నిళల్‌గళ్ రవి

(నిళల్ గళ్ రవి నుండి దారిమార్పు చెందింది)

నిళల్‌గళ్ రవి ఒక భారతీయ సినిమా నటుడు. టెలివిజన్ నటుడు కూడా. ఇతడు తమిళ, మలయాళ, తెలుగు భాషా చలనచిత్రాలలో, సీరియళ్లలో నటించాడు. ఇతడు 1980లో అనే తమిళ సినిమాతో నటుడిగా తన వృత్తిని ప్రారంభించాడు.[1] ఇతడు 500కు పైగా సినిమాలలో నటించాడు.[2] ta:நிழல்கள் (திரைப்படம்)

నిళల్‌గళ్ రవి
జననం
రవిచంద్రన్ శ్యామణ్ణ

(1956-04-16) 1956 ఏప్రిల్ 16 (వయసు 68)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1980–ప్రస్తుతం
జీవిత భాగస్వామివిష్ణుప్రియ
పిల్లలురాహుల్

వృత్తి

మార్చు

నిళల్‌గళ్ రవి భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన నిళల్‌గల్ సినిమాతో తన నటజీవితాన్ని ఆరంభించాడు. ఆ సినిమా పేరే ఇతని ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. ఇతడు స్నేహశీలుడైన తండ్రి, నిర్దయుడైన విలన్, వెన్నుపోటు పొడిచే స్నేహితుడు వంటి అనేక విభిన్నమైన పాత్రలను ధరించాడు. అమితాబ్ బచ్చన్ వంటి నటులకు తమిళంలో డబ్బింగ్ చెప్పాడు. ఈటీవిలో ప్రసారమైన లాహిరి లాహిరి లాహిరిలో అనే తెలుగు టెలివిజన్ సీరియల్లో నటించాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

ఇతడు 1953, ఏప్రిల్ 16న శ్యామణ్ణ, డి.రాజమ్మ దంపతులకు తొమ్మిదవ సంతానంగా ఒక తమిళ సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. ఇతనికి ఐదుగురు అన్నలు, ముగ్గురు అక్కలు ఉన్నారు. ఇతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు రవిచంద్రన్. ఇతడు కొయంబత్తూరులోని పి.ఎస్.జి.ఆర్ట్స్ కాలేజీ నుండి ఎకనామిక్స్‌లో బి.ఎ. పట్టా పుచ్చుకున్నాడు. ఇతడు విష్ణుప్రియను వివాహం చేసుకున్నాడు. వీరికి రాహుల్ అనే కుమారుడున్నాడు.[3]

తెలుగు సినిమాల జాబితా

మార్చు

ఇతడు తమిళ, మలయాళ, కన్నడ సినిమాలతో పాటు కొన్ని తెలుగు సినిమాలలో నటించాడు.

ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

విడుదల సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు దర్శకుడు వివరాలు
1987 గౌతమి గిరీష్ క్రాంతి కుమార్ టైటిల్స్‌లో ఇతడి పేరును రవిబాబుగా పేర్కొన్నారు.
1988 ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ రాంకీ ముత్యాల సుబ్బయ్య
1989 పగలే వెన్నెల మణిరత్నం
1989 సూర్యోదయం సుందర్ కె.విజయన్
1990 అల్లుడుగారు కె.రాఘవేంద్రరావు
1990 లక్ష్మి దుర్గ రామనారాయణ
1992 గౌరమ్మ
1991 జైత్రయాత్ర ఉప్పలపాటి నారాయణ రావు
1991 ప్రేయసి మలేషియా వాసుదేవన్
1993 ఘరానా కూలి పి. వాసు
1993 నిప్పురవ్వ ఇంజనీర్ ఎ.కోదండరామి రెడ్డి
1994 అల్లరోడు నాయుడు కె.అజయ్ కుమార్
1994 ఖైదీ అన్నయ్య రాజశేఖర్
1995 గుంటూరు గుండమ్మ కథ జి.సి.శేఖర్
1996 ఆశ ఆశ ఆశ వసంత్
2008 కథానాయకుడు నిళల్‌గళ్ రవి పి. వాసు
2009 పున్నమినాగు హనీ తండ్రి ఎ.కోదండరామి రెడ్డి
2012 నువ్వెక్కడుంటే నేనక్కడుంటా శుభ సెల్వం
2018 కణం కృష్ణ తండ్రి ఎ.ఎల్.అజయ్ డబ్బింగ్ సినిమా
2019 NGK నంద గోపాల కృష్ణ తండ్రి సెల్వరాఘవన్
2024 మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా

మూలాలు

మార్చు
  1. "Grill mill -- 'Nizhalgal' Ravi". The Hindu. 21 November 2008.
  2. "It is 500 films for Nizhalgal Ravi". Kolly Insider.
  3. వెబ్ మాస్టర్. "Short biography". celebritykick. Retrieved 9 April 2020.

బయటి లింకులు

మార్చు