నిజామాబాదు బస్ స్టేషను

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాదు నగరం మధ్యలో ఉన్న బస్ స్టేషను.

నిజామాబాదు బస్ స్టేషను, తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాదు నగరం మధ్యలో ఉన్న బస్ స్టేషను.[1] ఇది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ[2] (టిఎస్ఆర్టీసి) యాజమాన్యంలో ఉంది. బస్ స్టేషను నుండి తెలంగాణ రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] ఈ బస్ స్టేషనులో మొత్తం 30 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకుల విశ్రాంతి కోసం ప్రత్యేక గదులు కూడా ఉన్నాయి. నిజామాబాదు నగరంలో పాత బస్టాండ్, రెండు బస్ డిపోలు (నిజామాబాదు 1, నిజామాబాదు 2) ఉన్నాయి.

నిజామాబాదు బస్ స్టేషను
సాధారణ సమాచారం
Locationనిజామాబాదు, తెలంగాణ
భారతదేశం
Coordinates18°40′30″N 78°06′00″E / 18.675083°N 78.100109°E / 18.675083; 78.100109
యజమాన్యంటిఎస్ఆర్టీసి
నిర్వహించువారుతెలంగాణ ప్రభుత్వం
ఫ్లాట్ ఫారాలు30
నిర్మాణం
నిర్మాణ రకంAt Grade
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
స్టేషను కోడుఎన్.జెడ్.బి.
ప్రయాణికులు
ప్రయాణీకులు (ప్రతిరోజు)25,000+
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

సర్వీసులు

మార్చు

నిజామాబాదు జిల్లాలో బస్ ప్రయాణం అనేది ఒక ముఖ్యమైన రవాణా మార్గం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఈ నగరం నుండి[4] హైదరాబాదు, బెంగుళూరుకు మెర్సిడెస్ బెంజ్, వోల్వో బస్సులతో ప్రీమియం సర్వీసులు నడుపబడుతున్నాయి.

ఈ నగరం నుండి ముంబై, పూణే, నాగపూర్, వరంగల్, తిరుపతి, విజయవాడ, గోదావరిఖని వంటి ఇతర ప్రధాన నగరాలకు కూడా బస్సు సర్వీసులు ఉన్నాయి. ఈ బస్ స్టేషను రాష్ట్రంలోని ఇతర నగరాలకు, పట్టణాలకు, ముంబై, బెంగళూరు, నాగ్‌పూర్, అకోలా, నాందేడ్, గుల్బర్గా వంటి ఇతర రాష్ట్రాలలోని ముఖ్యమైన నగరాలకు కూడా కలుపబడి ఉంది. ఇక్కడినుండి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర ఏసి, గరుడ, గరుడ ప్లస్, మెర్సిడెస్ బెంజ్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

చిత్రమాలిక

మార్చు
నిజామాబాదు బస్ స్టేషను
 
నిజామాబాద్ బస్ స్టేషన్
నిజామాబాద్ బస్ స్టేషన్ 
 
టిఎస్ఆర్టీసి గరుడ ప్లస్ బస్సు సర్వీస్
టిఎస్ఆర్టీసి గరుడ ప్లస్ బస్సు సర్వీస్ 

మూలాలు

మార్చు
  1. "TSRTC". www.tsrtc.telangana.gov.in. Retrieved 2021-08-18.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-08-26. Retrieved 2021-08-18.
  3. "TSRTC will Formed by May 14 - The Hans India". thehansindia.com.
  4. "District – Profile". nizamabad.nic.in. Archived from the original on 6 November 2015. Retrieved 2021-08-18.