనసాగింది.[2] అబిడ్స్ ప్రాంతంలోని పాత జనరల్ పోస్ట్ ఆఫీస్ భవనం ఉన్న ప్రదేశంలో ఈ క్లబ్ ఉండేది. తరువాత, ప్రస్తుతమున్న మహబూబియా బాలికల పాఠశాల సముదాయంలోని ప్రాంగణానికి మార్చబడింది. తెలంగాణ శాసనసభకు ఎదురుగా ఉన్న క్లబ్ ప్రాంగణం 1906లో 30వేల రూపాయలకు కొనుగోలు చేయబడింది.[2]

నిర్వహణ

మార్చు

సాలార్ జంగ్ II ఈ క్లబ్ కు మొదటి అధ్యక్షుడిగా ఎన్నికై 1887 వరకు కొనసాగాడు. ఆ తరువాత 24మంది క్లబ్ అధ్యక్షులుగా పనిచేశారు.[2][1]

నిర్మాణం

మార్చు

4 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్లబ్ ప్రాంగణం ఉంది. యూరోపియన్ శైలిలో రాతి పోర్టికోతో, ఎత్తైన శిఖరాన్ని కలిగివుంది. లోపల అందమైన చెక్క మెట్లు ఉన్నాయి. అసలు నిర్మాణంలో వివిధ చేర్పులు, మార్పులు చేయబడ్డాయి. క్లబ్ రికార్డుల్లో నవాబ్ హకీమ్ ఉద్ డౌలాకు అద్భుతమైన బాంకెట్ గక్క్ యుబి 1910 నిర్మాణం, 1945లో డిజైన్ చేసి నిర్మించిన కార్డ్ రూమ్ గురించి రాయబడింది.[3]

సౌకర్యాలు

మార్చు

ఇందులో 300 మంది సిబ్బంది ఉన్నారు.[4] హైదరాబాద్‌లోని ఉత్తమ క్లబ్‌లలో నిజాం క్లబ్ ఒకటి.[5]

  • గ్రంథాలయం: 1884లో ప్రారంభించబడింది. ఇందులో దాదాపు 4000 పుస్తకాల (ఫిక్షన్, నాన్ ఫిక్షన్, చిల్డ్రన్, ఎన్‌సైక్లోపీడియా, హిస్టరీ, టెక్నికల్, అన్ని భాషల సాహిత్యాలు) ఉన్నాయి. నవాబ్ నజీర్ యార్ జంగ్ లైబ్రరీ వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశాడు.
  • హెల్త్ క్లబ్: క్లబ్ సభ్యుల కోసం ఫిజియోథెరపీ సదుపాయాలతో, లేడీస్ కోసం జిమ్, ఫిట్‌నెస్ సెంటర్ ఉన్నాయి. జంట నగరాల్లోని ఉత్తమ హెల్త్ క్లబ్ కేంద్రాలలో ఒకటిగా పేరొందింది.
  • షటిల్ కోర్టు: చెక్క ఫ్లోరింగ్‌తో రెండు ఇండోర్ షటిల్ కోర్టులు ఉన్నాయి.
  • స్విమ్మింగ్ పూల్: ఇందులో రెండు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. 14 ఏళ్లలోపు వారికి ప్రత్యేకంగా ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది.
  • టెన్నిస్ కోర్టు: ఫ్లడ్ లైట్లతో రెండు ఇసుక టెన్నిస్ కోర్టులు అందుబాటులో ఉన్నాయి.
  • బిలియర్డ్స్: ఒక బిలియర్డ్స్ విభాగం కూడా ఉంది.
  • కార్డ్స్ విభాగం: 24 గంటల పాటు కార్డ్స్ విభాగాన్ని నిర్వహిస్తుంది. ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్లు, రమ్మీ పోటీలు, విజట్ డ్రైవ్‌లను నిర్వహిస్తుంది.
  • రెస్టారెంట్: డైనింగ్ హాల్ (డైన్ 'ఎన్' డ్రింక్), బాంకెట్ గక్క్ యుబి, నిజాం మొఘల్ చెఫ్ రోజుల నుండి మటన్ బిర్యానీకి బాగా ప్రాచుర్యం పొందాయి.[6]

అవార్డులు

మార్చు

పునరుద్ధరణ, సంరక్షణ కృషికి మైలురాయిగా నిలిచినందుకు నగర వారసత్వ సంపదవిభాగంలో భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ చేత అవార్డు పొంది, వారసత్వ కట్టడంగా చేర్చబడింది.[3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Archived copy". Archived from the original on 28 October 2011. Retrieved 14 September 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. 2.0 2.1 2.2 [1] Archived 14 ఆగస్టు 2011 at the Wayback Machine
  3. 3.0 3.1 "Archived copy". Archived from the original on 25 March 2012. Retrieved 14 September 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "Striking Nizam Club employees seek fair deal". The Hindu. 21 August 2006. Retrieved 14 September 2021 – via www.thehindu.com.
  5. "Nizam Club V-P suspended | Hyderabad News". The Times of India. 2006-12-13. Archived from the original on 2012-06-16. Retrieved 14 September 2021.
  6. "Archived copy". Archived from the original on 27 October 2011. Retrieved 14 September 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)

బయటి లింకులు

మార్చు