నిన్నే పెళ్ళాడుతా (1968 సినిమా)

నిన్నే పెళ్ళాడుతా ఎన్.టి.రామారావు, భారతి, సూర్యకాంతం తదితరులు ముఖ్యపాత్రల్లో నటించగా బి.విఠలాచార్య రచన దర్శకత్వం వహించిన 1968 నాటి తెలుగు చలన చిత్రం.

నిన్నే పెళ్ళాడుతా
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.వి.శ్రీనివాస్
నిర్మాణం బి.వి.శ్రీనివాస్
కథ బి.విఠలాచార్య
చిత్రానువాదం బి.విఠలాచార్య
తారాగణం నందమూరి తారక రామారావు,
భారతి,
షీలా,
విజయలలిత,
సూర్యకాంతం,
రమణారెడ్డి,
బాలకృష్ణ,
రావికొండలరావు,
ఛాయాదేవి,
పద్మాంజలి,
భానుమతి
సంగీతం విజయా కృష్ణమూర్తి
నేపథ్య గానం ఘంటసాల,
పి.సుశీల,
బసవేశ్వర్,
రఘురాం
నృత్యాలు చిన్ని-సంపత్
గీతరచన సి.నారాయణరెడ్డి
సంభాషణలు జి.కె.మూర్తి
ఛాయాగ్రహణం హెచ్.యస్.వేణు
కళ బి.నాగరాజన్
నిర్మాణ సంస్థ శ్రీ విఠల్ కంబైన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఇతివృత్తం

మార్చు

భారతి శ్రీమంతుల యింటిపిల్ల. షికార్లు తిరుగుతూ అర్థరాత్రి వేళకైనా ఇంటికి చేరకపోగా, ఇదేమిటని అడిగిన తండ్రిని లెక్కించదు. భారతి తండ్రి (రావి కొండలరావు) ఇదంతా చూస్తూ చాలా బాధపడుతూంటాడు, తల్లి (సూర్యకాంతం) మాత్రం ఆమె ప్రవర్తననే సమర్థిస్తూంటుంది. భార్యకు ఎదురాడలేక అతను మారు మాట్లాడలేక పోతాడు. అతని కొడుకు, కథనాయిక అన్న (కాకరాల) కూడా తండ్రిలాగే నోరూవాయీ లేని మనిషి. వాళ్ళింటి గుమాస్తా (రమణారెడ్డి) ఈ పరిస్థితి చూస్తూ బాధపడుతూంటారు. బయట కూతురునే వెనకేసుకువచ్చిన తల్లి కూడా ఏకాంతంలో ఆమెకు నచ్చచెప్పబోతుంది. పెళ్ళైనా ఇలాగే ఉంటావా అని అడిగితే పెళ్ళి అంటేనే బానిసత్వం, నేను పెళ్ళే చేసుకోను అని చెప్పి బాధపెడుతుంది.

కథానాయకుడు (ఎన్టీ రామారావు) గుమాస్తా అన్న కుమారుడు. మంచి చురుకైనవాడు, మొడివాడు. పెళ్ళంటే ఆసక్తి లేదంటాడు. అయితే బాబాయి తన యజమానుల కుమార్తె అందం గురించి చెప్పడంతో, ఆమెను నాటకాలాడైనా పెళ్ళి చేసుకుంటానని మాట ఇస్తాడు. సంగీతం మాస్టారిగా కథానాయిక ఇంట్లో చేరి ఆమెను రెచ్చగొడతాడు. ఆడది తలచుకుంటే మగాణ్ణి మైనపుముద్ద చేసేస్తుందంటే, నేను కరగనని పెళ్ళే చేసుకోనని అంటాడు. ఎలాగైనా కథానాయకుణ్ణి పెళ్ళికి ఒప్పించి పందెం గెలవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో అతణ్ణి ఉచ్చులోకి లాగబోయి తానే ప్రేమలో పడుతుంది.

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

1957లో విఠలాచార్య దర్శకత్వంలోనే, ఇదే విఠల్ కంబైన్స్ బ్యానర్ పై వద్దంటే పెళ్ళి సినిమా వచ్చింది. ఆ సినిమాకు ప్రముఖ ఆంగ్ల నాటకకర్త విలియం షేక్‌స్పియర్ రాసిన టేమింగ్ ఆఫ్ ద ష్రూ నాటకం మూలం. ఈ నిన్నే పెళ్ళాడుతా సినిమాను వద్దంటే పెళ్ళి సినిమా ఇతివృత్తాన్ని ఆధారం చేసుకుని తీశారు.

పాటలు

మార్చు
  1. ఓహొ పెళ్ళామా నా ముద్దుల పెళ్ళామా రూపంలో బెల్లమా కోపంలో - ఘంటసాల - రచన: డా॥ సినారె
  2. కాలం మారింది లోకం మారింది - ఘంటసాల, సుశీల, బసవేశ్వర్, రఘురాం - రచన: డా॥ సినారె
  3. చిట్టి పొట్టి పాపల్లారా - ఘంటసాల - రచన: డా॥ సినారె
  4. నిన్ను చూస్తేనే చాలు మనసు నిలువదూ నువ్వు వస్తేనే చాలు వేళ తెలియదు - సుశీల, రచన సి నారాయణ రెడ్డి
  5. మల్లెల పానుపు ఉంది చల్లని జాబిలి ఉంది నీ కోసమా నా కోసమా -సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
  6. రాగాలన్నీ నీవే అనురాగాలన్నీ నీవే అవి అందాలుగా అరవిందాలుగా నిను వలచెనులే - సుశీల, రచన: సి.నారాయణ రెడ్డి.

వనరులు

మార్చు