నిత్య కళ్యాణం పచ్చ తోరణం
నిత్య కళ్యాణం పచ్చ తోరణం 1960లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా ద్వారా రామకృష్ణ నటుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ తన ప్రసాద్ ప్రొడక్షన్స్ బేనర్‌పై అశోక్‌కుమార్, బీనారాయ్, రెహమాన్, తనూజ నటీనటులుగా ‘దాదీమా’గా హిందీలో 1966లో నిర్మించాడు.
నిత్య కళ్యాణం పచ్చ తోరణం (1960 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పినిశెట్టి శ్రీరామమూర్తి |
---|---|
నిర్మాణం | తోట కృష్ణమూర్తి |
తారాగణం | చలం, రామకృష్ణ, కృష్ణకుమారి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, గుమ్మడి వెంకటేశ్వరరావు, హేమలత, రాజశ్రీ |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | రౌతు పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- చలం - రంగా
- రామకృష్ణ - రామూ
- కృష్ణకుమారి - చాంద్
- సి.ఎస్.ఆర్. ఆంజనేయులు - శేషాద్రిశాస్త్రి
- గుమ్మడి వెంకటేశ్వరరావు - డా.ప్రకాశరావు
- హేమలత - శాంత
- రాజశ్రీ -షీలా
- అల్లు రామలింగయ్య - శంకరం
- సంధ్య - సుశీల
- సూర్యకాంతం - గంగారత్నం
- రమణారెడ్డి - సోమయాజులు
- వై.వి.రాజు - నాగన్న
- కె.వి.ఎస్.శర్మ -దాదా
- పేకేటి శివరాం
- నల్ల రామమూర్తి - గురువులు
- సీత - తలుపులమ్మ
సాంకేతికవర్గం
మార్చు- పాటలు: ఆరుద్ర
- కూర్పు: కెవి మార్తాండ్
- కళ: బిఎన్ కృష్ణ
- పోరాటాలు: రాఘవులు అండ్ పార్టీ
- సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
- నృత్యం: డి వేణుగోపాల్
- స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: ఎస్‌ఆర్ పినిశెట్టి
- నిర్మాత: తోట కృష్ణమూర్తి
- నిర్మాణ సంస్థ: రౌతు పిక్చర్స్
కథ
మార్చుడాక్టర్ ప్రకాశ్‌రావు(గుమ్మడి) అగ్రకులస్తుడు. మరో డాక్టరు సుశీల (సంధ్య)ను మతాంతర వివాహం చేసుకుంటాడు. అతని బావ శేషాద్రిశాస్త్రి (సిఎస్‌ఆర్) శుద్ధశోత్రియుడు. చెల్లెలు శాంత (హేమలత) పేరుకు తగిన ఇల్లాలు. బావమరిదిని ఇంటికి రానీయని శేషాద్రికి జడిసిన శాంత, తాను 7వ నెల గర్భిణియని, అంతకుముందు కాన్పులు పోవటంచేత అన్నగారివద్ద మందులు వాడతానని ఉత్తరం వ్రాస్తుంది. దానికి జవాబుగా మందులతో శాంత ఇంటికి వచ్చిన ప్రకాశరావును, భార్య సంధ్యను శేషాద్రి ఇంటినుంచి పంపివేసి, మరో ఊరిలోవున్న తన చెల్లెలు గంగారత్నం (సూర్యకాంతం), బావ సోమయాజులు (రమణారెడ్డి)ని ఇంటికి రప్పిస్తాడు. శాంతమ్మకు మగ పిల్లవాడు పుట్టడం, అదే సమయానికి హరిజనుడు నాగన్న (వైవి రాజు) భార్య ఒక పిల్లవాడిని కని మరణించగా, ప్రకాశరావు ఆ బాబును ఇంటికి తెచ్చి శాంత బిడ్డతోపాటు ఆ బాబుకు పాలిచ్చి పెంచమంటాడు. మంచిమనసుతో శాంతమ్మ అందుకు అంగీకరిస్తుంది. మగపిల్లవాడు కలిగాడని ఆనందంతో శేషాద్రి వచ్చి శాంత ప్రక్కనగల బిడ్డడిని తన కొడుకేనని తమ ఊరు తీసుకొస్తాడు. ఆ బాబుకు జ్వరం రావటంతో శాంతమ్మను పిలిపించటం, శాంతమ్మ తానక్కడ ఉండాలంటే మరో అనాధ బాలుడు ఇక్కడ పెరగాలని భర్తను కోరటంతో, శేషాద్రి కొడుకుని వాడు రంగాగా, నాగన్న కొడుకు రామూగా ఆ ఇంటిలో పెరిగి పెద్దవారవుతారు. ప్రకాశరావు దంపతులకు ఓ ఆడపిల్ల షీలా పుట్టడం, శేషాద్రి బంధువు శంకరం (అల్లు రామలింగయ్య) ఓ వర్ణాంతర వివాహం చేసికొని, ఓ ఆడపిల్లను కని మరణించటంతో పిచ్చివాడుగా తిరుగుతుంటాడు. ఆ పిల్ల చాంద్ పేరుతో ఓ దాదా (కెవిఎస్ శర్మ) వద్ద పెరుగుతుంది. అందరూ యుక్త వయస్కులయ్యాక షీలా (రాజశ్రీ), రామూ (రామకృష్ణ); రంగా (చలం), చాంద్ (కృష్ణకుమారి) పరస్పరం ప్రేమించుకోవటం, తన కొడుకు అని శేషాద్రి భావిస్తున్న రామూ, షీలాల వివాహం ఆపాలని శేషాద్రి పట్నం ప్రకాశరావు ఇంటికి వెళ్లటం, చాంద్ ముస్లిం యువతి రంగాతో వివాహం జరగరాదని పేకేటి బృందం అడ్డుపడడం, చివరికి శేషాద్రికి నిజం తెలిసి, రామూ, రంగా ఇద్దరూ తన బిడ్డలేనని అంగీకరించి వారి వివాహాలు ప్రకాశరావు నిర్మించిన నిత్యకల్యాణం పచ్చతోరణం కల్యాణ మండపంలో జరగటంతో చిత్రం ముగుస్తుంది[1].
పాటలు
మార్చు- అసలు నీవు రానేల అంతలోనే పోనేల మనసు దోచే చల్లగ -పి.బి.శ్రీనివాస్, జిక్కి
- ఎవరికి వారే యమునా తీరే ఇక లేనే లేరోయి నా అనువారే - పి.బి.శ్రీనివాస్
- చిరంజీవి పిల్లలారా చిన్నారి పాపల్లారా చింతలేక జీవించండి హాయిగా - ఎస్.జానకి
- నా మనసెంతో నాజూకు అది నజరానా నీకు - జిక్కి
- టనానా టంకు చలో రాజా టనానా టంకు చలో - ఘంటసాల - రచన: ఆరుద్ర
- సాగిపోవు ప్రియతమా ఆగుమా నా మనసులోని ఆవేదన తెలిసి మరలుమా - ఎస్.జానకి
- ఏం పిల్లో గాబర గీబరగున్నవో - పిఠాపురం, స్వర్ణలత
- నీమది పాడెను ఏమని నిజానికి నీవే నేనని - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
- నిత్యకల్యాణము, పచ్చతోరణము బంగారు భారతము - ఎస్.జానకి, సరోజిని బృందం
వనరులు
మార్చు- ↑ సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (24 November 2018). "ఫ్లాష్ బ్యాక్ @ 50 నిత్య కల్యాణం -పచ్చతోరణం". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 29 November 2018.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)